England vs India : ఈ తొండాట కోసమేనా…ఇంగ్లాండ్.. బజ్ బాల్ ను పక్కన పెట్టింది

బంతి నేలకు తాకి ఉండవచ్చునని ఫీల్డ్ ఎంపైర్ తో చర్చించి.. థర్డ్ ఎంపైర్ సలహా తీసుకోవాలని సూచించాడు. రోహిత్ శర్మ క్రీడా స్ఫూర్తిని ఉటంకిస్తూ ఇంగ్లాండ్ ఆటగాళ్లపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

Written By: NARESH, Updated On : February 24, 2024 10:36 pm
Follow us on

England vs India : “వరుస సిరీస్ లు గెలిచిన ఇంగ్లాండ్ జట్టుకు బజ్ బాల్ ఆట ఎంత ప్రమాదకరమో భారత జట్టు అర్థమయ్యేలా చేసింది. అందుకే రాంచి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు అసలు సిసలైన టెస్ట్ క్రికెట్ ఆడింది. ఇప్పటికైనా ఇంగ్లాండ్ జట్టు బజ్ బాల్ క్రికెట్ ను మానుకోవాలి.” నాలుగో టెస్ట్ లో ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులు చేసిన తర్వాత ఆ జట్టు మాజీ ఆటగాళ్లు అన్న మాటలు ఇవి. ఇంగ్లాండ్ జట్టు బజ్ బాల్ క్రికెట్ కు బదులు ఇండియా ముందు తొండి ఆట ఆడిందా? రాజ్ కోట్ టెస్టులో భారీ పరాజయాన్ని చవిచూసిన నేపథ్యంలో దొడ్డిదారి ఆటకు ప్రయత్నించిందా? ఈ ప్రశ్నలకు ఔను అనే సమాధానాలు వస్తున్నాయి. రాంచీ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులకు ఇంగ్లాండ్ జట్టు ఆల్ అవుట్ అయింది. అనంతరం తొలి ప్రారంభించిన భారత జట్టు రెండవ రోజు ఆట మూసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జట్టు కంటే 134 పరుగుల వెనుకంజలో ఉంది. ప్రస్తుతం క్రీజ్ లో ధృవ్(30), కులదీప్ యాదవ్ (17) ఉన్నారు.

నాలుగు పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన భారత జట్టును గిల్, యశస్వి జైస్వాల్ ద్వయం ఆదుకునే ప్రయత్నం చేసింది. వీరిద్దరూ కలిసి రెండో వికెట్ కు 82 పరుగులు జోడించారు. భారత జట్టు స్కోరు 86 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఎంపైర్ నిర్ణయం కారణంగా గిల్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత భారత జట్టు భారం మొత్తం జైస్వాల్ మీద పడింది.. వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ జైస్వాల్ ఒంటరి పోరాటం చేశాడు. అతడి స్కోరు 73 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇంగ్లాండు జట్టు ఔట్ అప్పీల్ చేసింది. ప్రస్తుతం ఈ అప్పీల్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. వాస్తవానికి క్రికెట్ ను జెంటిల్మెన్ గేమ్ అంటారు. కానీ ఇంగ్లీష్ జట్టు అలా వ్యవహరించలేదు. ఇదే సమయంలో ఇంగ్లీష్ జట్టు మీడియా కెప్టెన్ రోహిత్ శర్మను చూసి నేర్చుకోవాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.

నాలుగో టెస్ట్ రెండో రోజు భారత్ తొలి ఇన్నింగ్స్ లో 20 ఓవర్ లో రాబిన్ సన్ చివరి బంతిని జై స్వాల్ డిఫెన్స్ ఆడాలని ప్రయత్నించాడు. కాక పోతే ఆ బంతి బ్యాట్ ఎడ్జ్ ను తాకి ఇంగ్లాండ్ కీపర్ ఫోక్స్ వద్దకు వెళ్ళగా అతడు డైవ్ చేసి చేతుల్లో ఒడిసి పట్టుకున్నాడు. కానీ గ్రౌండ్ ను తాకిన తర్వాత బంతి ఫోక్స్ చేతిలో పడింది. గ్లవ్స్ ఆకు పచ్చ రంగులో ఉండటంతో ఔట్ గురించి నిర్ణయం తీసుకోవడానికి అంపైర్లు చాలా సేపు ఆలోచించారు.. అయితే మైదానంలో ఉన్న గడ్డితో కీపర్ గ్లవ్స్ కలర్ కలిసిపోవడంతో ఎంపైర్లు చాలా సమయం తీసుకున్నారు. అయితే బంతి నేలపై తాకిన తర్వాతనే ఫోక్స్ అందుకున్నాడని కనిపించింది. దీంతో జైస్వాల్ నాట్ అవుట్ గా నిలిచాడు. మరోవైపు ఎంపైర్ నిర్ణయాన్ని అలా ఊహించని ఇంగ్లాండ్ ఒక్కసారి షాక్ కు గురైంది. ఫోక్స్ కు ఇంటి నెలకు తగిలింది అని తెలిసినా బయటికి చెప్పలేదని నెటిజన్లు మండిపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో తమకు అనుకూలమైన నిర్ణయాలు రావాలని ఇంగ్లాండ్ ఆటగాళ్లు గ్లవ్స్ లో గ్రీన్ కలర్ వాడుతున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఇంగ్లాండ్ ఇలా తొండి ఆటను ఆడటం మానుకొని రోహిత్ శర్మను చూసి బుద్ధి తెచ్చుకోవాలని సూచిస్తున్నారు..

రోహిత్ శర్మ శనివారం ఆటలో జో రూట్ క్యాచ్ ను స్లిప్ లో అందుకున్నాడు. అలా ఎంపైర్లకు అప్పీల్ చేశాడు.. అలా అప్పీల్ చేస్తూనే తనకు ఉన్న అనుమానాన్ని వారితో పంచుకున్నాడు.. బంతి నేలకు తాకి ఉండవచ్చునని ఫీల్డ్ ఎంపైర్ తో చర్చించి.. థర్డ్ ఎంపైర్ సలహా తీసుకోవాలని సూచించాడు. రోహిత్ శర్మ క్రీడా స్ఫూర్తిని ఉటంకిస్తూ ఇంగ్లాండ్ ఆటగాళ్లపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.