India Vs England 5th Test: ఇంగ్లాండ్ కు వరుసగా నాలుగో ఓటమి. భారత్ కు నాలుగో విజయం. మొత్తానికి సిరీస్ 4-1 తేడాతో భారత్ వశం. ధర్మశాల వేదికగా జరిగిన ఐదవ టెస్టులో భారత జట్టు జయభేరి మోగించింది. ఇంగ్లాండ్ జట్టును ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఓడించింది. తన కెరీర్లో 100వ టెస్టు ఆడుతున్న భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ధాటికి రెండవ జట్టు టాప్ ఆర్డర్ పేకా మేడలా కూలిపోయింది. రూట్(84), బెయిర్ స్టో(39), హార్ట్ లీ(20), పోప్(19) మినహా మిగతా వారెవరూ రాణించలేదు. దీంతో ఇంగ్లాండ్ జట్టు రెండవ ఇన్నింగ్స్ లో 195 పరుగులకు ఆల్ అవుట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 218 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 477 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ రోహిత్ శర్మ, గిల్ సెంచరీలు సాధించారు.
మూడోరోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి భారత జట్టు 477 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు అశ్విన్ ధాటికి వణికిపోయింది. క్రావ్ లే, డకెట్, పోప్, బెన్ స్టోక్స్, ఫోక్స్ ఇలా ఐదుగురు కీలక బ్యాటర్లను అశ్విన్ ఔట్ చేయడంతో ఇంగ్లాండు జట్టు కోలుకోలేకపోయింది.. బుమ్రా, కులదీప్ యాదవ్ చెరో రెండు, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీయడంతో ఇంగ్లాండు జట్టు 195 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఫలితంగా ఇన్నింగ్స్ 65 పరుగుల తేడాతో ఓటమిపాలైంది..
రాజ్ కోట్ లో జరిగిన టెస్ట్ లో 434 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన ఇంగ్లాండ్ జట్టు.. ఈ టెస్టులో ఇన్నింగ్స్ 65 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటకట్టుకుంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో ఇంగ్లాండ్ జట్టు అత్యంత పేలవమైన ఆటతీరు ప్రదర్శించింది. ఈ ఓటమి ద్వారా వరుసగా నాలుగు పరాజయాలను ఇంగ్లాండ్ జట్టు మూటకట్టుకుంది. 4-1 తేడాతో భారత్ సగర్వంగా సిరీస్ ఒడిసి పట్టింది. ఇప్పటికే టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో, WTC పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతున్న భారత జట్టుకు.. ఈ విజయం సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ విజయం ద్వారా WTC పాయింట్ల పట్టికలో భారత జట్టు స్థానం మరింత పటిష్టమవుతుంది. వరుసగా నాలుగు టెస్టుల్లో విజయం సాధించిన నేపథ్యంలో రోహిత్ సేన సంబరాల్లో మునిగిపోయింది.
5TH Test. India Won by an innings and 64 Run(s) https://t.co/jnMticFE4K #INDvENG @IDFCFIRSTBank
— BCCI (@BCCI) March 9, 2024