Homeలైఫ్ స్టైల్Daily Running: ప్రతిరోజూ 12 నిమిషాలు రన్నింగ్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Daily Running: ప్రతిరోజూ 12 నిమిషాలు రన్నింగ్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Daily Running: కొందరికి చిన్నప్పటి నుంచే రన్నింగ్ చేయడం అంటే ఇష్టం..మరి కొందరు మాత్రం నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. రన్నింగ్ చేయడం వల్ల అనేక లాభాలున్నాయని ఇప్పటికే చాలా మంది ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. అయితే ప్రతి రోజూ ఉదయం వ్యాయామంలో భాగంగా రన్నింగ్ చేయడం వల్ల అలసిపోయి రోజంతా నీరసంగా ఉంటామని భావిస్తారు. అంతేకాకుండా మోకాళ్ల నొప్పుడు వస్తాయనే అపోహ కూడ ఉంది. దీంతో కేవలం రన్నింగ్ చేయకుండా నడక వరకే పరిమితం అవుతారు. కానీ రోజుకు కనీసం 12 నిమిషాల పాటు రన్నింగ్ చేయడం వల్ల జీవితంలో అద్భుతమైన మార్పులు ఉంటాయని ఇటీవల చేసిన రీసెర్చ్ లో బయటపడింది. వాటి గురించి వివరాల్లోకి వెళితే..

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్ లో నెలకొన్న అధ్యయనం ప్రకారం వారానికి 75 నిమిషాల పాటు రన్నింగ్ చేయడం వల్ల 12 సంవత్సరాల ఆయుష్సు పెరుగుతుంది. ప్రతిరోజూ 12 నిమిషాల పాటు రన్నింగ్ చేయడం వల్ల బరువు పెరగరు. కొవ్వు పెరగకుండా కంట్రోల్ లో ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల్లో ఉబకాయం కూడా ఒకటి. దీనిని నియంత్రించాలంటే ప్రతిరోజూ కనీసం 12 నిమిషాల పాటు రన్నింగ్ చేలని అంటున్నారు.

నేటి కాలంలో చాలా మంది డయాబెటీస్ తో బాధపడుతున్నారు. ఇది పెరిగే కొద్ది ఇన్సులిన్ అవసరం ఏర్పడుతుంది. అయితే దీని అవసరం రాకుండా రన్నింగ్ ఉపయోగపడుతుంది. రన్నింగ్ చేయడం వల్ల గ్లూకోస్ జీవక్రియను ప్రోత్సహిస్తుంది. మధుమేహం నంచి శరీరానికి రక్షణగా ఉంటుంది. రన్నింగ్ చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పరుగు వల్ల బ్లడ్ ప్రెషర్ సక్రమంగా పనిచేస్తూ అంటు వ్యాధులు దరి చేరకుండా కాపాడుతుంది.

ప్రతిరోజూ రన్నింగ్ చేయడం వల్ల మెదడులోని కణాలు రిలాక్స్ అవుతాయి. దీంతో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఒత్తిడితో బాధపడుతున్నారు. ప్రతిరోజూ పరుగెత్తడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడుతారు. ఫలితంగా జీవిత కాలం పెరుగుతుంది. రన్నింగ్ చేయడం వల్ల కండరాలు గట్టిపడుతాయి. ముఖ్యంగా కాళ్ల ఎముకలు శరీర బరువును మోస్తాయి. రన్నింగ్ చేసే సమయంలో వీటి కదలికతో అవి గట్టి పడుతాయి. భవిష్యత్ లో పగుళ్ల నుంచి ఇవి రక్షణగా ఉంటాయి. అందువల్ల రన్నింగ్ చేయడం అలవాటు చేసుకోండి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
Oktelugu Epaper
Exit mobile version