India Vs England 5th Test: ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా 3-1 తేడాతో ఇప్పటికే ట్రోఫీ దక్కించుకున్న ఇండియా.. ధర్మశాల వేదికగా జరిగే నామ మాత్రమే ఐదో టెస్టుకు జట్టును ప్రకటించింది. ఇప్పటికే సిరీస్ గెలిచిన నేపథ్యంలో ప్రయోగాల చేసేందుకు సిద్ధమైంది. వాస్తవానికి ఈ సిరీస్ ను ఓటమితో ప్రారంభించిన ఇండియా.. వరుసగా మూడు టెస్టు మ్యాచ్ లు గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇదే ఊపులో ధర్మశాల టెస్ట్ కూడా గెలిచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25 లో పాయింట్ల పట్టికలో జట్టు స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఆఖరి టెస్ట్ మ్యాచ్ గెలిచి విజయంతో పర్యటన ముగించాలని ఇంగ్లీష్ జట్టు భావిస్తోంది. ఈ ప్రకారం ఐదవ టెస్ట్ కూడా రసవత్తరంగా సాగుతుందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
ధర్మశాల వేదికగా ప్రారంభమయ్యే ఐదో టెస్టు కోసం టీం ను ప్రకటించారు. గత మ్యాచ్ కు దూరంగా ఉన్న జస్ ప్రీత్ బుమ్రా ధర్మశాల టెస్టులో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యార్కర్ స్పెషలిస్ట్ ఈ సిరీస్ లో అదిరిపోయే బౌలింగ్ వేశాడు. 13.64 సగటుతో 17 వికెట్లు తీశాడు.. ధర్మశాల మైదానం ఫాస్ట్ బౌలర్లకు స్వర్గధామం కావడంతో అతడిని ఎంపిక చేశారనే ప్రచారం జరుగుతోంది. త్వరలో టి20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో రాంచి టెస్ట్ కు బుమ్రా కు బీసీసీఐ సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. కీలకమైన బౌలర్లు లేకపోయినప్పటికీ ఆ టెస్ట్ లో భారత్ గెలిచింది. ముఖ్యంగా ఆకాశ్ దీప్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఆ టెస్ట్ మ్యాచ్ లో సత్తా చాటారు.
మరోవైపు రాహుల్ ఈ మ్యాచ్ కి కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో అతడు గాయపడ్డాడు. బెంగళూరులో చికిత్స పొందినప్పటికీ ఉపయోగం లేకుండా పోవడంతో అతడిని టీం మేనేజ్మెంట్ లండన్ పంపించింది. అయితే ఇప్పటంతలో అతడు జట్టులోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. మరోవైపు వాషింగ్టన్ సుందర్ ధర్మశాల జరిగే టెస్టులో ఆడే అవకాశం లేకపోలేదని బిసిసిఐ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం అతడు మార్చి 2న ముంబై జట్టుతో ప్రారంభమయ్యే రంజి ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్లో తమిళనాడు జట్టు తరపున ఆడనున్నాడు. ఒకవేళ ఆ మ్యాచ్ పూర్తయితే.. అతడు ధర్మశాలలో జరిగే టెస్ట్ మ్యాచ్లో ఆడతాడు.
విరామం లేని ఆట ఆడుతున్న రోహిత్ శర్మకు ఈ టెస్ట్ మ్యాచ్లో విశ్రాంతి ఇవ్వాలని బీసిసిఐ భావిస్తోంది. రోహిత్ విశ్రాంతి తీసుకుంటే దేవదత్ పడిక్కల్ జట్టులోకి ఎంట్రీ ఇస్తాడు. అప్పుడు రజత్ పాటిదార్ కూడా తుది జట్టులో ఉంటాడు. ఇక ఈ సిరీస్ లో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ ధర్మశాల మ్యాచ్ లోనూ కొనసాగుతారు. మైదానం పేస్ బౌలింగ్ కు అనుకూలిస్తున్న నేపథ్యంలో.. ముగ్గురు పేస్ బౌలర్లతో భారత జట్టు రంగంలోకి దిగే అవకాశం ఉంది. బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్ ఫేస్ బాధ్యతలు పంచుకుంటారు. ఒకవేళ ప్రయోగాలు చేయదలుచుకుంటే ఆకాష్ స్థానంలో ముఖేష్ కు టీ మేనేజ్మెంట్ అవకాశం ఇవ్వచ్చు. ఒకవేళ ఎక్స్ ట్రా స్పిన్నర్ ను ఆడించాలి అనుకుంటే కులదీప్ యాదవ్ జట్టులో ఉంటాడు. రవీంద్ర జడేజా కు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తే అక్షర్ పటేల్ కు అవకాశం దక్కుతుంది.
భారత జట్టు అంచనా
రోహిత్ శర్మ ( కెప్టెన్), జైస్వాల్, బుమ్రా(వైస్ కెప్టెన్), గిల్, సర్ఫ రాజ్ ఖాన్, ధృవ్ జురెల్, కేస్ భరత్, దేవ దత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, కులదీప్ యాదవ్, ఆకాష్ దీప్, ముఖేష్ కుమార్.