https://oktelugu.com/

India Vs England 1st Test: కుంబ్లే చెప్పిందే జో రూట్ నిరూపించాడు.

ముఖ్యంగా యువ ప్లేయర్ అయిన యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్ బౌలర్లను చీల్చి చెండాడనే చెప్పాలి. ఇక టి20 మ్యాచ్ మాదిరిగా బౌలర్ల మీద విరుచుకుపడుతూ భారీ సిక్స్ లను కొడుతూ చాలా దూకుడుగా ఆడాడు.

Written By:
  • Gopi
  • , Updated On : January 26, 2024 / 10:54 AM IST

    India Vs England 1st Test

    Follow us on

    India Vs England 1st Test: ప్రస్తుతం ఇండియా ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ని ఆడుతుంది.ఇక ఇందులో మొత్తం 5 మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా, ఈనెల 25 వ తేదీ నుంచి మొదటి టెస్ట్ మ్యాచ్ ఉప్పల్ వేదికగా ప్రారంభం అయింది.ఇక ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్ భారత బౌలర్లను ఎదుర్కోవడంలో దారుణంగా విఫలమైంది. ఇక ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు చెలరేగి బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండ్ ప్లేయర్లు ఏమాత్రం వాళ్ల ప్రతిభ ని చూపించలేకపోయారు.ఇక దాంతో ఇంగ్లాండ్ టీమ్ 246 పరుగులకు చేసి ఆల్ అవుట్ అయింది. ఇక అప్పుడు బ్యాటింగ్ కి వచ్చిన ఇండియన్ టీం ప్లేయర్లు బస్ బాల్ గేమ్ ని ఆడుతూ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు.

    ముఖ్యంగా యువ ప్లేయర్ అయిన యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్ బౌలర్లను చీల్చి చెండాడనే చెప్పాలి. ఇక టి20 మ్యాచ్ మాదిరిగా బౌలర్ల మీద విరుచుకుపడుతూ భారీ సిక్స్ లను కొడుతూ చాలా దూకుడుగా ఆడాడు. ఆయన భారీ విధ్వంసం ముందు ఇంగ్లాండ్ బౌలర్లు చేతులెత్తేశారనే చెప్పాలి. ఇక ఈ విషయం మీద ఇండియన్ టీమ్ మాజీ స్పిన్నర్ అయిన అనిల్ కుంబ్లే స్పందిస్తూ యశస్వి జైస్వాల్ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ని ఆడాడు దాన్ని కట్టడి చేయడంలో ఇంగ్లాండ్ బౌలర్లు తీవ్రమైన వైఫల్యాన్ని ఎదుర్కొన్నారు. ఇక ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో టీం లో ఉన్న వైవిధ్యమైన బౌలర్లని వాడుకోవడం మంచిది.

    ఇక ఈ విషయంలో ఇంగ్లాండ్ టీమ్ జో రూట్ ని వాడుకొని ఉండాల్సింది. స్పిన్ బౌలర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జో రూట్ యశస్వి జైశ్వాల్ ని కట్టడి చేసేవాడు. ఈ విషయం లో ఇంగ్లాండ్ చాలా తప్పిదం చేసింది అంటూ సంచలన కామెంట్లు చేశాడు. ఇక జో రూట్ గురించి మాట్లాడుతూ ఆయన స్పిన్ లో వైవిధ్యాన్ని చూపిస్తూ బంతిని స్వింగ్ చేసే కెపాసిటీ ఉన్న బౌలర్ కావడం వల్ల లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్ అయిన జైశ్వాల్ ని కట్టడి చేసేవాడు. ఒక మంచి స్పిన్నర్ ని టీం లో ఉంచుకొని కూడా ఆయనని వాడుకోకపోవడం ఇంగ్లాండు చేసిన పెద్ద తప్పు అంటూ ఆయన ఇంగ్లాండ్ టీమ్ ని తప్పుపట్టాడు…

    ఇక అలాగే ఇంగ్లాండ్ టీం గురించి మాట్లాడుతూ వాళ్ళకి ఇక్కడ ఆడిన అనుభవం పెద్దగా లేదు కాబట్టి వాళ్ళు ఎక్కువ ప్రభావం చూపించట్లేదనే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటూ సంచలమైన కామెంట్లను చేశాడు. ఇక మొత్తానికి అయితే కుంబ్లే చెప్పినట్టు గానే జైశ్వాల్ ని జో రూట్ ఔట్ చేసి చూపించాడు…ఇక ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 246 పరుగులు చేయగా, ప్రస్తుతం ఇండియన్ టీం 3 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రిజ్ లో కే ఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ లు ఉన్నారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లకి చుక్కలు చూపించిన జైస్వాల్ 76 బంతుల్లో 80 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలాగే రోహిత్ శర్మ కూడా 24 పరుగులు చేసి ఔట్ అవ్వగా, గిల్ కూడా 23 పరుగులు చేసి ఔట్ అయ్యాడు…