Maruthi Car :అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగడంతో పాటు వాతావరణం కాలుష్యంగా మారడంతో పెట్రోల్, డీజిల్ కార్ల ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వీటికి ప్రత్యామ్నాయంగా బయోడీజిల్, ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు Electric Vehicles(EV)లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. అయితే ధర కాస్త ఎక్కువగానే ఉంది. కానీ లేటేస్టుగా మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అందుబాటులో మారుతి కంపెనీ కొత్త ఈవీని తీసుకొస్తుంది. దీనిని ఇప్పటికే జపాన్ మొబలిటీ షోలో ప్రదర్శించారు. భారత్ లో అడుగుపెట్టబోయే ఈ కారు గురించి తెలుసుకోవాలని ఉందా..
ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో టాటా టియాగో ఆకర్షిస్తోంది. దీనికి పోటీగా మారుతి కొత్త ఈవీని తీసుకొస్తుంది. ఇది eWX కాన్సెప్ట్ మోడల్ పై తయారవుతుూ. K-EV ఆర్కిటెక్చర్ లో డిజైన్ చేయబడింది. ఈ కారును డెన్సో, తోషిబాల భాగస్వామ్యంతో హైబ్రిడ్ బ్యాటరీని అమర్చనున్నారు. ఈ కారులో eVX BYD మిగ్ సైజ్ బ్లేడ్ సెల్ బ్యాటరీలను వినియోగించనున్నారు. కొన్ని ఎలక్ట్రిక్ కార్లు ఇంటర్నేషనల్ లెవల్లో తయారు చేశారు. కానీ మారుతి మాత్రం భారతీయుల ను దృష్టిలో ఉంచుకొని ఈ మోడల్ తయారు చేస్తోంది.
అయితే విడిబాగాల తయారీ కోసం ఇతర సంస్థలతో ఒప్పందం చేసుకని కాంపాక్ట్ EVని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఏడాదితో దీని ఉత్పత్తి ప్రారంభించి 2006 వరకు రిలీజ్ చేయనున్నారు. మారుతి కంపెనీ నుంచి ఇప్పటి వరకు వినియోగదారులను ఆకర్షించే ఎన్నో మోడళ్లు వచ్చాయి.ఇప్పుడు ఎలక్ట్రిక్ వెర్షన్ లో కూడా తన సత్తా చూపడానికి రెడీ అవుతోంది. ఇందులో భాగంగా మొత్తం 6 కార్లను తీసుకు రాగా.. వీటి కోసంరూ.10 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రెడీ అవుతున్నారు.