Ind vs Eng 1st ODI Preview: తొలి వన్డేలో ఇంగ్లండ్ తో ఇండియా ఢీ.. షాకిచ్చిన కోహ్లీ.. గెలుపెవరిది?

Ind vs Eng 1st ODI Preview: టీ20 సిరీస్ ను 2-1తో గెలుచుకున్న టీమిండియా ఆటగాళ్లు ఇప్పుడు ఇంగ్లండ్ తో వన్డే ఫైట్ కు రెడీ అయ్యింది. టీ20లాంటి ధనాధన్ ఆట ముగియడంతో వన్డేల వైపు చూపు మరలింది. టీ20ల లాగానే వన్డే సిరీస్ ను కూడా గెలుచుకోవాలని టీమిండియా ఎదురుచూస్తోంది. కానీ అదంత ఈజీ కాదు. వన్డేల్లో ఇంగ్లండ్ జట్టు పటిష్టంగా ఉంది. దీంతో టీమిండియాకు గట్టి పోటీ తప్పదు. ఇంగ్లండ్ లోని ఓవల్ […]

Written By: NARESH, Updated On : July 12, 2022 11:55 am
Follow us on

Ind vs Eng 1st ODI Preview: టీ20 సిరీస్ ను 2-1తో గెలుచుకున్న టీమిండియా ఆటగాళ్లు ఇప్పుడు ఇంగ్లండ్ తో వన్డే ఫైట్ కు రెడీ అయ్యింది. టీ20లాంటి ధనాధన్ ఆట ముగియడంతో వన్డేల వైపు చూపు మరలింది. టీ20ల లాగానే వన్డే సిరీస్ ను కూడా గెలుచుకోవాలని టీమిండియా ఎదురుచూస్తోంది. కానీ అదంత ఈజీ కాదు.

వన్డేల్లో ఇంగ్లండ్ జట్టు పటిష్టంగా ఉంది. దీంతో టీమిండియాకు గట్టి పోటీ తప్పదు. ఇంగ్లండ్ లోని ఓవల్ లో నేడు సాయంత్రం జరిగే తొలి మ్యాచ్ లో ఇంగ్లండ్, ఇండియా సమ ఉజ్జీలుగా ఉన్నాయి. ఇరు జట్లూ సత్తా చాటితేనే గెలుస్తారు. 2019 వన్డే ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు అత్యంత భీకరంగా కనిపిస్తోంది. దీంతో ఆ జట్టును ఓడించాలంటే టీమిండియా తెగ కష్టపడాల్సిందే..

వన్డేల్లో భారత జట్టులోకి కొత్తగా శిఖర్ ధావన్ వస్తున్నాడు. కేఎల్ రాహుల్ గైర్హాజరీలో శిఖర్ కీలకం కానున్నాడు. ఇప్పటికే ఐపీఎల్ లో శిఖర్ పరుగుల వరద పారిస్తున్నాడు. రెగ్యులర్ గా ఆడుతున్నాడు. టీ20లోనూ బాగా ఆడుతున్న అతడికి చోటు దక్కలేదు. వన్డేలకే పరిమితం అయ్యాడు. ఈ వన్డేసిరీస్ ధావన్ కు అత్యంత కీలకంగా మారింది.

విరాట్ కోహ్లీ ఈ వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. 3వ టీ20 సందర్భంగా గజ్జాల్లో గాయం కావడంతో వన్డే సిరీస్ లో ఆడడం లేదని టీమిండియా ప్రకటించింది. ఇక అతడి స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ఆడనున్నాడు.

ఇక 3వ టీ20 ఓడడంతో టీమిండియా పూర్తి స్థాయి జట్టుతోనే బరిలోకి దిగుతోంది. రోహిత్, శిఖర్ సహా సూర్యకుమార్, శ్రేయాస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా, పంత్, బుమ్రా, జడేజా, షమీ, చాహల్, శార్ధుల్ ఠాకూర్ లు జట్టులో ఉండొచ్చు.

ఇక ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ రిటైర్ మెంట్ తో ఇప్పుడు ఆ జట్టుకు కొత్త కెప్టెన్ గా బట్లర్ నియామకం అయ్యాడు. అయితే తన కెప్టెన్సీలో తొలి టీ20 సిరీస్ లోనే అతడు టీమిండియా చేతిలో ఓటమి చవిచూశాడు. ఇప్పుడు వన్డేలల్లో దానికి ప్రతీకారం తీర్చుకోవాలని బట్లర్ పట్టుదలతో ఉన్నాడు. ఇంగ్లండ్ జట్టులోకి టీ20లో ఆడని.. భీకర ఫాంలో ఉన్న బెయిర్ స్టో, స్టోక్స్ లు వచ్చే అవకాశం ఉంది.

వన్డే క్రికెట్ లో ఇంగ్లండ్ తో ఇప్పటివరకూ భారత్ 103 వన్డే మ్యాచుల్లో తలపడగా.. భారత్ 55 గెలిచింది. ఇంగ్లండ్ 43 మ్యాచులు నెగ్గింది. రెండు టై అయ్యాయి. మూడు ఫలితం తేలలేదు. ఓవల్ లో భారత్-ఇంగ్లండ్ 8 వన్డేలు జరగగా.. టీమిండియా 2 మ్యాచ్ లు నెగ్గింది. ఆతిథ్య జట్టు 5 మ్యాచుల్లో గెలిచింది. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు.