India vs Bangladesh : బంగ్లాదేశ్ జట్టుతో సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ను పలు ఘనతలు అతడి ముందు నిల్చుని ఉన్నాయి. అయితే ఇవి టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు. వీటిని గనుక రోహిత్ శర్మ బద్దలు కొడితే టెస్ట్ క్రికెట్ చరిత్రలో చిర స్థాయి గా నిలిచి పోతాడు. ఈ సిరీస్ లో రోహిత్ ఒక సెంచరీ చేస్తే చాలు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ చరిత్రలోనే 10 శతకాలు బాదిన ఆటగాడిగా నిలిచిపోతాడు. ఈ లిస్టులో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ 16 సెంచరీలతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు లబూ షేన్ 11 సెంచరీలతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియంసన్ 10 సెంచరీలతో థర్డ్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు.
50 శతకాల మైలురాయికి..
అంతర్జాతీయ క్రికెట్లో 50 సెంచరీస్ చేసిన రికార్డు అందుకునేందుకు రోహిత్ కేవలం రెండు శతకాల దూరంలోనే ఉన్నాడు. మూడు ఫార్మాట్లో కలిపి రోహిత్ శర్మ ఇప్పటివరకు 48 సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండుల్కర్ 100 సెంచరీలతో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. 80 సెంచరీలతో విరాట్ కోహ్లీ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు.
ఆల్ టైం రికార్డ్ కు స్వల్పదూరంలో..
చెన్నై వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగే టెస్ట్ లో రోహిత్ శర్మ 8 సిక్స్ లు కొడితే భారత జట్టు తరఫున టెస్ట్ క్రికెట్లో హైయెస్ట్ సిక్సర్లు కొట్టిన బ్యాటర్ గా నిలిచిపోతాడు. ఇదే సమయంలో టీమిండియా ఒకప్పటి డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బ్రేక్ చేస్తాడు. వీరేంద్ర సెహ్వాగ్ 103 టెస్టులలో 178 ఇన్నింగ్స్ లు ఆడాడు. 91 సిక్స్ లు కొట్టాడు. రోహిత్ 59 మ్యాచ్ లు ఆడాడు. 101 ఇన్నింగ్స్ లలో 84 సిక్స్ లు బాదాడు. ఇక ఈ జాబితాలో 78 సిక్సర్ల తో ధోని థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. 69 సిక్స్ లతో సచిన్ 4 స్థానంలో కొనసాగుతున్నాడు. 64 సిక్స్ లతో రవీంద్ర జడేజా ఐదో స్థానంలో ఉన్నాడు. ధోని 90 టెస్టులకు ప్రాతినిధ్యం వహించాడు. 144 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేశాడు. 78 సిక్స్ లు కొట్టేశాడు. సచిన్ టెండూల్కర్ 329 ఇన్నింగ్స్ లలో 69 సిక్స్ లు బాదాడు. రవీంద్ర జడేజా 105 ఇన్నింగ్స్ లలో 64 సిక్స్ లు కొట్టాడు. ఇక మరో పదహారు సిక్స్ లు కొట్టేస్తే.. టెస్ట్ క్రికెట్లో 100 సిక్స్ లు కొట్టిన తొలి ఆటగాడిగా రోహిత్ చరిత్ర సృష్టిస్తాడు. అయితే రోహిత్ ఇప్పటికే t20 ఫార్మాట్ కు ముగింపు పలికాడు. ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ -2025 తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు రోహిత్ శాశ్వత విరామం ప్రకటిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More