India vs Bangladesh : పాకిస్తాన్ తో గెలిచినంత ఈజీ కాదు, ఇండియాతో! బంగ్లాదేశ్ కు బాగా తెలిసొచ్చింది!

సింహం అవ్వాలని ప్రతీ కుక్కకు ఉంటుంది.. కానీ అడవిలో చేసే గర్జనకు.. ఊరి చివర అరిచే అరుపుకు చాలా తేడా ఉంటుంది. అయితే ఇది పాకిస్తాన్ విషయంలో బంగ్లాదేశ్ కు నూటికి నూరుపాళ్ళు వర్కౌట్ అయింది. అదే ట్రెండ్ ఇండియాలోనూ కొనసాగుతుందని బంగ్లాదేశ్ భావించింది. కానీ ఇక్కడ ఉన్నది సింహాలు కదా.. పరిస్థితి ఎదురు తన్నింది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 22, 2024 12:36 pm

India vs Bangladesh

Follow us on

India vs Bangladesh : సింహం అవ్వాలని ప్రతీ కుక్కకు ఉంటుంది.. కానీ అడవిలో చేసే గర్జనకు.. ఊరి చివర అరిచే అరుపుకు చాలా తేడా ఉంటుంది. అయితే ఇది పాకిస్తాన్ విషయంలో బంగ్లాదేశ్ కు నూటికి నూరుపాళ్ళు వర్కౌట్ అయింది. అదే ట్రెండ్ ఇండియాలోనూ కొనసాగుతుందని బంగ్లాదేశ్ భావించింది. కానీ ఇక్కడ ఉన్నది సింహాలు కదా.. పరిస్థితి ఎదురు తన్నింది. పాకిస్తాన్ జట్టుపై తొలి టెస్ట్ లో 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ గెలిచింది. రెండో టెస్టులో ఆరు వికెట్ల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. మొత్తంగా రెండు టెస్టుల సిరీస్ 2-0 తేడాతో గెలిచింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ర్యాంకింగ్ లో నాలుగో స్థానానికి ఏక బాకింది. ఇంకేముంది వాపును చూసి బలుపు అనుకుంది. అడ్డమైన కూతలు కూసింది. భారత జట్టును ఓడిస్తామని ప్రతిజ్ఞలు చేసింది. కానీ క్షేత్రస్థాయిలో జరిగింది వేరు.. వాస్తవానికి తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టును 144/6 దాకా బంగ్లాదేశ్ తీసుకొచ్చింది. కానీ అక్కడే అద్భుతం జరిగింది. రవీంద్ర జడేజా (86), రవిచంద్రన్ అశ్విన్ (113) అద్భుతం సృష్టించారు. 199 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఫలితంగా భారత్ 376 రన్స్ చేసింది.. ఇదే దశలో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 149 పరుగులకు కుప్ప కూలింది.. బుమ్రా మెరుపుల్లాంటి బంతులకు బంగ్లాదేశ్ బ్యాటర్ల వద్ద సమాధానం లేకుండా పోయింది.

రెండవ ఇన్నింగ్స్ లో..

ఇక రెండవ ఇన్నింగ్స్ లోనూ భారత్ మొదట్లో తడబడింది. 63 పరుగులకే మూడు కీలకమైన వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వచ్చిన గిల్(119*), రిషబ్ పంత్ (109) పరుగులు చేశారు. నాలుగో వికెట్ కు 167 పరుగులు జోడించారు. పంత్ ఆవుటన తర్వాత రాహుల్ (22*) కూడా మెరుగ్గా ఆడాడు. ఫలితంగా భారత్ 287/4 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.. బంగ్లాదేశ్ ఎదుట 515 పరుగుల టార్గెట్ విధించింది.

లక్ష్యం కొండంత కావడంతో బంగ్లాదేశ్ ఓటమి ముందే ఖరారు అయిపోయింది. అయినప్పటికీ ఆ జట్టు ఓపెనర్లు మెరుగ్గా ఆడారు. హసన్(33), ఇస్లాం(35) తొలి వికెట్ కు 62 పరుగులు జోడించారు. కెప్టెన్ షాంటో(82) మినహా మిగతా ఆటగాళ్లు భారత బౌలర్లకు దాసోహం అయ్యారు. రవిచంద్రన్ అశ్విన్ 6, రవీంద్ర జడేజా 3, బుమ్రా ఒక వికెట్ పడగొట్టారు. వాస్తవానికి చెన్నై మైదానాన్ని పేస్ బౌలింగ్ కు అనుకూలంగా మార్చారు. బ్లాక్ సాయిల్ కు బదులుగా రెడ్ సాయిల్ రూపొందించారు. అందువల్లే తొలి ఇన్నింగ్స్ లో బంగ్లా బౌలర్లు రెచ్చిపోయారు. టీమిండియా ఆటగాళ్లను ఇబ్బంది పెట్టారు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. వంటి స్టార్ ఆటగాళ్లు తేలిపోయారు.. దీంతో భారత్ కాస్త తడబడింది. అయినప్పటికీ తొలి ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రెండవ ఇన్నింగ్స్ లో గిల్, రిషబ్ పంత్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.