India Vs Bangladesh: రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ తో తలపడుతోంది. తొలి టెస్ట్ గురువారం చెన్నై వేదికగా మొదలైంది. ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా తడబడింది. 144 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో జట్టును రవిచంద్రన్ అశ్విన్(102*) ఆదుకున్నాడు. సొంత మైదానంలో 108 బంతుల్లో సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు.. అతడికి రవీంద్ర జడేజా(86*) తోడు కావడంతో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. వీరిద్దరూ ఏడో వికెట్ కు ఏకంగా 195 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 339 రన్స్ చేసింది. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ నాలుగు వికెట్లు సొంతం చేసుకున్నాడు.. నహీద్ రాణా, హసన్ మిరాజ్ చెరో వికెట్ సొంతం చేసుకున్నారు. ఒకానొక దశలో భారత్ ఆరు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఆ సమయంలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా క్రీజ్ లోకి వచ్చారు. వీరిద్దరూ బంగ్లా బౌలర్లను తీవ్రంగా ప్రతిఘటించారు. అంచనాలకు భిన్నంగా రాణించి ఆకట్టుకున్నారు. వీరిద్దరూ ఏకంగా ఏడో వికెట్ కు 195 రన్స్ జోడించారు..
ఏడవ సెంచరీ
అశ్విన్ కు టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది ఆరవ సెంచరీ. చెప్పకు మైదానంలో అతడు వరుసగా రెండవ టెస్ట్ సెంచరీ సాధించాడు.. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా దూకుడుగాడి బంగ్లా బోర్డర్లపై విరుచుకుపడ్డారు. భారత జట్టును గట్టెక్కించారు. ప్రారంభంలో భారత జట్టుకు బంగ్లా బౌలర్ హసన్ మహమూద్ చుక్కలు చూపించాడు. రోహిత్ శర్మ (6), విరాట్ కోహ్లీ (6), గిల్(0) ను వరుస ఓవర్లలో అవుట్ చేసాడు. దీంతో భారత్ 34 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఈ దశలో యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ సంయోచితంగా ఆడారు. రిషబ్ పంత్(39), యశస్వి జైస్వాల్ (56) పరుగుల వద్ద అవుట్ కావడం..రాహుల్ (16) తేలిపోవడంతో.. మరోసారి భారత్ పై బంగ్లా బౌలర్లు పై చేయి సాధించారు. అయితే వారి ఆనందాన్ని ఎక్కువసేపు ఉండనీయకుండా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా బ్యాట్ తో కదం తొక్కారు. ఫలితంగా తొలిరోజు ఆట ముఖ్య సమయానికి భారత్ పటిష్టమైన స్థితిలో నిలిచింది. 80 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.
రెడ్ సాయిల్ మైదానంలో..
వాస్తవానికి చెన్నై మైదానంలో బ్లాక్ సాయిల్ ఉంటుంది. బంగ్లా టెస్ట్ నేపథ్యంలో దానిని రెడ్ సాయిల్ గా మార్చారు. ఐతే భారత్ బ్యాటింగ్ కు దిగడంతో బంగ్లా బౌలింగ్ చేసింది. రెడ్ సాయిల్ మైదానాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంది. మహమూద్ హసన్ నాలుగు వికెట్లు సొంతం చేసుకున్నాడంటే దానికి కారణం రెడ్ సాయిల్ మైదానమే. అయితే మధ్యాహ్నం తర్వాత పిచ్ అనూహ్యంగా మారింది. బంతి టర్న్ కాకపోగా.. బ్యాటింగ్ కు సహకరించింది. దీంతో భారత ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా పండగ చేసుకున్నారు. ఏకంగా 1 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.