Solo Trip : ప్రయాణాలు చేయడం అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని, అక్కడ వాతావరణాన్ని ఆస్వాదించాలని అనుకుంటారు. దేశంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. వీటిని చూడాలని స్నేహితులు లేదా కుటుంబ సభ్యులో ప్లాన్ చేసుకుంటారు. కానీ కొన్నిసార్లు ఇవన్నీ జరగవు. అలాంటి సమయాల్లో కొందరు వేరే వాళ్ల మీద ఆధారపడకుండా ఒంటరిగా ట్రావెల్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. సోలోగా ట్రావెల్ చేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకుంటారు. ఇప్పుడున్న జనరేషన్‌లో అయితే అబ్బాయిలు కంటే అమ్మాయిలే చాలామంది ఒంటరిగా ట్రావెల్ చేస్తున్నారు. అయితే ట్రావెలింగ్ చేసేటప్పుడు అమ్మాయిలు చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఎవరైనా ఉంటనే భద్రత ఉండదు. అలాంటిది ఒంటరిగా అంటే తప్పకుండా జాగ్రత్త వహించాల్సిందే. అయితే అబ్బాయిలు లేదా అమ్మాయిలు అయిన కూడా సోలోగా ట్రావెల్ చేస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో మరి తెలుసుకుందాం.
లగేజీ ఎక్కువగా తీసుకెళ్లవద్దు
ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఎక్కువగా లగేజ్ తీసుకెళ్లవద్దు. సామాన్లు ఎక్కువగా ఉండటం వల్ల ఎంజాయ్ చేయలేరు. వాటిని మోయడానికే ఇబ్బంది పడతారు. కాబట్టి మీకు తప్పకుండా కావాల్సిన వస్తువులు మాత్రమే తీసుకెళ్లండి.
మందులు పట్టుకోండి
అనారోగ్య సమస్యలేవి కూడా ముందు చెప్పుకుని రావు. కాబట్టి విరేచనాలు, వాంతులు, జ్వరానికి సంబంధించిన మందులను పట్టుకోండి. ఏ మాత్రం మీకు ఆరోగ్యం సరిగ్గా లేదని అనిపిస్తే వెంటనే ఆ మందులను వాడవచ్చు.
కొత్త వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడవద్దు
సోలోగా ట్రావెల్ చేస్తున్నామని మీకు బోర్ కొడితే ఎవరితో పడితే వాళ్లతో మాట్లాడకండి. మీ లిమిట్స్‌లో మాత్రమే మాట్లాడండి. మీ వివరాలు అన్ని అడిగితే అసలు చెప్పవద్దు. మీతో సన్నిహితంగా ఉండి మీ వస్తువులను దొంగలించవచ్చు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి.
కుటుంబ సభ్యులకు ప్రతి విషయం తెలియజేయండి
మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో కుటుంబ సభ్యులకు ముందుగానే తెలియజేయండి. ఎక్కడ ఉన్నారు, ఏ ప్రదేశానికి వెళ్తున్నారో, ప్రతి విషయాన్ని కూడా చెప్పండి. అప్పుడు వాళ్లకు ఆందోళన ఉండదు. ఒకవేళ మీ మొబైల్ పనిచేయకపోయిన కూడా వాళ్లు మిమ్మల్ని ఏదో విధంగా కాంటాక్ట్ అవుతారు.
ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడండి
క్యాబ్ బుక్ చేసుకోవడం వంటివి కాకుండా ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడండి. దీనివల్ల అందరూ ఉంటారు. మీకు ఎలాంటి సమస్య వచ్చిన సేవ్ చేయడానికి ఎవరో ఒకరు ఉంటాదైరు. కాబట్టి వీలైనంత వరకు బస్సు లేదా షేర్ ఆటోలో వెళ్లండి. డబ్బులు ఆదా కావడంతో పాటు మీకు కూడా సేఫ్టీ ఉంటుంది.
ముందుగానే ప్లాన్ చేసుకోండి
సోలోగా ట్రావెల్ చేయాలని అనుకున్న వాళ్లు ముందే ఎక్కడికి వెళ్లాలి? వెళ్లకూడదనే విషయాన్ని ప్లాన్ చేసుకోవాలి. అక్కడికి వెళ్లాక ఎక్కడ ఉండాలి. రవాణా సౌకర్యం వంటి అన్ని విషయాలు కూడా ముందే ప్లాన్ చేసుకుంటే మంచిది. అప్పుడే మీరు అనుకున్న సమయానికి ట్రిప్‌ను పూర్తి చేస్తారు.