India Vs Australia: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గత రెండు బాక్సింగ్ డే టెస్ట్ లను టీమిండియా గెలిచింది. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది. ఇది జరగాలంటే ఆటగాళ్లు సత్తా చాటాల్సి ఉంటుంది. దూకుడుగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే దురదృష్టవషత్తు టీమ్ ఇండియా ఆటగాళ్లు తమ స్థాయి ప్రదర్శన చేయడం లేదు. ఆస్ట్రేలియా బౌలర్ల చేతిలో వరుసగా విఫలమవుతున్నారు. ఇందులో స్టార్ ఆటగాళ్లు రోహిత్, విరాట్ ఉండడం అభిమానులను నిరాశ పరుస్తోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాపై ఎంతో ఘనమైన, బలమైన రికార్డు కలిగి ఉన్న విరాట్ కోహ్లీ తాజా సిరీస్లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు ఒక్క సెంచరీ మాత్రమే చేసిన అతడు.. మిగతా మ్యాచ్లలో దారుణంగా విఫలమయ్యాడు.
126 పరుగులే..
విరాట్ కోహ్లీ ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడాడు. కేవలం 126 పరులు మాత్రమే చేశాడు. 31.5 సగటును కొనసాగిస్తున్నాడు. వాస్తవానికి విరాట్ లాంటి ఆటగాడి నుంచి ఇలాంటి ప్రదర్శనను అతని అభిమానులు ఊహించలేకపోతున్నారు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో విరాట్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ఏకంగా సెంచరీ చేశాడు. కానీ ఆ తర్వాత ఆ స్థాయిలో ఆడలేకపోయాడు.. ఇక డిసెంబర్ 26 నుంచి మెల్ బోర్న్ వేదికగా జరిగే నాలుగో టెస్టులో విరాట్ తన పూర్వపు ఆట తీరు ప్రదర్శించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మైదానంపై విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు ఆడిన మూడు టెస్ట్ లలో 52.66 సగటుతో 316 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2014లో మైదానంపై విరాట్ కోహ్లీ 169 రన్స్ చేశాడు. ఆ ఇన్నింగ్స్ తో విరాట్ పేరు సంచలనగా మారింది. ఇక అదే మ్యాచ్లో రెండవ ఇన్నింగ్స్ లో 54 పరుగులు చేసి జట్టుకు ఓటమిని తప్పించాడు. ఇక ఈ మైదానంపై రెండు సంవత్సరాల క్రితం విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. ఈ మైదానంలో రెండు సంవత్సరాల క్రితం టి20 ప్రపంచకప్ జరిగింది. ఆటోనిలో పాకిస్తాన్ జట్టుపై జరిగిన మ్యాచ్లో కేవలం 53 బంతుల్లో 82 పరుగులు చేసి, భారత జట్టును గెలిపించాడు. తద్వారా రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మైదానంపై విరాట్ కోహ్లీకి అరుదైన రికార్డులు ఉన్నాయి. ఈ క్రమంలో త్వరలో మెల్ బోర్న్ లో జరిగే నాలుగో టెస్ట్ లో విరాట్ కోహ్లీ తన పూర్వపు ఆట తీరును ప్రదర్శించాలని.. టీమిండియా కు విజయాన్ని అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.