Mohan Babu : మంచు కుటుంబం లోని వివాదం తారాస్థాయికి చేరి ఎన్ని పరిణామాలకు దారి తీసిందో గత కొద్దిరోజుల క్రితమే మనమంతా చూసాము. అయితే ఇంటికి వచ్చిన ఒక మీడియా రిపోర్టర్ పై ఆవేశం రెచ్చిపోయి, మైకును లాక్కొని అతని నెట్టి పై మోహన్ బాబు దాడి చేసిన ఘటన పెద్ద దుమారమే రేపింది. తలకు తీవ్రమైన గాయమైన మీడియా రిపోర్టర్ ని హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనపై జర్నలిస్టులంతా కలిసి మోహన్ బాబు పై కేసు వేశారు. ఈ కేసు వేసిన తర్వాత అతను పరారీ లో ఉన్నాడని, పోలీసులకు చిక్కడం లేదని, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని, ఇలా మీడియాలో పలు వార్తలు ప్రచారం అవ్వగా, దానికి మోహన్ బాబు స్పందిస్తూ తాను ఇంటివద్దనే ఉన్నానని, అసత్య ప్రచారాలను నమ్మొద్దు అంటూ ఒక ప్రకటన విడుదల చేసాడు.
అయితే ఈ కేసు విషయం లో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉండడం తో ముందస్తు బైలు కోసం కోర్టు లో పిటీషన్ వేయగా, నేడు ఈ పిటీషన్ ని విచారించిన హై కోర్టు, మోహన్ బాబు అప్పీల్ ని కొట్టిపారేసింది. దీంతో ఇప్పుడు మోహన్ బాబు విచారణ నిమిత్తం రిమాండ్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు అల్లు అర్జున్ అరెస్ట్ ఘటన ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. లోకల్ మీడియా నుండి నేషనల్ మీడియా వరకు ఈ అంశం గురించే చర్చలు నడిచాయి. ఇప్పుడు అకస్మాత్తుగా మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటీషన్ రద్దు అవ్వడం మరో హాట్ టాపిక్ గా మారింది. ఇలా తెలంగాణ ప్రభుత్వం లో వరుసగా సినీ తారలకు జరగడం గమనార్హం. ఇప్పుడు పోలీసులు మోహన్ బాబు ని ఎలా డీల్ చేస్తారో చూడాలి. ఆయనకీ ఉన్న రాజకీయ పలుకుబడితో అరెస్ట్ కాకుండా ఆపుకుంటారా, లేదా అరెస్ట్ అవుతారా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారిన అంశం.