https://oktelugu.com/

IAF Agniveer Vayu 2025: ఇంటర్‌ పాస్‌ అయిన వారికి జాబ్‌.. నోటిఫికేషన్‌ విడుదల చేసిన వాయుసేన!

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన వాయుసేనలో అగ్నివీర్‌ నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అగ్నిపథ్‌ స్కీంలో భాగంగా ఎయిర్‌ఫోర్సలోనూ అగ్నివీర్‌ నియామకాలు చేపడుతున్నారు. అగ్నివీర్‌ వాయు(01/2026) ఖాళీల భర్తీకి సబంధించిన అర్హులైన ఐఏఎఫ్‌ ఆన్‌లైన్‌పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 23, 2024 / 03:38 PM IST

    IAF Agniveer Vayu 2025

    Follow us on

    IAF Agniveer Vayu 2025: ప్రపంచ వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పెరుగుతోంది. ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం కారణంగా కొత్త రిక్రూట్‌మెంట్లు తగ్గిపోయాయి. చేపట్టినా తక్కువ వేతనాలకే ప్రైవేటు సంస్థలు ఆఫర్‌ ఇస్తున్నాయి. అయినా చాలా మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో కేవలం ఇంటర్‌ అర్హతతో భారత వాయుసేన ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంటర్‌ లేదా డిప్లొమా చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 2025 జనవరిలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

    అగ్నివీర్‌లో భాగంగా..
    భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన వాయుసేనలో అగ్నివీర్‌ నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అగ్నిపథ్‌ స్కీంలో భాగంగా ఎయిర్‌ఫోర్సలోనూ అగ్నివీర్‌ నియామకాలు చేపడుతున్నారు. అగ్నివీర్‌ వాయు(01/2026) ఖాళీల భర్తీకి సబంధించిన అర్హులైన ఐఏఎఫ్‌ ఆన్‌లైన్‌పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుల స్వీకరణ జనవరి 7 నుంచి 27 వరకు గడువు విధించారు.

    వీరు అర్హులు..
    అగ్నివీర్‌ వాయు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ లేదా తత్సమాన మెకానికల్‌/ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌/ఆటోబొబైల్‌/కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌ టెక్నాలజీ/ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగంలో మూడేళ్ల డిప్లొమా చేసినవారు కూడా అర్హులే. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌తో 50 శాతం మార్కులతో ఇంగ్లిష్‌లో 50 శాతమ మార్కులతో 2 ఏళ్ల వృత్తి విద్యా కోర్సు చేసిన వారు కూడా అర్హులే. నోటిఫికేషన్‌ ప్రకారం.. అభ్యర్థులకు శారీరక దారుఢ్య, వైద్య ప్రమాణలు కలిగి ఉండాలి. అభ్యర్థుల వయో పరిమితి 2005, జనవరి 01 నుంచి 2008, జూలై 01 మధ్య జన్మించి ఉండాలి.

    దరఖాస్తు ఇలా..
    అర్హత, ఆసక్తిన్నవారు ఎవరైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జనవరి 7న ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరూ ఫీజు కింద రూ.550 చెల్లించాలి. ఫేజ్‌–1(ఆన్‌లైన్‌ రాత పరీక్ష), ఫేజ్‌–2(ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్‌–1, ఆడాప్టబిలిటీ టెస్ట్‌–2), ఫేజ్‌–3(మెడికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌) ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

    వేతనాలు ఇలా…
    ఎంపికైన అభ్యర్థులకు వేతనాలు నాలుగేళ్లు వేర్వేరుగా ఉంటాయి. మొదటి ఏడాది రూ.30 వేలు, రెండో ఏడాది రూ.33 వేలు, మూడో సంవత్సరం నెలకు రూ.36 వేలు, నాలుగో సంవత్సరం నెలకు రూ.40 వేలు చొప్పున చెల్లిస్తారు.

    ముఖ్యమైన తేదీలు ఇవీ..
    ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం 2025, జనవరి 7
    ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు ఆఖరు తేదీ 2025, జనవరి 27
    ఆన్‌లైన్‌ పరీక్షలు ప్రారంభం : 2025, మార్చి 22.
    తుది జాబితా వెల్లడి తేదీ : 2025, నవంబర్‌ 14