https://oktelugu.com/

Surya Kumar Yadav : ‘సూర్య’ విలాపం.. ఆరో స్థానంలో పంపినా వరుసగా మూడో గోల్డెన్ డక్

IND vs AUS – Surya Kumar Yadav : టీ20లో ప్రపంచంలోనే నంబర్ 1 క్రికెటర్. అతడు టీ20ల్లో దంచికొడితే ప్రపంచ నంబర్ 1 బౌలర్ అయినా బెంబేలెత్తిపోవాలి. కానీ వన్డేలకు వచ్చేసరికి ఈ పులి పిల్లి అయిపోయింది. ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడో మ్యాచ్ లోనూ గోల్డెన్ డక్ అయ్యి చరిత్రలో   అపఖ్యాతిని పాపం మన సూర్యకుమార్ యాదవ్ దక్కించుకున్నాడు. ఇలా వరుసగా మూడు గోల్డెన్ డక్ అయిన ఆటగాళ్లలో సచిన్ […]

Written By:
  • Rocky
  • , Updated On : March 22, 2023 / 09:18 PM IST
    Follow us on

    IND vs AUS – Surya Kumar Yadav : టీ20లో ప్రపంచంలోనే నంబర్ 1 క్రికెటర్. అతడు టీ20ల్లో దంచికొడితే ప్రపంచ నంబర్ 1 బౌలర్ అయినా బెంబేలెత్తిపోవాలి. కానీ వన్డేలకు వచ్చేసరికి ఈ పులి పిల్లి అయిపోయింది. ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడో మ్యాచ్ లోనూ గోల్డెన్ డక్ అయ్యి చరిత్రలో   అపఖ్యాతిని పాపం మన సూర్యకుమార్ యాదవ్ దక్కించుకున్నాడు. ఇలా వరుసగా మూడు గోల్డెన్ డక్ అయిన ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్ కూడా ఉండడం విశేషం.

    https://twitter.com/iamadnan56/status/1638562482796077057?s=20

    ఒక్కసారి చేస్తే పొరపాటు.. రెండవసారి చేస్తే ఏమరపాటు.. మరి మూడోసారి చేస్తే? దాన్ని ఏమనాలి? దానికి ఏం పేరు పెట్టాలి.. పెడితే గిడితే దానికి “సూర్య కుమార్ యాదవ్” అని నామకరణం చేయాల్సి ఉంటుంది కాబోలు.. ఇప్పటికే అతడికి మేనేజ్మెంట్ అవకాశాల మీద అవకాశాలు ఇస్తోంది.. కానీ అతడు మాత్రం వినియోగించుకోవడం లేదు. గల్లి స్థాయి ఆట తీరు ప్రదర్శిస్తూ అభాసు పాలవుతున్నాడు.

    ఆస్ట్రేలియాలో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా.. చెన్నైలోని చేపాక్ స్టేడియంలో చివరి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా 49 ఓవర్లకు 269 పరుగులకు ఆల్ అవుట్ అయింది.. ఈ క్రమంలో చేజింగ్ కు దిగిన ఇండియాకు ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, గిల్ శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్ కు 65 పరుగులు జోడించారు. దాటిగా ఆడే క్రమంలో రోహిత్, గిల్ కొద్ది పరుగుల తేడాతో అవుట్ అయ్యారు. ఈ నేపథ్యంలో రాహుల్, కోహ్లీ సమయోచితంగా ఆడారు..ఇద్దరూ కలిసి మూడో వికెట్ కు 69 పరుగులు జోడించారు.. 32 పరుగులు చేసిన రాహుల్ జంపా బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు.

    రాహుల్ అవుట్ అయిన తర్వాత సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ కు రావాలి. కానీ అతగాడు పేలవమైన ఫామ్ ను కొనసాగిస్తున్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ అక్షర్ పటేల్ ను బ్యాటింగ్ కు పంపాడు. దురదృష్టవశాత్తు అతడు రన్ అవుట్ అయ్యాడు. లేకుంటే పరిస్థితి వేరేలా ఉండేది. అతడు ఔట్ అయినప్పటికీ రోహిత్ హార్దిక్ పాండ్యాను బ్యాటింగ్ కు పంపాడు. అప్పటికే క్రీజు లో ఉన్న కోహ్లీ, హార్దిక్ కలిసి ఐదో వికెట్ కు 34 పరుగులు జోడించారు.

    ఈ క్రమంలో అగర్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ డేవిడ్ వార్నర్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.. అయితే ఈసారైనా మెరుగైన ఇన్నింగ్స్ ఆడు అని హెచ్చరిస్తూనే సూర్యకుమార్ ను రోహిత్ శర్మ బ్యాటింగ్ కు పంపాడు.. గత రెండు వన్డేల్లో గోల్డెన్ డక్ గా ఔట్ అయిన సూర్య.. ఈ మ్యాచ్లో మెరుగైన ఇన్నింగ్స్ ఆడతాడని అందరూ అనుకున్నారు..కానీ అతడు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అగార్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. వరుసగా మూడు మ్యాచ్ల్లో 0 పరుగులకు అవుట్ అయిన క్రీడాకారుడిగా చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు.

    జట్టుకు కీలక సమయంలో మెరుగైన ఇన్నింగ్స్ ఆడకుండా అవుట్ అయిన సూర్యకుమార్ ను నెటిజన్లు ఒక ఆట ఆడుకుంటున్నారు. అయ్యర్ జట్టులోకి ఎప్పుడు వస్తాడో, ఈ సూర్య ఎప్పుడు బయటకు వెళ్తాడోనని కామెంట్లు చేస్తున్నారు.. మూడోసారి డక్ ఔట్ కావడంతో.. సూర్య కుమార్ యాదవ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ గా నిలిచాడు.

    https://twitter.com/azeem1916/status/1638562797729771520?s=20