https://oktelugu.com/

Viral : ఆమెది నడుమేనా.. ఏం ఊపింది స్వామీ!

Viral : పల్సర్‌ బైక్‌ పాట.. ఇటీవలి కాలంలో పాపులర్‌ అయిన ప్రైవేట్‌ సాంగ్స్ లో ఒకటి. దాదాపు ఏడాదిగా సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. వేడుకలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లలో ఇప్పటికీ ఈ పాట మార్మోగుతోంది. ఈ పాట ద్వారా గాజువాకకు చెందిన కండక్టర్‌ ఝాన్సీ వెలుగులోకి వచ్చింది. దేశ విదేశాల్లో ఈవెంట్స్‌ చేసేస్థాయికి ఎదిగింది. అంతలా తన డ్యాన్స్‌తో యూత్‌ను ఉర్రూతలూగించింది. కొత్త తరహా స్టెప్స్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. అవే స్టెప్స్‌లో అందరూ రీల్స్‌ కూడా […]

Written By:
  • NARESH
  • , Updated On : March 22, 2023 / 09:03 PM IST
    Follow us on

    Viral : పల్సర్‌ బైక్‌ పాట.. ఇటీవలి కాలంలో పాపులర్‌ అయిన ప్రైవేట్‌ సాంగ్స్ లో ఒకటి. దాదాపు ఏడాదిగా సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. వేడుకలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లలో ఇప్పటికీ ఈ పాట మార్మోగుతోంది. ఈ పాట ద్వారా గాజువాకకు చెందిన కండక్టర్‌ ఝాన్సీ వెలుగులోకి వచ్చింది. దేశ విదేశాల్లో ఈవెంట్స్‌ చేసేస్థాయికి ఎదిగింది. అంతలా తన డ్యాన్స్‌తో యూత్‌ను ఉర్రూతలూగించింది. కొత్త తరహా స్టెప్స్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. అవే స్టెప్స్‌లో అందరూ రీల్స్‌ కూడా చేశారు. చివరకు ఈ పాటను రవితేజ రీసెంట్‌ సినిమా ధమాకాలో కూడా పెట్టారు. అంతలా ఒక ఊపు ఊపేసిందీ సాంగ్‌.

    కొత్త డ్యాన్స్‌తో సోషల్‌ మీడియా మళ్లీ షేక్‌..
    తాజాగా పల్సర్‌ బైక్‌ సాంగ్‌తో మరోమారు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది ఓ విదేశీ అమ్మాయి. విదేశీ యువతి ఏ పాటకు డ్యాన్స్‌ చేసిందో తెలియదు కాని ఆమె నడుము ఊపడం చూసిన కొంతమంది ఈ డ్యాన్స్‌కు సరిపోయేలా ఉన్న పల్సర్‌ బైక్‌ సాంగ్‌ను విదేశీ యువతి డ్యాన్స్‌కు జోడించారు. ఆమె ఊపుడు… పల్సర్‌ బైక్‌ పాట మోగుడు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

    లైక్స్‌ అండ్‌ షేర్స్‌..
    విదేశీ అమ్మాయి నడుము ఊపుడు చూసిన నెటిజన్స్‌ లైకుల మీద లైకులు కొడుతున్నారు. వామో ఇదేం ఊపుడురా బాబు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. అంతలా ఆ ఊపుడు ఆకట్టుకుంటోంది. ఇప్పటికే 6కే లైక్స్‌ వచ్చాయంటే ఈ పాట సోషల్‌ మీడియాలో నెటిజన్స్‌ను ఎంతలా ఆకట్టుకుంటుందో అర్థం చేసుకోవచ్చు.