Rohit Sharma : క్రీడాస్ఫూర్తిని చాటుకున్న రోహిత్ శర్మ.. అసలైన క్రికెటర్ అంటే ఇలానే ఉండాలి…

వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా టీం తన మొదటి మ్యాచ్ ని ఆస్ట్రేలియా తో ఆడనున్న విషయం మనకు తెలిసిందే. ఇక దాని కోసం టీం లో ఎవరు ఉండాలి

Written By: NARESH, Updated On : September 28, 2023 9:11 pm

kl rahul2 rohit

Follow us on

Rohit Sharma : రాజ్ కోట్ వేదికగా ఇండియా ఆస్ట్రేలియా టీంల మధ్య జరిగిన మూడోవ వన్డే మ్యాచ్ లో 66 పరుగుల తేడా తో ఇండియా ఆస్ట్రేలియా మీద ఓడిపోవడం జరిగింది.నిన్నటి మ్యాచ్ లో ఇండియా ఓడిపోయినా కూడా ఇంతకు ముందే ఇండియా ఈ సిరీస్ ని 2 – 1 తేడా తో కైవసం చేసుకోవడం జరిగింది. అయితే మొదటి రెండు మ్యాచ్ లకి కె ఎల్ రాహుల్ కెప్టెన్ గా ఉన్నాడు. అలాగే తర్వాత జరిగిన మూడోవ వన్డే మ్యాచ్ కి రోహిత్ శర్మ కెప్టెన్ గా రావడం జరిగింది.ఇక మొదటి రెండు మ్యాచ్ లు మంచి విజయం సాధించడం తో ఇండియా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ని కైవసం చేసుకుంది.

ఇక మూడో మ్యాచ్ లో ఓడిపోయిన ఇండియా టీం మ్యాచ్ అనంతరం విన్నర్స్ కి కప్ ని ప్రెజెంట్ చేసే టైంలో ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. హర్ష భోగ్లే మాట్లాడుతూ ఇండియన్ టీం కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ని పిలిచినప్పటికీ ఆయన తన పక్కన ఉన్న కె ఎల్ రాహుల్ ని వెళ్ళమని చెప్పాడు దాంతో అక్కడున్న వాళ్లంతా రోహిత్ శర్మ చేసిన ఆ పని కి హర్షం వ్యక్తం చేసారు. ఎందుకంటే రోహిత్ శర్మ మొదటి రెండు వన్డే లు ఆడలేదు, ఆ రెండింటికి కెప్టెన్ గా కె ఎల్ రాహుల్ వ్యవహరించాడు కాబట్టి అందుకే ఆయన్నే కప్ తీసుకొమ్మని రోహిత్ శర్మ చెప్పాడు.అలాగే రోహిత్ శర్మ కప్ ఇస్తున్నప్పుడు కూడా దాన్ని పట్టుకోకుండా దూరం గా ఉండి క్రీడా స్ఫూర్తి ని చాటుకున్నాడు.

నిజానికి అది రాహుల్ అందుకోవాల్సిన కప్పే ఎందుకంటే ఆయన ఒక కెప్టెన్ గా, ఒక ప్లేయర్ గా ఈ సిరీస్ లో తన సత్తా చాటుకున్నాడు కాబట్టి రోహిత్ ఇలా చేసి కె ఎల్ రాహు లాంటి యంగ్ ప్లేయర్ లో ఒక మంచి ఉత్సాహాన్ని నింపాడు అని చాలా మంది అభిప్రాయం పడుతున్నారు.ఇక ఇంతకుముందు కూడా ఇలాంటి సంఘటన లు ఇండియా లో చాలా జరిగాయి. గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ ఇద్దరు శ్రీలంక మీద ఆడిన ఒక మ్యాచ్ లో సెంచరీలు చేసారు. దాంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ని గౌతమ్ గంభీర్ కి ఇవ్వగా అప్పుడే టీం లోకి వచ్చిన కోహ్లీ సెంచరీ చేయడం తో ఆయన్ని ఎంకరేజ్ చేయడానికి గంభీర్ ఆ అవార్డు ని కోహ్లీ కి అందించాడు. ఇలా ఇండియన్ టీం లో ఉన్న ప్లేయర్లు అందరు కూడా సమయం దొరికిన ప్రతిసారి వాళ్ళ క్రీడా స్ఫూర్తి ని చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు…

ఇక ఇది ఇలా ఉంటే వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా టీం తన మొదటి మ్యాచ్ ని ఆస్ట్రేలియా తో ఆడనున్న విషయం మనకు తెలిసిందే.ఇక దాని కోసం టీం లో ఎవరు ఉండాలి అనేదాని మీద తీవ్రమైన చర్చలు ఏం చేయకుండా ఆల్రెడీ కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇద్దరు కూడా ఏ ప్లేయర్లు ఆడాలి అనేది ఫిక్స్ అయి ఉన్నారు కాబట్టి ఇక ప్లేయర్ల విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు అనే చెప్పాలి…