IND vs AUS : ఇషాన్, సూర్య మళ్లీ విఫలం.. వారు వన్డేలకు పనికిరారు

IND vs AUS : ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా తడబాటు కొనసాగుతోంది.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టును 188 పరుగులకు ఆల్ అవుట్ చేసిన భారత్.. చేజింగ్ లో మాత్రం తీవ్ర ఇబ్బంది పడుతోంది. ముఖ్యంగా ఓపెనర్ గా వచ్చిన ఈశాన్ కిషన్,  వన్ డౌన్ బ్యాట్స్మెన్ గా వచ్చిన సూర్య కుమార్ యాదవ్ దారుణంగా విఫలమయ్యారు. సూర్య కుమార్ యాదవ్ టి20 లో నెంబర్ వన్ బ్యాట్స్మెన్. కానీ వన్డేలకు వచ్చేసరికి […]

Written By: Bhaskar, Updated On : March 17, 2023 7:45 pm
Follow us on

IND vs AUS : ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా తడబాటు కొనసాగుతోంది.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టును 188 పరుగులకు ఆల్ అవుట్ చేసిన భారత్.. చేజింగ్ లో మాత్రం తీవ్ర ఇబ్బంది పడుతోంది. ముఖ్యంగా ఓపెనర్ గా వచ్చిన ఈశాన్ కిషన్,  వన్ డౌన్ బ్యాట్స్మెన్ గా వచ్చిన సూర్య కుమార్ యాదవ్ దారుణంగా విఫలమయ్యారు. సూర్య కుమార్ యాదవ్ టి20 లో నెంబర్ వన్ బ్యాట్స్మెన్. కానీ వన్డేలకు వచ్చేసరికి అతను దారుణంగా విఫలమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే లోనూ అతను ఏమాత్రం రాణించలేకపోయాడు. ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డక్ గా వెను తిరిగాడు. శ్రేయాస్ అయ్యర్ జట్టుకు దూరమైన నేపథ్యంలో తుది జట్టులో చోటు సంపాదించుకున్న సూర్య.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో లెగ్ బిఫోర్ వికెట్ గా సూర్య కుమార్ యాదవ్ వెనుతిరిగాడు.

ఇక మరో ఆటగాడు ఇషాన్ కిషన్ కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. తన బావమరిది పెళ్లి కోసం రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. అతని స్థానంలో జట్టు మేనేజ్మెంట్ ఇశాన్ కిషన్ కు అవకాశం ఇచ్చింది. కానీ అతడు దానిని వినియోగించుకోలేకపోయాడు. మార్కస్ స్టోయినీస్ బౌలింగ్లో అతడు లెగ్ బిఫోర్ వికెట్ గా వెనుతిరిగాడు. వాస్తవానికి బంగ్లాదేశ్ మీద డబుల్ సెంచరీ సాధించిన అనంతరం.. ఇప్పటివరకు చెప్పుకోదగిన ఇన్నింగ్స్ కిషన్ ఆడలేదు..
కిషన్ అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లీ కూడా నిరాశపరచాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ లెగ్ బీఫోర్ వికెట్ గా వెనుదిరిగాడు. ఇలా 16 పరుగులకే భారత్ కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది.. ఇక క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ గిల్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ గిల్ కూడా అవుట్ అయ్యాడు.
ఇక తొలి వన్డేలో దారుణంగా విఫలమైన సూర్య, కిషన్ పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిషన్ బంగ్లాదేశ్ మీద డబుల్ సెంచరీ చేశాడని, ఆ తర్వాత ఏ మ్యాచ్ లోను ప్రభావం చూపలేకపోయాడని అంటున్నారు. సూర్య కుమార్ యాదవ్ సైతం వన్డేలకు పనికిరాడని, అతను కేవలం టి20 లు మాత్రమే ఆడాలని సూచిస్తున్నారు. జట్టుకు అవసరమైనప్పుడల్లా విఫలం అవడం సూర్యకు అలవాటే అని ఘాటుగా విమర్శిస్తున్నారు. తన కెరియర్లో ఒక న్యూజిలాండ్ తప్ప చిన్న దేశాలపైనే సెంచరీలు చేశాడని ఆరోపిస్తున్నారు. ఆస్ట్రేలియా వంటి బలమైన టీం మీద ధాటిగా ఆడటం సూర్య కుమార్ యాదవ్ కు చేతకాదని అంటున్నారు. సంజు శాంసన్ కు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. కిషన్ కూడా పక్కన పెట్టాలని సలహా ఇస్తున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 35.4.ఓవర్లలో 188 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా బ్యాటర్ లలో మిచల్ మార్ష్( 65 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్ లు 81)  మాత్రమే రాణించాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో షమీ, సిరాజ్ మూడు వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా రెండు వికెట్లు, హార్దిక్ పాండ్యా, కుల దీప్ యాదవ్ చెరో వికెట్ తీశారు.