AUS Vs IND: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. తొలి మ్యాచ్ పెర్త్ లో జరిగింది. ఈ మైదానంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా టీమిండియా కు బ్యాటింగ్ అప్పగించింది. కానీ వర్షం అనేక పర్యాయాలు అంతరాయం కలిగించింది. దీంతో టీమ్ ఇండియా ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు. పైగా ఓవర్లను పదేపదే కుదించడంతో ఆట తీరుపై లగ్నం చేయలేకపోయారు. దీంతో టీమ్ ఇండియా ఆ మ్యాచ్ ఓడిపోవలసి వచ్చింది.
Also Read: తెలుగు జట్టు గెలిచింది.. తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు.. కోచ్ అంటే ఇలానే ఉండాలి
పెర్త్ మైదానాన్ని ఎంపిక చేసిన తీరు పట్ల టీం మీడియా అభిమానులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఇలాంటి మైదానంపై వన్డే మ్యాచ్ ఎలా నిర్వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు టి20 సిరీస్ కు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. టీమిండియా, ఆస్ట్రేలియా ఐదు టి 20 మ్యాచ్ల సిరీస్ ఆడుతున్నాయి. ఈ సిరీస్ లో భాగంగా బుధవారం కాన్ బెర్రా వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. తొలి 5 ఓవర్ల వరకు మ్యాచ్ సజావుగానే సాగింది. ఆ తర్వాతే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మబ్బు పట్టడంతో చినుకులు కురిసాయి. చినుకులు ఏమాత్రం తగ్గలేదు. పైగా వర్షం అంతకంతకు పెరగడంతో మైదానం పూర్తిగా చిత్తడిగా మారింది. దీంతో ఔట్ ఫీల్డ్ మొత్తం బురదగా మారిపోయింది.
మొదట్లో తొలి 5 ఓవర్ల వరకు మ్యాచ్ సక్రమంగానే సాగింది. ఆ తర్వాత వర్షం కురవడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. కాస్త చినుకులు తగ్గడంతో మళ్ళీ మ్యాచ్ మొదలైంది. అప్పటికే టీం ఇండియా ఒక వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 4.4 ఓవర్ల వరకు మ్యాచ్ సాగింది. గిల్ 37*, సూర్య 39* పరుగులు చేశారు. ప్రమాదకరమైన ఓపెనర్ 19 పరుగులు చేసి అదరగొట్టాడు. హేజిల్ వుడ్ బౌలింగ్లో డేవిడ్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
అభిషేక్ అవుతున్న తర్వాత మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు సూర్య. ప్రారంభం నుంచి అతడు దూకుడు కొనసాగించాడు. కొత్తకాలంగా టి20లో సూర్యకుమార్ సరైన స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. తన స్థాయి ఇన్నింగ్స్ ఆడలేక పోతున్నాడు. దీంతో అతనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోని ఆస్ట్రేలియా గడ్డమీద ఎలాగైనా సత్తా చాటాలని అతడు భావిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితమే జట్టు సభ్యులతో కలిసి ఆస్ట్రేలియా గడ్డమీద అడుగుపెట్టిన అతడు.. మైదానంలో తీవ్రంగా శ్రమించాడు. తన లోపాలను పూర్తిగా సవరించుకున్నాడు. అయితే వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దు కావడంతో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ స్టైల్ ను చూసే అవకాశం ప్రేక్షకులకు లభించలేదు. 9.4 ఓవర్ వద్ద వర్షం అంతరాయం కలిగించడం.. ఎంతసేపటికీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ రద్దు చేస్తున్నప్పుడు ప్రకటించారు.
ఇటీవల పెర్త్ లో వర్షం కురిసి మ్యాచ్ నిర్వహణకు అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు టి20కి కూడా ఇదే తీరుగా అంతరాయం ఏర్పడటంతో మ్యాచ్ రద్దుకు అంపైర్లు మొగ్గు చూపించారు. మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందనుకుంటున్న క్రమంలో వర్షం వల్ల రద్దు కావడంతో అభిమానులు పూర్తిగా నిరాశ చెందారు. ఇదేం మైదానం అంటూ సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.