Ind Vs Aus 3rd Test: బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఇప్పటికే రెండు టెస్టులు ముగిశాయి. మొదటి టెస్టును ఇండియా గెలవగా, రెండో టెస్టును ఆస్ట్రేలియా తన ఖాతాలో వేసుకుంది. ఇక మూడో టెస్టు ప్రస్తుతం గబ్బా వేదికగా జరుగుతోంది. డిసెంబర్ 19న ఐదో రోజు ఆట జరుగుతోంది. ఇందులో భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రిస్ బూమ్రా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాలో అత్యధిక టెస్ట్ వికెట్లు తీసినందుకు లెజెండరీ కపిల్ దేవ్‌ను అధిగమించాడు. 2024లో బ్రిస్బేన్‌లో జరిగిన 3వ టెస్టులో జస్ప్రీత్ బుమ్రా ఈ చారిత్రాత్మక ఫీట్ సాధించాడు.
ఐదో రోజు ఆటలో..
బ్రిస్బేన్‌లోని గబ్బాలో జరిగిన ఇండియా– ఆస్ట్రేలియా ఐదో టెస్టులో భారత జాతీయ క్రికెట్ జట్టు స్పీడ్‌స్టర్ చారిత్రాత్మక మైలురాయిని సాధించాడు. వెటరన్ స్పీడ్‌స్టర్ ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక టెస్టు వికెట్లు తీసిన దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్‌ను అధిగమించాడు. గబ్బా టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మార్నస్ లాబుస్‌చాగ్నే వికెట్ తీసిన తర్వాత రైట్ ఆర్మ్ స్పీడ్‌స్టర్ ఈ చారిత్రాత్మక మైలురాయిని సాధించాడు. బుమ్రా 10 మ్యాచ్‌ల్లో 17.25 సగటుతో 52 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో, 1983 ఐసీసీ వన్డే ప్రపంచ కప్ విజేత కెప్టెన్, కపిల్ దేవ్, ఆస్ట్రేలియా గడ్డపై 24.58 బౌలింగ్ సగటుతో 11 టెస్టుల్లో 51 వికెట్లు తీశాడు. బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ 2024–25లో మిగిలి ఉన్న మరో రెండు టెస్టులతో బుమ్రా తన ఖాతాలో మరిన్ని వికెట్లు జోడించే గొప్ప అవకాశం ఉంది. ఎలైట్ జాబితాలో అనిల్ కుంబ్లే(49), రవిచంద్రన్ అశ్విన్ (40), బిషన్ సింగ్ బేడీ (35) కూడా ఉన్నారు. 7.3 ఓవర్లలో అ్ఖ 16/3 (201 పరుగుల ఆధిక్యం) ్ఢ భారత్ ఠిటఆస్ట్రేలియా 3వ టెస్ట్ 2024 5వ రోజు లైవ్ స్కోర్ అప్‌డేట్‌లు: నాథన్ మెక్‌స్వీనీని ఆకాష్ దీప్ తొలగించాడు.
ఎక్కువసార్లు ఐదు వికెట్లు..
ఇదిలా ఉంటే.. గబ్బా వేదికగానే రెండు రోజుల క్రితం బూమ్రా మరో మైలురాయిని అధిగమించాడు. ఆస్ట్రేలియాపై అత్యధికసార్లు ఐదు వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇండియా తరఫున టెస్టుల్లో అత్యధికసార్లు ఐదు వికెట్లు తీసిన రికార్డు సొంతం చేసుకున్నాడు. గబ్బా వేదికగా జరుగుతున మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి ఈ ఫీట్ సాధించాడు. ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీన్, స్టీవ్ స్మిత్‌తోపాటు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్స్‌ను పెలివియంకు పంపించి ఐదు వికెర్ట రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక న్యూజిలాండ్ సౌత్‌ఆఫ్రికా, ఆస్ట్రేలియాపై లాంగ్ ఫార్మాట్‌లో అత్యధిక 5 వికెట్లు తీసేసిన బౌలర్ల జాబితాలో ఫస్ట్ ప్లేస్‌కు చేరుకున్నాడు. ఈజాబితాలో బూమ్రా 8సార్లు ఐదు వికెట్లు తీయగా, కపిల్ దేవ్ 7సార్లు తర్వాతి స్థానంలో ఉన్నాడు. భారత్ తరఫున మో6స్టు ఫైఫర్స్ తీసిన బౌలర్లలో కపిల్‌దేవ్ 23 సార్లు తీయగా తర్వాత బూమ్రా 12సార్లు తీశాడు.
రసకందాయంలో మ్యాచ్..
ఇదిలా ఉంటే.. మూడో టెస్టు ఐదో రోజు మ్యాచ్ రసకందాయంగా మారింది. భారత్ చివరి వికెట్‌ను తొందరగా పడగొట్టిన ఆసిస్.. తర్వాత ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించింది. ఈ క్రమంలో వికెట్లు చకచకా పడిపోయాయి. 89–7 వికెట్లు పడడంతో ఆసిస్ డిక్లేర్ చేసింది. భారత్ ముందు ఊరించేలా 275 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇందులో బూమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఈ మ్యాచ్‌లో 9 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా 54 ఓవర్లలో పది వికెట్లు తీస్తే గెలుస్తుంది. భారత్ 275 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. మరి వరణుడు కూడా కరుణించాలి.