https://oktelugu.com/

Movie celebrities : ఈ ఒక్క సంవత్సరం లో ఇంత మంది విడాకులా? సినిమా సెలబ్రిటీలు ఎవరంటే..?

సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలు చాలా మంది ప్రస్తుతం విడాకుల బాట పడుతున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 18, 2024 / 11:02 AM IST

    Dhanush

    Follow us on

    Movie celebrities : సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలు చాలా మంది ప్రస్తుతం విడాకుల బాట పడుతున్నారు. చాలా సంవత్సరాల నుంచి వైవాహిక జీవితంలో చాలా చక్కగా ముందుకు సాగిన వారందరూ కూడా ఇప్పుడు విడాకులు తీసుకుంటూ ఉండడం యావత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరి ని తీవ్రమైన దిగ్భ్రాంతి కి గురి చేస్తుంది. ఇక సగటు ప్రేక్షకులకు సినిమా ఇండస్ట్రీ మీద వాళ్ల పెళ్లిళ్ల మీద నమ్మకాలు పోతున్నాయి. కారణం ఏదైనా కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతున్నాయి అంటే వీళ్ళు ఎన్ని రోజులు కలిసి ఉంటారో అని సగటు ప్రేక్షకులు అనుకునే స్థాయికి సినిమా ఇండస్ట్రీలోని వివాహ బంధం అనేది దిగజారి పోయిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ ఒక్క సంవత్సరంలోనే చాలామంది సినీ సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. వాళ్ళు ఎవరో ఒక్కసారి మనం తెలుసుకుందాం…

    ఏ ఆర్ రెహమాన్ – సైరాభాను

    మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఏ ఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డు ని కూడా గెలుచుకున్నాడు. అలాంటి ఏఆర్ రెహమాన్ 1995 లో సైరా భాను ని పెళ్లి చేసుకున్నాడు. ఇక 29 సంవత్సరాల పాటు వీళ్ళ వైవాహిక జీవితం చాలా సాఫీగా సాగినప్పటికి ఇప్పుడు ఆయన భార్య అయిన సైరా భాను కు విడాకులు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఇక రెహమాన్ అసిస్టెంట్ అయిన మోహిని డే కూడా తన భర్త అయిన మార్క్ నుంచి విడాకులు తీసుకున్నట్లుగా ప్రకటించింది. దాంతో రెహమాన్ మోహినీల మధ్య ఏదో సంబంధం ఉందనే విషయం అయితే చాలా క్లియర్ గా అర్థమవుతుంది…

    ధనుష్ – ఐశ్వర్య రజినీకాంత్

    ప్రస్తుతం కోలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న ధనుష్ రజనీకాంత్ కూతురు అయిన ఐశ్వర్య ని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే… 18 ఏళ్ల పాటు సజావుగా సాగిన వీళ్ళ జీవితంలో ఇప్పుడు ఎవరికి వాళ్లు సపరేట్ అయిపోయారు. 2022 లో విడాకులకు అప్లై చేసిన వీళ్ళ జంటకు 2024 నవంబర్ 27వ తేదీన కోర్టు నుంచి డైవర్స్ అనేవి అప్రూవల్ అయ్యాయి… ఇక ఇప్పటికే వీళ్లకు ఇద్దరు పిల్లలు ఉన్న విషయం మనకు తెలిసిందే…

    జీవి ప్రకాష్ కుమార్ – సైంధవి

    ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న జీవి ప్రకాష్ కుమార్ సింగర్ సైంధవి ని 2013 వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు. ఇక 2020 వ సంవత్సరంలో వీళ్ళకు ఒక పాప కూడా జన్మించింది. అప్పటి నుంచి వీళ్ళ వైవాహిక జీవితం చాలా సంతోషంగా ముందుకు సాగుతుందని అందరు అనుకునే లోపే ఈ సంవత్సరం ఈ జంట విడాకులు తీసుకున్నట్లుగా ప్రకటించారు…

    ఊర్మిళ – మోసిన్ అక్తర్ మీర్

    ప్రముఖ హీరోయిన్ అయిన ఊర్మిళ తన భర్త అయిన మోసిన్ అక్తర్ మీర్ విడాకులు తీసుకున్నట్లుగా ప్రకటించారు. ఇక 2016 లో పెళ్లి చేసుకున్న ఈ జంట వాళ్ళ 8 ఏళ్ల వైవాహిక జీవితానికి పుల్ స్టాప్ పెట్టినట్టుగా తెలుస్తోంది…

    యువ రాజ్ కుమార్ – శ్రీదేవీ బైరప్ప

    రాజ్ కుమార్ మనవడు అయిన యువరాజ్ కుమార్ శ్రీదేవి బహిరప్పను 2019 వ సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏం జరిగిందో తెలియదు గానీ ఈ సంవత్సరం వీళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు… కంతారా హీరోయిన్ అయినా సప్తమి గౌడతో రాజ్ కుమార్ కి ఎఫైర్ ఉందని అందుకే తనకు విడాకులు ఇస్తున్నాడు అంటూ శ్రీదేవి బైరప్ప ఒక ప్రకటన చేసింది. దాంతో సప్తమి గౌడ శ్రీదేవి పైన 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా కూడా వేసింది…

    అర్జున్ కపూర్ – మలైకా అరోరా

    బాలీవుడ్ లో లవ్ బర్డ్స్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న అర్జున్ కపూర్ మలైకా అరోరాలు సైతం ప్రస్తుతం విడిపోయినట్టుగా సమాచారం అయితే అందుతుంది. 2018 నుంచి డేటింగ్ లో ఉన్న వీళ్ళిద్దరూ ఇప్పుడు ఎవరికి వారు సపరేట్ అయిపోయినట్టుగా వార్తలైతే వస్తున్నాయి…