ఫస్ట్‌ డే ఆస్ట్రేలియాదే..

నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను కైవసం చేసుకోవాలని అటు ఇండియా.. ఇటు ఆస్ట్రేలియా.. ఇరు జట్లూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఇందులో భాగంగా సిడ్నీ వేదికగా మూడో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగాయి. అయితే.. గురువారం ఉదయం టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టునే తొలిరోజు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆట నిలిచే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. Also Read: విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి […]

Written By: Srinivas, Updated On : January 7, 2021 2:12 pm
Follow us on


నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను కైవసం చేసుకోవాలని అటు ఇండియా.. ఇటు ఆస్ట్రేలియా.. ఇరు జట్లూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఇందులో భాగంగా సిడ్నీ వేదికగా మూడో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగాయి. అయితే.. గురువారం ఉదయం టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టునే తొలిరోజు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆట నిలిచే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది.

Also Read: విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి ఎసరు.. చిక్కుల్లో కెప్టెన్

మార్నస్‌ లబుషేన్‌ 149 బంతులు 67, స్టీవ్‌ స్మిత్‌ 64 బంతుల్లో 31 పరుగులతో ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. మహ్మద్‌ సిరాజ్‌, నవదీప్‌ సైని చెరో వికెట్‌ తీశారు. ఆస్ట్రేలియా ఓపెనర్లలో డేవిడ్‌ వార్నర్‌‌ (5) విఫలమైనా.. పకోస్కీ 110 బంతుల్లో 62 అర్ధశతకంతో అదరగొట్టాడు.

అయితే.. మ్యాచ్‌ ప్రారంభమైన కొద్ది సేపటికే వర్షం కురిసింది. దీంతో తొలి సెషన్‌లో ఆట 7.1 ఓవర్లు మాత్రమే నడిచింది. అప్పటికే సిరాజ్‌.. డేవిడ్‌ వార్నర్‌‌ను ఔట్‌ చేసి భారత్‌కు శుభారంభం ఇచ్చాడు. ఈ క్రమంలోనే భోజన విరామ సమయానికి సైతం వర్షం ఆగకపోవడంతో అరగంట ముందే తొలి సెషన్‌ను ముగించారు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోర్‌‌ 21/1 గా నమోదైంది.

సుమారు నాలుగు గంటల విరామం తర్వాత మ్యాచ్‌ తిరిగి ప్రారంభమైంది. యువ బ్యాట్స్‌మెన్‌ పకోస్కీ, వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ మార్నస్‌ లబుషేన్‌ శతక భాగస్వామ్యం నిర్మించారు. ఈ క్రమంలోనే పకోస్కీ అందించిన రెండు క్యాచ్‌లను పంత్‌ జార విడిచాడు. అయితే.. హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న అతడిని సైని వికెట్ల ముందు దొరకబుచ్చుకొని రెండో వికెట్‌ తీశాడు. అప్పటికి ఆసీస్‌ స్కోర్‌‌ 106/2గా నమోదైంది.

Also Read: ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు భారత జట్టు ఇదే?

పకోస్కీ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన స్టీవ్‌స్మిత్‌ 65 బంతుల్లో 30 పరుగులు చేశాడు. బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరోవైపు లబుషేన్‌ సైతం హాఫ్‌ సెంచరీ చేశాడు. చివరికి తొలి రోజు ఆట పూర్తయ్యే సమయానికి ఇద్దరూ 60 పరుగుల జోడించారు. దీంతో మరో వికెట్‌ పడకుండా ఆస్ట్రేలియా తొలి రోజు 166/2తో ఆట ముగించేసింది.