India vs Australia 3rd ODI : రాజ్ కోట్.. భారత్_ ఆస్ట్రేలియా మధ్య మూడవ వన్డే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. చేజింగ్ ను ఇండియా ప్రారంభించింది. ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగారు. తొలి రెండు ఓవర్లు నింపాదిగా ఆడిన రోహిత్.. తర్వాత తన విశ్వరూపం చూపించాడు. సుందర్(30 బంతుల్లో 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు) నిదానంగా ఆడుతున్నప్పటికీ.. రోహిత్ మాత్రం ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ కథనం రాసే సమయానికి రోహిత్ శర్మ 48 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.. ఫోర్లకంటే సిక్స్ లే ఎక్కువగా ఉన్నాయంటే అతడి బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రోహిత్ శర్మ చేస్తున్న బ్యాటింగ్ తాలూకు సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వాస్తవంగా ఆస్ట్రేలియా బౌలర్లు పదునైన బంతులు వేస్తారు. ముఖ్యంగా చేజింగ్ సమయంలో ప్రత్యర్థి బ్యాటర్లను లక్ష్యంగా చేసుకొని బంతులు సంధిస్తారు. కానీ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా బౌలర్లను పెద్దగా లక్ష్య పెట్టలేదు. హజిల్ ఉడ్, స్టార్క్, కమ్మిన్స్, గ్రీన్, ఇలా ఏ ఒక్క బౌలర్ నూ విడిచిపెట్టలేదు. మైదానం నలుమూలలా షాట్లు ఆడాడు. కొండంత ఉన్న రన్ రేటును తగ్గించుకుంటూ వచ్చాడు.. అతని బ్యాటింగ్ వీరవిహారం వల్ల కేవలం 10 ఓవర్లలో ఇండియా స్కోర్ 70 పరుగులకు కి పైగా చేరుకుంది. ఆస్ట్రేలియాకు ఎక్కడ కూడా తగ్గకుండా రోహిత్ శర్మ రన్ రేట్ ను కొనసాగించాడు. సుందర్ ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడుతున్న వేళ.. రోహిత్ శర్మ స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించాడు. ప్రత్యర్థి జట్టులో ఏ బౌలర్ ను కూడా లెక్కచేయకుండా దూకుడుగా బ్యాటింగ్ చేశాడు.. ధారాళంగా పరుగులు తీశాడు.
రోహిత్ శర్మకు ఆస్ట్రేలియా మీద తిరుగులేని రికార్డు ఉంది. ఆస్ట్రేలియా అంటేనే ఊగిపోయే రోహిత్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు. ఇప్పటికే రెండు వన్డేలు గెలిచి సిరీస్ సాధించిన భారత్.. ఈ మూడో వన్డే కూడా గెలిచి ఆస్ట్రేలియా మీద క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే బుధవారం జరుగుతున్న మూడో వన్డేలో చేజింగ్ ను దూకుడుగా ప్రారంభించింది. ఆస్ట్రేలియా విధించిన 352 పరుగుల లక్ష్యాన్ని చేదించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ప్రస్తుతం క్రీజు లో రోహిత్ శర్మ(68), విరాట్ కోహ్లీ(27) ఉన్నారు. ఈ కథనం రాసే సమయానికి భారత్ 18.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 120 పరుగులు చేసింది.
Triple Treat
A quickfire half century from Captain Rohit Sharma, who’s looking in fine touch in the chase #TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/zNdFvUBp3s
— BCCI (@BCCI) September 27, 2023