India vs Australia 1st T20I: ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనేది ఒక సామెత. ఇప్పుడు ఇంట గెలవాలి. తర్వాత బయట ప్రపంచ కప్ ను ఒడిసి పట్టాలి. అది ఇండియాకి అనివార్యం కూడా. అలా అయితేనే టీ ట్వంటీ లో నంబర్ వన్ ర్యాంక్ ఉంటుంది. లేకుంటే అంతే సంగతులు. ఆసియా కప్ లో పేలవ ప్రదర్శన తర్వాత టీ మిండియా ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ అడనుంది. మంగళవారం పంజాబ్ లోని మొహాలి వేదిక ప్రారంభం కాబోతోంది. టి20 ర్యాంకింగ్స్ లో స్థానంలో కొనసాగుతున్న భారత్.. ఆరో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాకు మధ్య పోటీ రసవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ కప్ కు మరికొద్ది రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఇరు జట్లు ఈ సీరీస్ ను సన్నాహకంగా భావిస్తున్నాయి. అయితే ఇరు జట్లతో పోలిస్తే భారత్ పైనే ఒత్తిడి అధికంగా ఉంది. ఎందుకంటే ఇటీవల జరిగిన ఆసియా కప్ లో భారత ఆటగాళ్ల ప్రదర్శన అలా ఉంది మరి. పాకిస్తాన్‌తో మొదటి మ్యాచ్‌లో గెలిచిన ఇండియా.. ఆ తర్వాత తప్పక గెలవాల్సిన మ్యాచుల్లో ఓడిపోయింది. మరిముఖ్యంగా మిడిల్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. డెత్ ఓవర్లలో బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చారు. ఫలితంగా పాకిస్తాన్, శ్రీలంక లాంటి జట్ల చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన జట్టు ఒట్టి చేతులతో స్వదేశానికి రావాల్సి వచ్చింది.
ఇది సరిపోదు
భారత జట్టులో ఓపెనర్లు శుభారంబాన్ని అందిస్తున్నా మిడిల్ ఆర్డర్ మాత్రం తడబడుతోంది. ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితమవుతున్నారు. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కూడా అంతగా ప్రభావం చూపడం లేదు. దీంతో భారీ స్కోర్లు నమోదు కావడం లేదు. దీనికి తోడు జస్ ప్రీత్ బుమ్రా లేని బౌలింగ్ దళం అంతగా ప్రభావం చూపడం లేదు. భువనేశ్వర్ కుమార్ లో మునుపటి లయ కనిపించడం లేదు. డెత్ ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. ఆసియా కప్ లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ 19 పరుగులు ఇచ్చిన విషయాన్ని ఇప్పుడుప్పుడే అభిమానులు మర్చిపోలేరు. అయితే ఈ సిరీస్ లో మెరుగైన ప్రదర్శన చేసిన వారికే ప్రపంచ కప్ లో చోటు ఉంటుందని సెలక్షన్ కమిటీ తేల్చి చెప్పేసింది.
ఆస్ట్రేలియా కూడా పూర్తి సన్నద్దం
భారత్ తో టి20 సిరీస్ కు ఆస్ట్రేలియా పూర్తిస్థాయిలో సన్నద్ధమై వచ్చింది. మరికొద్ది రోజుల్లో ప్రపంచ కప్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ సిరీస్ ని సన్నాహకంగా భావిస్తోంది. భారత్ జట్టుతో పోల్చితే ఆస్ట్రేలియా జట్టే బలంగా కనిపిస్తోంది. టాప్ 7 వికెట్ల వరకు ఆ జట్టుకు ఆల్‌రౌండర్లు ఉన్నారు. ఆరోన్ పించ్ సారధ్యంలోని ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్, మిచెల్ మార్స్, మాక్స్ వెల్, టిమ్ డేవిడ్, ప్యాట్ కమిన్స్, హజీల్ వుడ్ లతో ఆ జట్టు బలంగా కనిపిస్తోంది. అయితే టీ 20 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా పై భారత్ దే పై చేయి.
ఇప్పటి ఇరుజట్లు పరస్పరం ఆడిన 23 మ్యాచ్ ల్లో భారత్ 13 మ్యాచ్ ల్లో గెలుపొందింది. ఆస్ట్రేలియా 9 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. మరిముఖ్యంగా 2013-2017 కాలంలో ఆస్ట్రేలియా భారత్ మధ్య 9 టీ 20 మ్యాచ్ లు జరగగా.. అందులో ఎనిమిది మ్యాచ్ ల్లో భారత్ గెలుపొందింది. అయితే గత టీ 20 ప్రపంచ కప్ ను గెలుపొందిన ఆస్ట్రేలియాను ఎట్టి పరిస్థితుల్లో తక్కువ అంచనా వేయబోమని ఇండియన్ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ అంటున్నాడు. మొన్న ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించి ఫామ్ లోకి రావడంతో ఈసారి అతడిని ఓపెనర్ గా తీసుకోవాలని భావిస్తున్నాడు. గత ఆసియా కప్ లో ప్రయోగాలు పెద్దగా ఫలితం ఇవ్వని నేపథ్యంలో.. ఈ ప్రయోగం ఎంతవరకు సఫలీకృతం అవుతుందో వేచి చూడాల్సి ఉంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: India vs australia 1st t20i bumrah set to return to action tough choice between pant and karthik
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com