Star Heroine: మనం చెప్పుకుంటున్న ఆ స్టార్ లేడీ ఎవరో కాదు మనీషా కోయిరాలా. 1970 ఆగస్టు 16న నేపాల్ లో పుట్టిన మనీషా కొయిరాలా బాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆమె ఫస్ట్ హిందీ చిత్రం సౌధాఘర్. 1991లో విడుదలైన ఈ చిత్రంలో బాలీవుడ్ లెజెండ్స్ రాజ్ కుమార్, దిలీప్ కుమార్ ప్రధాన పాత్రలు చేశారు. ఈ సినిమా కమర్షియల్ హిట్. అనంతరం మనీషా కొయిరాలా నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి.
అనంతరం 1942: ఏ లవ్ స్టోరీ చిత్రంతో హిట్ కొట్టింది. విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన ఈ చిత్రం మనీషాకు మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది. బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది. కోలీవుడ్ లో మనీషా ఆల్ టైం క్లాసిక్ లో నటించింది. దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన బొంబాయి చిత్రం అప్పట్లో దేశాన్ని ఊపేసింది. మనీషాను మణిరత్నం అద్భుతంగా సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేశారు. ఇక దర్శకుడు శంకర్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీస్ భారతీయుడు, ఒకే ఒక్కడు చిత్రాల్లో మనీషా హీరోయిన్ గా చేసింది.
తెలుగులో మనీషా కేవలం ఒక చిత్రం మాత్రమే చేసింది. నాగార్జునకు జంటగా క్రిమినల్ చేసింది. ఇది బైలింగ్వెల్ మూవీ. హిందీలో కూడా విడుదల చేశారు. దాదాపు రెండు దశాబ్దాలు మనీషా కెరీర్ సక్సెస్ఫుల్ గా సాగింది. స్టార్ లేడీగా బాలీవుడ్ ని షేక్ చేసింది. ప్రొఫెషనల్ గా సక్సెస్ అయిన మనీషా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒడిదుడుకులు ఉన్నాయి. ఆమె ఏకంగా 12 మందితో ఎఫైర్ నడిపారనే పుకార్లు ఉన్నాయి.
నటులు వివేక్ ముష్రాన్, నానా పటేకర్, వ్యాపారవేత్త సెసిల్ ఆంటోనిలు ఈ లిస్ట్ లో ఉన్నారు. ఒక్కరితో కూడా ఆమె బంధం వివాహం వరకు వెళ్ళలేదు. 2010లో మనీషా నేపాలీ బిజినెస్ మ్యాన్ విరాట్ దహల్ ని వివాహం చేసుకుంది. రెండేళ్లకే విడాకులు తీసుకుని విడిపోయింది. ప్రస్తుతం ఆమె ఒంటరిగా ఉంటున్నారు. 2012లో మనీషా క్యాన్సర్ బారిన పడినట్లు వార్తలు వచ్చాయి. అదే ఏడాది ఆమెకు సర్జరీ జరిగింది. ఆపరేషన్ సక్సెస్ కావడంతో మనీషా క్యాన్సర్ ని జయించింది.
Web Title: Interesting facts about manisha koirala
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com