India Vs Afghanistan 3rd T20: ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మూడో టి20 మ్యాచ్ లో ఇండియన్ టీం అద్భుతమైన విజయాన్ని సాధించింది.ఇక దాంతో ఈ సిరీస్ ని ఇండియన్ టీమ్ కైవసం చేసుకుంది. టి 20 వరల్డ్ కప్ కి ముందు ఇండియా ఆడిన చివరి టి20 సిరీస్ ఇదే కావడంతో ఇండియా దీన్ని చాలా ప్రస్టేజీయస్ గా తీసుకొని 3-0 తేడాతో ఆఫ్గనిస్తాన్ టీమ్ ని క్లీన్ స్వీప్ చేసింది. ఇక నిన్న ఈ మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరికి చాలా ఉత్కంఠను కలిగిందనే చెప్పాలి.
ఇక ఈ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ మొదట బ్యాటింగ్ చేసింది. ఇక రోహిత్ శర్మ విధ్వంసకరమైన సెంచరీ చేయడం తో ఇండియన్ టీమ్ 20 ఓవర్లకి 212 పరుగులు చేసింది. ఇక సెకండ్ బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ టీం కూడా 212 పరుగులు చేసింది. దాంతో మ్యాచ్ టై అయింది ఇక తప్పేది లేక సూపర్ ఓవర్ అడాల్సి వచ్చింది. ఇక మొదటి సూపర్ కూడా టై అవ్వడంతో సెకండ్ సూపర్ ఓవర్ ఆడారు. ఇక ఈ సూపర్ ఓవర్ లో ఇండియన్ టీం తరపున రోహిత్ శర్మ, రింకు సింగ్ బరి లోకి దిగారు. రోహిత్ శర్మ మొదటి బాల్ కి సిక్స్ కొట్టి సెకండ్ బాల్ కి ఫోర్ కొట్టాడు. ఇక తర్వాత బాల్ కి సింగిల్ తీసి రింగు సింగ్ కి ఇచ్చాడు. రింగు సింగ్ భారీ షాట్ అడబోయి కీపర్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఇక దాంతో క్రీజ్ లోకి వచ్చిన సంజు శాంసన్ కూడా భారీ షాట్ కు ప్రయత్నించినప్పటికీ అది బ్యాట్ కు తగలలేదు. దాంతో సింగిల్ తీసే క్రమం లో కీపర్ గుర్బాజ్ డైరెక్ట్ గా వికెట్లకి కొట్టడంతో రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు.
దాంతో ఇండియన్ టీమ్ 11 పరుగులు మాత్రమే చేయగలిగింది. 12 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ టీం రవి బిష్ణోయ్ వేసిన మొదటి బంతికే క్యాచ్ ఇచ్చి నబి అవుట్ అయ్యాడు. దాంతో క్రీజ్ లోకి వచ్చిన మరొక ప్లేయర్ కూడా తర్వాత బంతికే అవుట్ అవ్వడంతో ఇండియన్ టీం భారీ విజయాన్ని సాధించింది. ఇక రోహిత్ శర్మ నిన్న వన్ మ్యాన్ షో చేశాడనే చెప్పాలి. కెప్టెన్ గా, ప్లేయర్ గా చాలా బరువు, బాధ్యతలను మోసాడు…
ఇప్పటివరకు ఇండియన్ టీమ్ ని సూపర్ ఓవర్లో ఓడించే టీం లేదు అనేది మనవాళ్ళు మరొకసారి ప్రూవ్ చేసి చూపించారు. మొత్తానికైతే ఈ సిరీస్ ని 3-0 తో గెలుచుకోవడం తో పాటు గా ఇండియన్ టీం లో ఉన్న ప్లేయర్లు అందరు ఫామ్ లో ఉన్నారని మరొకసారి మన టీమ్ గర్వం గా ప్రపంచానికి చాటి చెప్పిందనే చెప్పాలి…ఇక టి 20 వరల్డ్ కప్ సమరానికి సిద్దం అవ్వడమే బ్యాలెన్స్….