Ram Mandir: ప్రభాస్ చేసిన పని దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. రియల్ హీరో అంటూ ఆయన్ని కొనియాడుతున్నారు. అన్నదానం కోసం ఏకంగా రూ. 50 కోట్లు ఖర్చు చేయనున్నాడు ఈ పాన్ ఇండియా స్టార్. విషయంలోకి వెళితే… జనవరి 22న అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం జరగనుంది. ప్రధాని మోడీ నేతృత్వంలో ప్రతిష్టాత్మక ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానం దక్కింది. టాలీవుడ్ కి చెందిన ప్రభాస్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లను కూడా ఆహ్వానించారు.
కాగా ప్రభాస్ ఓ అడుగు ముందుకేసి అన్నదాన కార్యక్రమం బాధ్యత తీసుకున్నారు. జనవరి 22న అయోధ్యలో జరిగే వేడుకకు దేశ నలుమూలల నుండి లక్షల మంది భక్తులు హాజరు కానున్నారు. వీరందరికీ భోజన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయోధ్య రామ మందిరం పరిసర ప్రాంతాల్లో 300 చోట్ల అన్నదానం చేయనున్నారు. దీనికి దాదాపు రూ. 50 కోట్లు ఖర్చు అవుతుందట. ఈ మొత్తాన్ని ప్రభాస్ భరించేందుకు ముందుకు వచ్చాడట.
యాభై కోట్లు అంటే ప్రభాస్ రెమ్యూనరేషన్ లో దాదాపు సగం. ఇంత పెద్ద మొత్తాన్ని రాముని భక్తుల కోసం ఖర్చు చేయడం ఈ హీరో చేయని పని. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రభాస్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రభాస్ భోళా గుణం గురించి అందరికీ తెలిసిందే. కరోనా సమయంలో అందరు స్టార్ హీరోలు రూ. 50 లక్షలు డొనేట్ చేస్తే… ప్రభాస్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ కి రూ. 3 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షలు దానం చేశాడు.
అలాగే సెట్స్ లో తన కో స్టార్స్ కి అరుదైన వంటకాలతో విందు ఏర ఏర్పాటు చేయడం ప్రభాస్ కి ఆనవాయితీగా ఉంది. తనతో పని చేసే వారు కూడా మంచి భోజనం చేయాలని ప్రభాస్ భావిస్తాడట. ఇవన్నీ గమనిస్తున్న జనాలు ప్రభాస్ నిజంగా రాజునే అంటున్నారు. మరోవైపు ప్రభాస్ కల్కి 2829 AD , రాజా సాబ్ చిత్రాల షూటింగ్ లో పాల్గొంటున్నారు. కల్కి మే 9న విడుదల కానుంది. ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ. నాగ్ అశ్విన్ దర్శకుడు. ఇక రాజా సాబ్ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు.
o