Nithiin Thammudu Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమం లోనే నితిన్ లాంటి నటుడు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నప్పటికి ఆయనకు సరైన సక్సెస్ అయితే దక్కడం లేదు. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ బాట పడుతున్నాయి. భీష్మ సినిమాతో సక్సెస్ ని అందుకున్న ఆయన ఆ సినిమా తర్వాత సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. ఇక రీసెంట్ గా తమ్ముడు (Thammudu)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా కూడా ఫ్లాప్ ని మూటగట్టుకుంది. నిజానికి ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ రోజున దిల్ రాజు మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఒక సినిమాకి ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైనప్పుడు ఆర్టిస్టుల దర్శకుడికి ప్రొడ్యూసర్ రెమ్యునరేషన్స్ ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక అదే సమయంలో ఈ సినిమా నితిన్ తో చేయాలి అనుకున్నప్పుడు నితిన్ నీకు రెమ్యూనరేషన్ ఎంత ఇవ్వమంటావు అని అడిగితే ఎంతో కొంత ఇచ్చేయండి అంకుల్ ముందైతే సినిమా చేయండి అని నితిన్ చాలా గొప్ప మనసు చాటుకున్నాడు అంటు దిల్ రాజు చెప్పాడు.
ఇక దాంతో పాటుగా దర్శకుడు వేణు శ్రీరామ్ సైతం రెమ్యూనరేషన్ గురించి ఆలోచించకుండా సినిమా చేయమని చెప్పినట్టుగా దిల్ రాజు తెలియజేశాడు. అయితే 75 కోట్ల భారీ బడ్జెట్ తో తమ్ముడు సినిమాని తెరకెక్కించినట్టుగా దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమా ఇప్పుడు ఫ్లాప్ టాక్ ని సంపాదించుకోవడంతో కనీస
ఓపెనింగ్స్ కూడా రాలేదు.
మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంత కలెక్షన్స్ వసూలు చేసిన కూడా అది 20 కోట్లకు మించి వసూలు అయితే రాబట్టలేదు అనే ఒక ఆలోచనలో ట్రేడ్ పండితులైతే ఉన్నారు. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ఇప్పుడు ఫ్లాప్ అయింది. కాబట్టి దిల్ రాజు హీరోకి, దర్శకుడుకి రెమ్యూనరేషన్ ఇస్తాడా లేదా అనే ధోరణిలో కొన్ని అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో నితిన్ మరో సినిమా కూడా దిల్ రాజు కాంపౌండ్ లోనే చేస్తున్నాడు.
కాబట్టి ఈ రెండు సినిమాల రెమ్యూనరేషన్స్ కలిపి ఒకేసారి ఇస్తాడా లేదంటే పక్కన పెట్టేస్తాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక వేణు శ్రీరామ్ కూడా దిల్ రాజు బ్యానర్ లోనే సినిమాలు చేస్తూ ఉంటాడు కాబట్టి అతనికి వచ్చే సినిమా రెమ్యూనరేషన్ తో బ్యాలెన్స్ చేస్తాడు అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…