India vs West Indies: టీమిండియా విజయాల జోరు కొనసాగిస్తోంది. విదేశీ గడ్డలపై అలుపెరగని విక్టరీలు సాధిస్తూ దూసుకుపోతోంది. ఇంగ్లండ్ ప్రారంభమైన ప్రస్థానం ఆగకుండా ముందుకు పోతోంది. ప్రత్యర్థి ఏదైనా విజయమే లక్ష్యంగా బరిలో దూకుతోంది. సమష్టి రాణింపుతో చిరస్మరణీయమైన విజయాలు సొంతం చేసుకుంటోంది. శిఖర్ ధావన్ నేతృత్వంలో టీమిండియా కరేబియన్ గడ్డపై సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. మూడు వన్డేల్లో విజయం సాధించి వెస్టిండీస్ పతనాన్ని శాసించింది. దీంతో టీమిండియాకు ఎదురే లేకుండా పోతోంది.

ఇంగ్లండ్ లో టీ20 తోపాటు వన్డే సిరీస్ లను దక్కించుకుని ఇంగ్లండ్ కు నిద్రపట్టకుండా చేసింది. ఇప్పుడు వెస్టిండీస్ కు కూడా కునుకు లేకుండా చేస్తోంది. వన్డే సిరీస్ వైట్ వాష్ చేయడంతో ఇక టీ20లో ఎలా ఉండబోతోందనే భయం కరేబియన్లకు పట్టుకుంది. నిన్నజరిగిన మూడో వన్డేలో వర్షం రావడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఇండియా విక్టరీ కొట్టింది. దీంతో మూడు వన్డేల్లో టీమిండియా తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. ఇండియా ధాటికి వెస్టిండీస్ కుదేలైంది.
ఈనెల 29 నుంచి టీ20 ఐదు మ్యాచులు జరగనున్నాయి. ఇందులో కూడా టీమిండియా తిరుగులేని విజయాలు సొంతం చేసుకోవాలని ఉబలాటపడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు మొదలెట్టింది. కసరత్తులు ముమ్మరం చేస్తోంది. ప్రత్యర్థి ఆటగాళ్లను కట్టడి చేసే వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ క్రమంలో వెస్టిండీస్ ను ఇందులో కూడా ఓడించి తిరుగులేని విజయయాత్ర కొనసాగించాలని పట్టు పడుతోంది. దీంతో టీమిండియా జోరుకు వెస్టిండీస్ కళ్లెం వేయలేకపోతోంది. దీంతో అప్రతిహ విజయాలు అందుకుంటోంది టీమిండియా. అభిమానుల అంచనాల మేరకు రాణిస్తూ వారిలో జోష్ నింపుతోంది. శిఖర్ ధావన్ కెప్టెన్సీలో వెస్టిండీస్ ను ఓ ఆట ఆడుకుంటోంది.
నిన్న జరిగిన మూడో వన్డేలో వర్షం కారణంగా ఓవర్లు కుదించారు. 36 ఓవర్లలో టీమిండియా 225 పరుగులు చేసింది. వెస్టిండీస్ లక్ష్యం 256గా నిర్ణయించారు. 26 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీమిండియా విజయం ఖరారైంది. మొత్తానికి వెస్టిండీస్ ను 3-0 తో వైట్ వాష్ చేసి తిరుగులేని జట్టుగా నిలిచింది. వెస్టిండీస్ పై అత్యధిక సిరీస్ లు గెలిచిన జట్టుగా టీమిండియా ఖ్యాతి ఆర్జించింది. 12 సిరీస్ ల్లో వెస్టిండీస్ ను చిత్తు చేసిన జట్టుగా టీమిండియా అరుదైన రికార్డు సొంతం చేసుకోవడం గమనార్హం.