India Test Captain : 2025 -27 సీజన్ కు సంబంధించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సైకిల్ మొదలవుతుంది. దీంతో ఇంగ్లాండు జట్టుతో జూన్ నెల నుంచి మొదలయ్యే టెస్ట్ సిరీస్ కు విపరీతమైన ప్రాధాన్యం ఏర్పడింది. ఎందుకంటే గత ఏడాది జనవరి నెలలో భారత్ వేదికగా సిరీస్లో ఇంగ్లాండ్ ఓటమిపాలైంది. అయితే ఈసారి స్వదేశంలో జరిగే టెస్ట్ సిరీస్లో టీమిండియా పై బదులు తీర్చుకోవాలని ఇంగ్లాండ్ జట్టు భావిస్తుంది. ఈ క్రమంలో టెస్ట్ ఫార్మాట్ నుంచి రోహిత్ శర్మ శాశ్వతంగా తప్పుకోవడంతో.. ఒక్కసారిగా చర్చ మొదలైంది.. అయితే న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో బలమైన జట్టును రూపొందించాలని టీమ్ ఇండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. ఐపీఎల్ సీజన్ కొనసాగుతుండగానే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే జట్టుపై భారత సెలక్టర్లు దృష్టి సారించారు..
Also Read : ఇంగ్లాండ్ పై సత్తా చూపిస్తానని చెప్పిన రోహిత్.. ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించినట్టు?
రోహిత్ టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకున్న తర్వాత.. టీమ్ ఇండియాకు నాయకత్వం వహించే ఆటగాడు ఎవరు అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం లభించింది. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం టీమ్ ఇండియా టెస్ట్ ఫార్మాట్ కు ఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తాడు అని తెలుస్తోంది.. వాస్తవానికి రోహిత్ స్థానంలో గిల్ ను కెప్టెన్ గా నియమిస్తారని చర్చ జరిగింది. ప్రస్తుతం టెస్ట్ జట్టు బుమ్రా ఐస్ కెప్టెన్ గా ఉన్నాడు. అయితే అతడు ఇటీవల కాలంలో విపరీతమైన గాయాల బారిన పడుతున్నాడు. పైగా అతనిపై వర్కులోడు విపరీతంగా ఉంది. అందువల్లే అతడిని నాయకత్వ బృందం నుంచి తప్పించే ఆలోచనలు సెలక్టర్లు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇంగ్లాండ్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్లో బుమ్రా పూర్తిస్థాయిలో ఆడతాడనే నమ్మకం లేదు. అయితే గిల్ లేదా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ లలో ఎవరో ఒకరికి కెప్టెన్సీ దక్కవచ్చని తెలుస్తోంది. అయితే టెక్నిక్.. ఆడే తీరు.. సామర్థ్యం ఆధారంగా కేఎల్ రాహుల్ కు అవకాశం దక్కుతుందని సమాచారం. ఒకవేళ భవిష్యత్తు కాలాన్ని గనుక బీసీసీఐ దృష్టిలో పెట్టుకుంటే గిల్ కు సారధ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. మరోవైపు రోహిత్ శర్మ స్థానంలో ఓపెనర్ గా సాయి సుదర్శన్ కు అవకాశం లభించవచ్చు.. యశస్వి జైస్వాల్, గిల్, నితీష్ కుమార్ రెడ్డి, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జూరెల్, రిషబ్ పంత్ కు బ్యాటర్లుగా అవకాశం లభించనుంది. ప్రత్యేకమైన స్పిన్ బౌలర్ గా కులదీప్ యాదవ్ కు.. స్పిన్ ఆల్రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్.. రవీంద్ర జడేజా కు అవకాశాలు లభించవచ్చు.. ఇక హర్షిత్ రాణా, బుమ్రా, మహమ్మద్ సిరాజ్, షమీ కి అవకాశం లభిస్తుందని తెలుస్తోంది. ఇక ఇంగ్లాండ్ జట్టుతో జూన్ 20 నుంచి టెస్ట్ సిరీస్ మొదలవుతుంది. అన్నట్టు ఇంగ్లాండు గడ్డపై భారత జట్టు 2007 అనంతరం ఇంతవరకు ఒక్క టెస్ట్ సిరీస్ కూడా గెలవలేదు.