https://oktelugu.com/

ఇంగ్లండ్‌ టూర్‌‌కు ఇండియా జట్టు ఎంపిక నేడే

వచ్చే ఫిబ్రవరి 5 నుంచి టీమిండియా ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఎంపిక చేసే సమయం కూడా ఆసన్నమైంది. మంగళవారం కొత్త చైర్మన్‌ చేతన్‌ శర్మ సారథ్యంలో జరిగే సెలక్షన్‌ కమిటీ సమావేశంలో జట్టును ప్రకటించనున్నారు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టులకు భారత బృందాన్ని ఎంపిక చేయనున్నారు. అయితే ఈ ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. Also Read: ఆస్ట్రేలియాతో 4వ టెస్ట్: భారత్ ను ఊరిస్తున్న విజయం […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 19, 2021 / 02:31 PM IST
    Follow us on


    వచ్చే ఫిబ్రవరి 5 నుంచి టీమిండియా ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఎంపిక చేసే సమయం కూడా ఆసన్నమైంది. మంగళవారం కొత్త చైర్మన్‌ చేతన్‌ శర్మ సారథ్యంలో జరిగే సెలక్షన్‌ కమిటీ సమావేశంలో జట్టును ప్రకటించనున్నారు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టులకు భారత బృందాన్ని ఎంపిక చేయనున్నారు. అయితే ఈ ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

    Also Read: ఆస్ట్రేలియాతో 4వ టెస్ట్: భారత్ ను ఊరిస్తున్న విజయం

    ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ముగిశాక పితృత్వ సెలవుపై స్వదేశానికి వచ్చేసిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఇంగ్లండ్‌తో సిరీస్‌లో తిరిగి జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. గాయం కారణంగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లలేకపోయిన వెటరన్‌ పేసర్‌ ఇషాంత్ ‌శర్మ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో ఆడుతున్న ఇషాంత్‌ ఫిట్‌నెస్‌ నిరూపించుకున్నాడు. దీంతో అతనికి జట్టులో చోటు ఖాయం. ఇక పేసర్ భువనేశ్వర్ కుమార్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

    ఇషాంత్ ‌శర్మతోపాటు ఆసీస్‌ సిరీస్‌లో గాయపడి కోలుకున్న జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్‌ తిరిగి జట్టులోకి రానున్నారు. గాయాలతో కంగారూలతో టెస్టు సిరీస్‌ మధ్యలో వైదొలిగిన మహ్మద్ షమి, రవీంద్ర జడేజా, ఉమేశ్‌ యాదవ్‌, హనుమ విహారి సెలక్షన్‌కు అందుబాటులో లేరు. శార్దూల్‌ ఠాకూర్‌, టీ నటరాజన్‌లను రిజర్వ్‌ పేసర్లుగా ఎంపిక చేసే అవకాశాలున్నాయి. జడేజాకు బదులు షాబాజ్‌ నదీమ్‌ను జట్టులోకి తీసుకోవచ్చని సమాచారం.

    Also Read: 7 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా.. భారత్ కు లక్కీ ఛాన్స్?

    ఆస్ట్రేలియా పర్యటనలో శుభ్‌మన్‌ గిల్‌ అదరగొట్టడంతో అతనికి మళ్లీ ఓపెనర్‌గా ఎంపికవడం ఖాయంగా కనిపిస్తోంది. మిడిలార్డర్‌ కోసం కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌ మధ్య తీవ్ర పోటీ ఉంది. మయాంక్‌ విఫలమవడంతో రాహుల్‌ ఎంపికయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రిజర్వ్ ఓపెనర్‌గా మయాంక్‌ చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఆసీస్‌ సిరీస్‌లో విఫలమైన పృథ్వీ షాను జట్టు నుంచి తప్పించే అవకాశాలున్నాయి. టెస్ట్ స్పెసలిస్ట్స్ చేటేశ్వర్ పుజారా, అజింక్య రహానేల ఎంపిక కూడా లాంఛనమే కానుంది. భారత్ ఈనెల 27న తొలి రెండు టెస్టులు జరిగే చెన్నైలో బయో బుడగలో ప్రవేశించనుంది.