Odi World Cup 2023: ఇండియా వరల్డ్ కప్ కొట్టడానికి సర్వం సిద్ధం…కానీ టీం కి మైనస్ గా మారనున్న ఆ ఒక్కటి…

ఇండియా ఇప్పటి వరకు ఆడిన మ్యాచుల్లో మన చాలా బాగా ఆడటం మన చాలా మ్యాచుల్లో చూసాం కానీ ఇండియా ఈసారి కప్పు కొట్టగలదా అంటే మాత్రం కొడుతోంది అని చాలా మంది సీనియర్ ప్లేయర్లు కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : October 7, 2023 4:29 pm

Odi World Cup 2023

Follow us on

Odi World Cup 2023: ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ టీం మంచి ఫామ్ లో ఉంది.వరుసగా కప్పులు కొడుతూ ప్రస్తుతం ఏ టీం కి సాధ్యం కానీ రీతిలో అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది. ఇండియా ఈసారి వరల్డ్ కప్ కొట్టగలదా అంటే మాత్రం తప్పకుండ కొడుతోంది అని చాలా మంది చెపుతుంటే, కొందరు మాత్రం ఇండియా టీం లో ఒక మైనస్ పాయింట్ ఉంది దాన్ని కూడా ఫుల్ ఫీల్ చేస్తే బాగుండేది అని మరికొందరు అంటున్నారు. ఇండియన్ టీం లో మైనస్ పాయింట్స్ ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు అదేంటో ఒకసారి మనం కూడా తెలుసుకుందాం…

ఇండియా ఇప్పటి వరకు ఆడిన మ్యాచుల్లో మన చాలా బాగా ఆడటం మన చాలా మ్యాచుల్లో చూసాం కానీ ఇండియా ఈసారి కప్పు కొట్టగలదా అంటే మాత్రం కొడుతోంది అని చాలా మంది సీనియర్ ప్లేయర్లు కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఇండియన్ టీం అయితే చూడటానికి చాలా స్ట్రాంగ్ గా అయితే ఉంది. రోహిత్ శర్మ సారధ్యం లో, రాహుల్ ద్రావిడ్ కోచ్ గా వచ్చిన తర్వాత ఇండియన్ టీం చాలా వరకు బ్యాటింగ్ లోను, బౌలింగ్ లోను కూడా ఇంప్రూవ్ అయి ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా అన్ని ఫార్మాట్లలో ఇప్పుడు నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ మన ఇండియన్ అభిమానుల్లో మరింత ఉత్సాహం రావాలంటే మాత్రం ఈసారి ఇండియా కచ్చితం గా వరల్డ్ కప్ కొట్టి తీరాలి…

అయితే ఇండియన్ టీం కప్పు కొట్టడానికి అన్ని రకాలుగా స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ ఈ టీం లో ఉన్న అతి పెద్ద మైనస్ పాయింట్ ఏంటి అంటే టీం లో ఒక బిగ్ హిట్టర్ లేకపోవడం… ముందుగా హార్దిక్ పాండ్య లాంటి హిట్టర్ ఉన్నప్పటికీ ఆయన మ్యాచ్ ఆడుతాడు కానీ ఆయన స్ట్రాంగ్ హిట్టర్ కాదు.అయితే ప్రతి దేశ క్రికెట్ లో కూడా ఒక బిగ్ హిట్టర్ ఉంటాడు.ఆయన పని ఏంటి అంటే మ్యాచ్ తో సంబంధం లేకుండా చివర్లో సిక్స్ ల వర్షం కురిపించేవాళ్ళు కావాలి.అయితే పాండ్యా ఆల్ రౌండర్ గా టీం లో ఉన్నాడు కాబట్టి ఆయన్ని హిట్టర్ గా వాడుతున్నాం తప్ప డైరెక్ట్ గా దానికోసం ఒక హిట్టర్ లేడు.ఇండియన్ టీం కి ఇంతకు ముందు ధోని హిట్టర్ గా ఉండేవాడు. అలాగే ఆయన మంచి ఫినిషర్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు.కానీ ధోని ప్లేస్ ని సరిగ్గా రీప్లేస్ చేసే ప్లేయర్ ఇంకా ఇండియా టీం కి దొరకడం లేదు ధోని రిటైర్ అయి సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఆయన ప్లేస్ ని రీప్లేస్ చేసే ఒక హార్డ్ హిట్టర్ టీం లో లేడు ఈ ఒక్కటి మినహా ఇస్తే మిగితా టీం అంత కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది…

ధోని ని రీప్లేస్ చేసే ప్లేయర్ దొరికినప్పుడే టీం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అంటే ఒక 10 సంవత్సరాల వరకు కూడా మన ఇండియా టీమ్ నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది.అయితే పాండ్య ఫినిషర్ రోల్ ప్లే చేసిన కూడా ఆయన ఫినిషర్ కాదు ఎందుకంటే ఆయన ఒక ఆల్ రౌండర్ కాబట్టి ఆయన చాలా రకాలైన ఒత్తిడిలు ఎదురుకోవాల్సి ఉంటుంది. ఇక ఇలాంటి టైంలో ఈయన ఫినిషర్ రోల్ కి ఎంత వరకు న్యాయం చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది…అయితే ఈ వరల్డ్ కప్ లో ఫినిషర్ గా రింకు సింగ్ ని సెలెక్ట్ చేస్తే బాగుండేది అని పలువురు క్రికెట్ అభిమానులు సైతం వాళ్ల అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు…అయితే ఇండియన్ టీం లో ఈ ఒక్క ప్రాబ్లమ్ తప్ప మిగితా బ్యాటింగ్ లో కానీ, బౌలింగ్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అనే విషయం అయితే మనకు తెలుస్తుంది.ఇక ప్రస్తుతం ఇండియన్ టీం లో ఆడే ప్లేయర్ల ప్లేస్ లు కూడా కరెక్ట్ గా సరిపోయింది. ముఖ్యంగా 4,5 ప్లేస్ లో ఆడటానికి శ్రేయాస్ అయ్యర్,కె ఎల్ రాహుల్ లాంటి ప్లేయర్లు ఉండటం నిజంగా మన టీం కి చాలా ప్లస్ పాయింట్స్ అనే చెప్పాలి…