Navdeep: డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ కు షాకిచ్చిన ఈడీ

ప్రతి విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ అయిన సీవీ ఆనంద్ గారు సీరియస్ గా తీసుకున్నట్టు గా తెలుస్తుంది.ఇక ఈ కేస్ మీద పలువురు రాజకీయ నాయకులు ఒత్తిడి చేసిన కూడా సిపి ఆనంద్ గారు అవేమీ పట్టించుకోకుండా తన డ్యూటీ ని తను సక్రమం గా నిర్వర్తిస్తూ ముందుకెళ్తున్నాడు.

Written By: Gopi, Updated On : October 7, 2023 4:07 pm

Navdeep

Follow us on

Navdeep: సినిమా ఇండస్ట్రీ లో డ్రగ్స్ కి సంభందించిన కేసులు విపరీతం గా పెరిగిపోతున్నాయి. నిజానికి హైద్రాబాద్ అడ్డ గా డ్రగ్స్ అనేది విపరీతంగా వివిధ రాష్ట్రాలకి కూడా సప్లై అవుతున్నట్టు గా తెలుస్తుంది.ఇక ఇటీవల మాదాపూర్ డ్రగ్స్ కేస్ లో కూడా చాలా మంది రాజకీయ సినీ ప్రముఖులు ఉన్నట్టు గా పోలీసుల విచారణ లో తేలింది.ఇక ప్రస్తుతం తెలుగు సినిమా నటుడు హీరో అయిన నవదీప్ కి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ ఈడి నోటీసులు జారీచేసింది…ఇక అందులో భాగంగానే ఆయన్ని ఈ నెల 10 వ తేదీన ఈడి ముందు హజర్ కావాలని చెప్పినట్టు గా తెలుస్తుంది…

ఎందుకంటే మాదాపూర్ డ్రగ్స్ కేస్ లో ఉన్న చాలా మందిలో సినీ డైరెక్టర్లను, పొలిటీషియన్ కొడుకులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఈ కేసుకు సంభందించిన ప్రతి విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ అయిన సీవీ ఆనంద్ గారు సీరియస్ గా తీసుకున్నట్టు గా తెలుస్తుంది.ఇక ఈ కేస్ మీద పలువురు రాజకీయ నాయకులు ఒత్తిడి చేసిన కూడా సిపి ఆనంద్ గారు అవేమీ పట్టించుకోకుండా తన డ్యూటీ ని తను సక్రమం గా నిర్వర్తిస్తూ ముందుకెళ్తున్నాడు. ఆయన ఈ విషయం మీద మీడియాతో మాట్లాడుతూ.. ఇక ఇంతకు ముందే ఈ కేస్ విషయం లో నవదీప్ పరారీ లో ఉన్నట్టు గా ఆయన చెప్పాడు. అయిన కూడా అప్పుడు నవదీప్ ఒక న్యూస్ ఛానెల్ కి కాల్ చేసి అలాంటిది ఏమి లేదు నేను పరారీ లో లేను నాకు ఎలాంటి నోటీస్ రాలేదు నేను ప్రస్తుతం ఒక సినిమా కి సంభాదించిన వర్క్ లో ఉన్నాను అని చెప్పడం జరిగింది..

అయితే హైదరాబాద్ పోలీసులు మాత్రం ఆయన ఫ్రెండ్ అయిన రామ్ చందర్ ని కస్టడీ లోకి తీసుకొని విచారించగా ఆయన కొన్ని నిజలుంచెప్పినట్టు గా కూడా తెలుస్తుంది.ఇక నవదీప్ కి డ్రగ్స్ అమ్మినట్లు గా వాళ్ల దగ్గర ఆధారాలు కూడా ఉన్నట్టు గా పోలీసులు చెప్తున్నారు…ఇక ఈ విషయం మీద నవదీప్ ఇంతకు ముందే కోర్టును కూడా ఆశ్రయించాడు. దాంతో కోర్ట్ లో ఈ డ్రగ్స్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు అని నవదీప్ చెప్పడం జరిగింది.ఇక పోలీసుల వాదనలు కూడా విన్న కోర్ట్ సిఆర్పిసి 41 సెక్షన్ ఏ కింద పోలీసుల విచారణ చేపట్టాలని కోర్ట్ ఆదేశించింది. ఇక దీంతో పోలీసుల విచారణకు కూడా నవదీప్ హజరవ్వడం వాళ్లు అడిగిన విషయాలకి సమాధానాలు చెప్పడం లాంటివి చేశాడు. ఇక ఇది ఇలా ఉంటే 2017 లో కూడా ఈడి విచారణకు హాజరయ్యాడు నవదీప్….

ఇక ఇప్పుడు మళ్లీ ఈనెల 10 వ తేదీన నవదీప్ ఈడి అధికారుల విచారణ కి హజరవ్వాల్సి ఉంటుంది…
ఇక ఈ క్రమంలోనే ఆ మధ్య బేబీ సినిమా టీమ్ కి కూడా సిపి ఆనంద్ గారు నోటీసులు పంపించడం జరిగింది ఎందుకంటే ఈ సినిమాలో డిస్ క్లైమర్స్ ఏం లేకుండా డ్రగ్స్ తీసుకున్నట్టు గా చూపించడం తో దాని వల్ల యువత చెడు దారిలో పోయే ప్రమాదం ఉంది అనే నేపథ్యం లో ఇంకోసారి ఇలాంటివి చేయకుండా ఉండటం కోసం వాళ్ళని కూడా ఒకసారి విచారణ కి పిలుస్తాం అని సిపి ఆనంద్ గారు తెలియ జేయడం జరిగింది…