Nara Lokesh: ప్రతి ఇంటికి వెళ్ళి చంద్రబాబు చేస్తున్న అన్యాయంపై వివరిస్తాడంట.. మళ్లీ బుక్కైన లోకేష్

చంద్రబాబు అక్రమ అరెస్టు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తోంది. అందులో భాగంగా " బాబుతో నేను" అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Written By: Dharma, Updated On : October 7, 2023 4:35 pm

Nara Lokesh

Follow us on

Nara Lokesh: అసలే తెలుగుదేశం పార్టీ పుట్టెడు కష్టాల్లో ఉంది. ఈ సమయం ఎంతో జాగ్రత్తగా అడుగులు వేయాలి. కానీ టిడిపి యువ నాయకుడు నారా లోకేష్ బ్లండర్ మిస్టేక్ చేశారు. తనకు అలవాటైన తత్తరపాటును మరోసారి ప్రదర్శించారు. రాజకీయ ప్రత్యర్థులకు, నెటిజన్లకు టార్గెట్ అయ్యారు. లోకేష్ నోటి నుంచి వచ్చే ఆణిముత్యాలకు కొదువే లేదు. ఇటీవల ఆయన కొంత కుదురుకున్నారు. బాగానే మాట్లాడుతున్నారు. యువగళం పాదయాత్రతో భాష పై మంచి పట్టే సాధించారు. కానీ మాట్లాడే క్రమంలో ఆయన నోటి నుంచి వచ్చే ఆణిముత్యాలు తప్పులుగా దొర్లుతున్నాయి.

చంద్రబాబు అరెస్టు తర్వాత లోకేష్ ఢిల్లీ వెళ్లారు. అక్కడే ఉండిపోయారు. తన ముందస్తు బెయిల్ విషయంలో కొద్దిరోజులపాటు ఉపశమనం కలగడంతో ఢిల్లీ నుంచి రాజమండ్రి కి వచ్చారు. తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి తో కలిసి తండ్రి చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీ సీఎం జగన్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అక్రమ అరెస్టులతో పైశాచిక ఆనందాన్ని పొందుతున్న జగన్కు ఝలక్ తప్పదని హెచ్చరించారు. ఈ క్రమంలో పదునైన విమర్శనాస్త్రాలు సంధించారు.

చంద్రబాబు అక్రమ అరెస్టు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తోంది. అందులో భాగంగా ” బాబుతో నేను” అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి ఇంటికి టిడిపి శ్రేణులు టచ్ చేసి చంద్రబాబుకు జరిగిన అన్యాయంపై వివరించాలన్నది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కానీ లోకేష్ కార్యక్రమం గురించి ఇలా వ్యాఖ్యానించారు. “ప్రతి ఇంటికి టిడిపి శ్రేణులు టచ్ చేయండి.చంద్రబాబు చేసిన అన్యాయాన్ని వివరించండి. వారి సానుభూతిని పొందండి ” అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఇలా ప్రకటన చేసే సమయంలో పక్కనే తల్లి, భార్య ఉన్నారు. వారితో పాటు కొంతమంది టీడీపీ నాయకులు సైతం అక్కడే ఉన్నారు. దీంతో వారు లోకేష్ మాటలు విని ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.

నారా లోకేష్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. మంత్రి రోజా అయితే ఈ వీడియోని జత చేస్తూ ట్విట్ చేశారు. నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ” మీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డంగా దోచేశారు. ఆయన ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయంపై మీరు మాట్లాడడం అభినందనీయం. ఇప్పటికే చంద్రబాబు అక్రమాలపై వైసీపీ పోరాడుతోంది. ఇప్పుడు ఇంటింటికి వెళ్లి చంద్రబాబు అన్యాయం పై పోరాటం చేయాలని టిడిపి శ్రేణులకు పిలుపునివ్వడం బాగుంది”అంటూ రోజా ట్విట్ చేశారు. అయితే ఇటువంటి క్లిష్ట సమయంలో లోకేష్ ఇలా వ్యాఖ్యానించడం పై టిడిపి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అనవసరంగా ఏదేదో మాట్లాడి లోకేష్ వివాదాలకు కొనితెచ్చుకుంటున్నారని అభిప్రాయపడుతున్నాయి.