IND vs BAN : 50 నిమిషాల్లో 4 వికెట్లు.. తొలి టెస్టులో తేలిపోయిన బంగ్లా పులులు.. టీమిండియా ఘనవిజయం

IND vs BAN : తొలి టెస్ట్ మ్యాచ్ గెలిచేందుకు బంగ్లాదేశ్ కు 241 పరుగులు కావాలి.. భారత్ కు నాలుగు వికెట్లు కావాలి. ఈరోజు రెండోదే జరిగింది. భారత్ తొలి టెస్టులో విజయం సాధించింది. నాలుగో రోజు భారత్ బౌలర్లను ప్రతిఘటించిన బంగ్లాదేశ్ జట్టు చివరి రోజు.. ఆట ప్రారంభమైన 52 నిమిషాల్లోనే మిగతా నాలుగు వికెట్లు కోల్పోయి ఓడిపోయింది. 272 తో ప్రారంభించి.. ఓవర్ నైట్ స్కోర్ ఆరు వికెట్ల నష్టానికి 272 పరుగులతో ఇన్నింగ్స్ […]

Written By: Bhaskar, Updated On : December 18, 2022 11:57 am
Follow us on

IND vs BAN : తొలి టెస్ట్ మ్యాచ్ గెలిచేందుకు బంగ్లాదేశ్ కు 241 పరుగులు కావాలి.. భారత్ కు నాలుగు వికెట్లు కావాలి. ఈరోజు రెండోదే జరిగింది. భారత్ తొలి టెస్టులో విజయం సాధించింది. నాలుగో రోజు భారత్ బౌలర్లను ప్రతిఘటించిన బంగ్లాదేశ్ జట్టు చివరి రోజు.. ఆట ప్రారంభమైన 52 నిమిషాల్లోనే మిగతా నాలుగు వికెట్లు కోల్పోయి ఓడిపోయింది.

272 తో ప్రారంభించి..

ఓవర్ నైట్ స్కోర్ ఆరు వికెట్ల నష్టానికి 272 పరుగులతో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టు 324 పరుగులు చేసి ఆలౌట్ అయింది.. దీంతో భారత్ 188 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి రోజు బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టుకు మూడో ఓవర్ లోనే హైదరాబాద్ బౌలర్ సిరాజ్ షాక్ ఇచ్చాడు.. మొహిదీ హసన్ (13) ను బోల్తా కొట్టించాడు. మరోవైపు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో అతడు అర్థ శతకం పూర్తి చేశాడు. కానీ కులదీప్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికి 111 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. భారత్ విజయానికి మరో రెండు వికెట్లు అవసరం.. బంగ్లాదేశ్ కు 193 పరుగులు అవసరం.

రెండు వికెట్లు వెంటవెంటనే..

ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన హోసేయిన్,తాజుల్ ఇస్లాం ను అక్షర్, కుల దీప్ వెంట వెంటనే అవుట్ చేయడంతో భారత్ సునాయాసంగా విజయం సాధించింది. కుల దీప్ యాదవ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. రెండు టెస్టుల సిరీస్ లో భారత్ 1_0 లో ముందంజ లో ఉంది. అంతకుముందు ఆడిన మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 404 పరుగులకు ఆల్ అవుట్ అయింది.. బంగ్లాదేశ్ 150 పరుగులకు కుప్పకూలింది.. రెండో ఇన్నింగ్స్ లో భారత్ రెండు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో 324 పరుగులకు ఆల్ అవుట్ అయింది.

అద్భుతం జరుగుతుంది అనుకున్నారు

నాలుగు రోజు రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టు మొదటి వికెట్ కు వందకు పైచిలుకు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఈ భాగస్వామ్యాన్ని ఉమేష్ యాదవ్ విడదీశాడు. అయితే ఒకానొక దశలో బంగ్లాదేశ్ మ్యాచ్ ను డ్రా చేస్తుంది అందరూ అనుకున్నారు. కానీ భారత బౌలర్లు విజృంభించి బౌలింగ్ చేయడంతో బంగ్లా పప్పులు ఉడకలేదు. నాలుగో రోజు ఇన్నింగ్స్ ముగిసే సరికి ఆరు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్.. చివరి రోజు నాలుగు వికెట్లను వెంటవెంటనే కోల్పోవడం గమనార్హం.