India Team: 31 ఏళ్ల తర్వాత ఆ రికార్డులను బ్రేక్ చేసిన ఇండియన్ టీమ్…

ఒక క్యాలెండర్ ఇయర్ లో ఇండియన్ టీం సాధించిన అత్యధిక వన్డే విజయాలను గనక చుసుకున్నటైతే ఈ ఇయర్లో ఇండియా 24 విజయాలను అందుకొని అత్యధిక మ్యాచుల్లో విజయాలను సాధించడం జరిగింది.

Written By: Gopi, Updated On : November 13, 2023 3:45 pm
Follow us on

India Team: వరల్డ్ కప్ లో భాగంగా నిన్న ఇండియా నెదర్లాండ్స్ మధ్య జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో ఇండియా అద్భుతమైన పర్ఫామెన్స్ ను ఇచ్చింది. ఇక అందులో భాగంగానే ఇండియన్ టీమ్ మొదటి బ్యాటింగ్ చేసి 410 పరుగులు చేసింది. దాంతో ఇండియన్ ప్లేయర్లు అద్బుతం గా ఆడి ఇండియా టీమ్ కి మరో అద్భుతమైన విజయాన్ని అందించడంలో కీలక పాత్ర వహించారు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియన్ టీమ్ వరుసగా తొమ్మిది విజయాలను అందుకుని ఈ టోర్నీలోనే ఒక అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. ఈ మ్యాచ్ లో లో ఉన్న 11 మంది ప్లేయర్లలో తొమ్మిది మంది బౌలింగ్ చేసి ఒక రికార్డుని సృష్టించారు. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, రోహిత్ శర్మ ముగ్గురు కూడా అద్బుతం గా బౌలింగ్ చేసి ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశారు. ముఖ్యంగా రోహిత్ శర్మ ,కోహ్లీ అయితే వాల బౌలింగ్ లో చేరో వికెట్ తీసి మన బౌలర్లకు పోటీని ఇచ్చారు.

ఇక ఇది ఇలా ఉంటే ప్రపంచంలోనే ఒక మ్యాచ్ లో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక మంది బౌలర్లను వాడుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇక ఇలాంటి ప్రక్రియనే నెదర్లాండ్స్ మీద జరిగిన మ్యాచ్ లో ఇండియన్ టీమ్ లో మనకు కనిపించడం జరిగింది.ఇక నిన్నటి మ్యాచ్లో ఇండియా తరఫున 9 మంది బౌలింగ్ చేయడం అనేది 31 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయింది.ఇక ఇంతకు ముందు న్యూజిలాండ్‌ టీమ్ 1992లో ఒక్క మ్యాచ్ లో ఇలా 9 మంది బౌలర్లను వాడుకోవడం జరిగింది.ఇక అంతకుముందు ఇంగ్లాండ్‌ 1987 ప్రపంచకప్‌లో 9 మందితో బౌలర్లతో బౌలింగ్ చేయించింది.ఇక ఈ టీముల తర్వాత ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ ఇండియన్ టీమ్ ఇప్పుడు ఆ ఫీట్ ని రిపీట్ చేసింది… ప్రస్తుతం ఇండియన్ టీం అద్భుతమైన ఫామ్ లో ఉంది కాబట్టి వరుసగాని రికార్డులను బ్రేక్ చేసుకుంటూ వస్తుంది. ఇక అందులో భాగంగానే ఈ రికార్డు కూడా క్రియేట్ చేయడం జరిగింది.

ఇక ఇవే కాకుండా ఇండియన్ టీం ఈ మ్యాచ్ లో మరికొన్ని రికార్డులను కూడా బ్రేక్ చేసింది.అలాగే ఒక క్యాలెండర్ ఇయర్ లో ఇండియన్ టీం సాధించిన రికార్డులు ఏంటో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ఒక క్యాలెండర్ ఇయర్ లో ఇండియన్ టీం సాధించిన అత్యధిక వన్డే విజయాలను గనక చుసుకున్నటైతే ఈ ఇయర్లో ఇండియా 24 విజయాలను అందుకొని అత్యధిక మ్యాచుల్లో విజయాలను సాధించడం జరిగింది. ఇక ఇంతకుముందు 1998 వ సంవత్సరంలో 24 విజయాలను సాధించింది.ఇక 2013 వ సంవత్సరం లో 22 వికెట్లను దక్కించుకుంది. ఇలా ఇండియన్ టీం ఈ వరల్డ్ కప్ లో చాలా రికార్డులను బ్రేక్ చేస్తూ వస్తుంది. ఇక వరల్డ్ కప్ లో సెమీఫైనల్ లో, ఫైనల్లో గనక గెలిచినట్లయితే ఇండియా 26 విజయాలను సాధించడమే కాకుండా ఒక ఇయర్లో 26 విజయాలను అందుకొని, ఒక ఇయర్లో అత్యధిక విజయాలు అందుకున్న టీమ్ గా ఒక రికార్డ్ ని కూడా క్రియేట్ చేస్తుంది…

ఇక ఇది ఇలా ఉంటే ప్రపంచంలో టాప్ టీమ్ గా కొనసాగిన ఆస్ట్రేలియా టీం ఒక వరల్డ్ కప్ టోర్నీలో అత్యధిక విజయాలను సాధించిన టీమ్ గా ఇప్పటివరకు రికార్డును సాధించింది ఇక అందులో భాగంగానే 2003, 2007లో వరుసగా 11 విజయాలు నమోదు చేసింది. ఇక ఇప్పటికి కూడా ఆ టీం పేరు మీదనే ఈ రికార్డు ఉండడం అనేది విశేషం… ఇక ఈ టీం తర్వాత సెకండ్ ప్లేస్ లో ఇండియన్ టీం కొనసాగుతుంది. ఇప్పటివరకు తొమ్మిది వరస విజయాలను అందుకున్న ఇండియన్ టీమ్ సెకండ్ పొజిషన్ లో నిలిచింది. ఈ మెగాటోర్నీలో ఇండియా ఇప్పటి వరకు 9 విజయాలను నమోదు చేసింది.

ఇప్పటి వరకు ఇండియన్ టీమ్ తరుపున వరల్డ్ కప్ లో ఒక స్పిన్ బౌలర్ తీసిన అత్యధిక వికెట్లు 15… అది కూడా అనిల్ కుంబ్లే పేరు మీద ఈ రికార్డ్ నమోదై ఉంది ఇక దీన్ని ప్రస్తుతం రవీంద్ర జడేజా బ్రేక్ చేశాడు ఇక ఈ టోర్నీలో రవీంద్ర జడేజా ఇప్పటి వరకూ మొత్తం 16 వికెట్లు తీశాడు. ఇక ఇప్పటి వరకు కుంబ్లే పేరు మీద ఉన్న రికార్డ్ జడేజా పేరు మీదకి వచ్చేసింది…

ఒక ఇయర్ లో వన్డేల్లో ఇండియన్ టీమ్ అత్యధిక సిక్స్ లు కొట్టిన టీమ్ గా అవతరించింది.ఇక ఇప్పటి వరకు వన్డేల్లో ఒకే సంవత్సరం లో 215 సిక్స్ లు కొట్టి ప్రథమ స్థానం లో నిలిచింది…

ఇక ప్రపంచ కప్ హిస్టరీ లో ఇప్పటి వరకు ఎవరికి సాధ్యం కానీ విధం గా ఇండియన్ టీమ్ తరుపున 62 బంతుల్లో సెంచరీ చేసి వన్డే వరల్డ్ కప్ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్ గా కే ఎల్ రాహుల్ నిలవడం హర్షించదగ్గ విషయం…