IND vs AUS : తొలి మ్యాచ్ మనదే: ఐదు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం

IND vs AUS : ఆస్ట్రేలియాతో జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో భాగంగా.. శుక్రవారం ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగిన తొలి వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆరో వికెట్ కు కేఎల్ రాహుల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 108 పరుగులు సాధించడంతో ఇండియా ఘనవిజయం సాధించింది. జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు కేఎల్ రాహుల్ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడి(91 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ తో 75 […]

Written By: Bhaskar, Updated On : March 17, 2023 9:02 pm
Follow us on

IND vs AUS : ఆస్ట్రేలియాతో జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో భాగంగా.. శుక్రవారం ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగిన తొలి వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆరో వికెట్ కు కేఎల్ రాహుల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 108 పరుగులు సాధించడంతో ఇండియా ఘనవిజయం సాధించింది. జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు కేఎల్ రాహుల్ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడి(91 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ తో 75 పరుగులు) విజయాన్ని అందించాడు.

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ భారీ స్కోర్ సాధించడం ఖాయం అనిపించింది. హార్దిక్ కూడా అదే అనుకున్నాడు. పైగా ఈ మైదానం లో చివరి వన్డే ఆడిన ఆసీస్.. వార్నర్, ఫించ్ శతకాలు బాదటంతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఎలా చూసుకున్నా ఆసీస్ కే కొంత మొగ్గు కనిపించింది మరో వైపు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. వాంఖడే స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది. దీంతో భారీ స్కోర్ చేయాలని ఆసీస్ అనుకున్నది..కానీ తొలి అడిగే తడబడింది..1.6 ఓవర్ లో హెడ్ రూపంలో వికెట్ కోల్పోయింది.. సిరాజ్ వేసిన అద్భుతమైన బంతిని తప్పుగా అంచనా వేసిన హెడ్ క్లీన్ బౌల్ద్ అయాడు.ఈ దశలో వన్ డౌన్ బ్యాట్స్ మెన్ గా స్మిత్ వచ్చాడు..మరో ఓపెనర్ మార్ష్ తో కలిసి ఇన్నింగ్స్ చక్క దిద్దే ప్రయత్నం చేశాడు.ఈ జోడీ భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని పాండ్యా విడదీశాడు. పాండ్యా వేసిన బంతి స్మిత్ బ్యాట్ చివరి అంచుకు తాకింది. దానిని కే ఎల్ రాహుల్ అమాంతం ఒడిసి పట్టాడు. ఈ క్యాచ్ చూసి స్మిత్ ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యాడు.నిరాశగా మైదానం వీడాడు. హెడ్,స్మిత్ జోడి రెండో వికెట్ కు 72 పరుగులు జోడించారు.

తర్వాత వచ్చిన లాబుస్చాగ్నే(15) ను కుల దీప్ యాదవ్, జోష్ ఇంగ్లీష్ ను షమీ ఔట్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ అంత జోరుగా సాగలేదు. మరో ఎండ్ లో ఉన్న మార్ష్ మాత్రం ధాటిగా బ్యాటింగ్ చేశాడు. అప్పటికి ఆసీస్ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన కామెరున్ గ్రీన్ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. 12 పరుగులు చేసిన అతడు షమి బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోర్ ఆరు వికెట్ల నష్టానికి 174.

11 పరుగుల వ్యవధి లో నాలుగు వికెట్లు.. ఆదుకున్న కేఎల్ రాహుల్

ఆరు వికెట్లు కోల్పోయినప్పటికీ క్రీ జు లో మాక్స్ వెల్ ఉండడంతో భారీ స్కోరు సాధ్యమవుతుందని ఆస్ట్రేలియా నమ్మకం పెట్టుకుంది. అయితే మ్యాక్స్ వెల్ ను రవీంద్ర జడేజా అద్భుతమైన బంతికి బోల్తా కొట్టించాడు. మార్కస్ స్టోయినిస్, అబాట్, ఆడం జంపా…ఇలా వచ్చిన బ్యాట్స్ మెన్ వచ్చినట్టు వెనుదిరగడంతో ఆసీస్ 35.4 ఓవర్లలో 188 పరుగులకు ఆల్ అవుట్ అయింది. చివరి 11 పరుగుల వ్యవధిలో ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోవడం విశేషం.

ఇక ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేశారు..ఒక్క రెండో వికెట్ మినహా మిగతా వికెట్లు సులభంగానే తీశారు. ఏ వికెట్ కూడా భారీ భాగస్వామ్యం నెలకొల్పకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు..షమీ, సిరాజ్ మూడు,జడేజా రెండు, పాండ్యా, కులదీప్ చేరో వికెట్ తీశారు.

తర్వాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా తడబాటుకు గురైంది. మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో సూర్య(0), కోహ్లీ(4), గిల్(20) ఔట్ అయ్యారు. స్టోయినీస్ బౌలింగ్ లో కిషన్(3) ఔట్ కావడంతో భారత్ కష్టాల్లో పడింది. ఓపెనర్ గా వచ్చిన ఈశాన్ కిషన్, రెండో డౌన్ బ్యాట్స్మెన్ గా వచ్చిన సూర్య కుమార్ యాదవ్ దారుణంగా విఫలమయ్యారు. సూర్య కుమార్ యాదవ్ టి20 లో నెంబర్ వన్ బ్యాట్స్మెన్. కానీ వన్డేలకు వచ్చేసరికి అతను దారుణంగా విఫలమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే లోనూ అతను ఏమాత్రం రాణించలేకపోయాడు. ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డక్ గా వెను తిరిగాడు. శ్రేయాస్ అయ్యర్ జట్టుకు దూరమైన నేపథ్యంలో తుది జట్టులో చోటు సంపాదించుకున్న సూర్య.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో లెగ్ బిఫోర్ వికెట్ గా సూర్య కుమార్ యాదవ్ వెనుతిరిగాడు.

ఇక మరో ఆటగాడు ఇషాన్ కిషన్ కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. తన బావమరిది పెళ్లి కోసం రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. అతని స్థానంలో జట్టు మేనేజ్మెంట్ ఇశాన్ కిషన్ కు అవకాశం ఇచ్చింది. కానీ అతడు దానిని వినియోగించుకోలేకపోయాడు. మార్కస్ స్టోయినీస్ బౌలింగ్లో అతడు లెగ్ బిఫోర్ వికెట్ గా వెనుతిరిగాడు. వాస్తవానికి బంగ్లాదేశ్ మీద డబుల్ సెంచరీ సాధించిన అనంతరం.. ఇప్పటివరకు చెప్పుకోదగిన ఇన్నింగ్స్ కిషన్ ఆడలేదు..

కిషన్ అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లీ కూడా నిరాశపరిచాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ లెగ్ బీఫోర్ వికెట్ గా వెనుదిరిగాడు. ఇలా 16 పరుగులకే భారత్ కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది.. ఇక క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ గిల్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ గిల్ కూడా అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన పాండ్యా మెరుపులు మెరిపించాడు. అతడు (25) పరుగుల వద్ద ఉన్నప్పుడు దాటిగా ఆడే క్రమంలో స్టోయినిస్ బౌలింగ్లో గ్రీన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

ఆ తర్వాత రవీంద్ర జడేజా బ్యాటింగ్ కు వచ్చాడు. ఇతడి కలిసి రాహుల్ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 108 పరుగులు జోడించారు. వీరిద్దరినీ విడదీసేందుకు ఆస్ట్రేలియా కెప్టెన్‌ బౌలర్లను మార్చి మార్చి బౌలింగ్‌ చేయించినా ప్రయోజనం లేకుండా పోయింది. స్టార్క్‌, స్టోయినీస్‌, జంపా, మ్యాక్స్‌ వెల్‌ ఇలా ఎంతమంద బౌలింగ్‌ వేసినా ఈ జోడిని విడదీయలేకపోయారు. ముఖ్యంగా రాహుల్‌ చాలా రోజుల తర్వాత మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. గతకొంత కాలం ఫామ్‌ లేమితో ఇబ్బందిడపతున్న అతడు ఆసీస్‌ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. షార్ట్‌ పిచ్‌ బంతులను డిఫెన్స్‌ ఆడిన అతడు, చెత్త బంతులను నిర్దాక్షిణ్యంగా బౌండరీ వైపు తరలించాడు. ఈ దశలోనే అతడు తన హాప్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో భారత్ సిరీస్ లో ఆధిక్యంలో నిలిచింది.