Duleep Trophy 2024 : మొదటి రౌండ్ లో ఇండియా – బీ జట్టు చేతిలో ఇండియా – ఏ టీం ఓటమిపాలైంది.. అనూహ్యంగా రెండవ రౌండ్ లో బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా ఆడింది. ఈ టోర్నీలో ఇండియా – డీ జట్టు వరుసగా రెండు ఓటములను మూటకట్టుకుంది. తొలి రౌండ్ లో ఇండియా – సీ జట్టు చేతిలో ఇండియా – డీ జట్టు ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఇండియా – ఏ జట్టుకు మయాంక్ అగర్వాల్ సారధ్యం వహిస్తున్నాడు. ఇండియా – డీ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా ఉన్నాడు. 488 పరుగుల భారీ విజయ లక్ష్యంతో ఓవర్ నైట్ స్కోర్ 62/1 తో ఇండియా – డీ జట్టు ఆఖరి రోజు అయిన ఆదివారం ఆటను ప్రారంభించింది. 301 పరుగులకు ఆల్ అవుట్ అయింది. తెలుగు కుర్రాడు రికీ భుయ్ (113: 195 బంతుల్లో 14 ఫోర్లు, మూడు సిక్సర్లు) పోరాడినప్పటికీ ఉపయోగలేకుండా పోయింది. ఆదివారం ఆట మొదలైన కాసేపటికే యశ్ దూబే(34), దేవ దత్ పడిక్కల్(1) స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరుకున్నారు. అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (41), సంజు శాంసన్(40) పర్వాలేదనిపించారు.. కానీ ఈ దశలో ఇండియా – ఏ జట్టు బౌలర్లు సత్తా చాటారు. కీలక సమయాలలో వికెట్లు సాధించారు. అయ్యర్ తో కలిసి రికీ నాలుగో వికెట్ కు 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సంజు తో కలిసి ఐదో వికెట్ కు 62 పరుగుల పార్ట్నర్ షిప్ నెలకొల్పారు. అయితే వికెట్లు కోల్పోతున్నప్పటికీ రికీ భుయ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇదే క్రమంలో సెంచరీ సాధించాడు. కానీ కొంతసేపటికి అతడు అవుట్ అయ్యాడు. దీంతో ఇండియా – డీ జట్టు ఓటమి అంచున నిలిచింది. అయితే చివర్లో బౌలర్ హర్షిత్ రాణా(24) మెరుపులు మెరిపించాడు. తనుష్ కొటియన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.. షామ్స్ ములానీ మూడు వికెట్లు సొంతం చేసుకున్నాడు.
తొలి ఇన్నింగ్స్ లో..
ఇండియా- ఏ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 290 పరుగులు చేసింది. షామ్స్ మూలానీ (89) టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలింగ్ లో హర్షిత్ రాణా 4/51 ప్రదర్శన చేశాడు. ఇండియా – డీ జట్టు ఇన్నింగ్స్ లో 153 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దేవదత్ 92 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలింగ్లో ఖలీల్ అహ్మద్ 3/39 ప్రదర్శన కొనసాగించాడు. ఇక ఇండియా – ఏ జట్టు రెండవ ఇన్నింగ్స్ లో 380/3 పరుగులు (ఇన్నింగ్స్ డిక్లేర్) చేసింది. ప్రథమ్ సింగ్ 122, తిలక్ వర్మ 111* అదరగొట్టారు.. బౌలింగ్ లో సౌరభ్ (2/110) వికెట్లు పడగొట్టాడు. ఇండియా – డీ జట్టు రెండో ఇన్నింగ్స్ లో 301 పరుగులకు ఆలౌట్ అయింది. రికీ భుయ్ 113 రన్స్ చేశాడు. బౌలింగ్లో తనుష్ (4/73) వికెట్లతో ఆకట్టుకున్నాడు.
for Ricky Bhui
He gets there in style
A splendid knock so far in the fourth innings #DuleepTrophy | @IDFCFIRSTBank
Follow the match ▶️: https://t.co/m9YW0Hu10f pic.twitter.com/WM6ae4iOcv
— BCCI Domestic (@BCCIdomestic) September 15, 2024
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More