India A Squad: “విరాట్ అద్భుతమైన ఆటగాడు. రోహిత్ సామర్థ్యం ఉన్న ప్లేయర్. వీరిద్దరూ టీమిండియా కు కచ్చితంగా కావాలి. టీమ్ ఇండియాలో ఉండాలి. వారి వల్ల చాలామంది స్ఫూర్తి పొందుతారు. అటువంటివారు టీమిండియాలో ఆడటం అదృష్టం” రోహిత్, విరాట్ కొనసాగింపు పై ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు బీసీసీఐ పెద్దల్లో ఒకరు చెప్పిన సమాధానం అది.
బీసీసీఐ పైకి మాత్రమే అలా సమాధానం చెబుతుందా? లోపల అంతరంగం వేరే ఉందా.. రోహిత్, విరాట్ కు పొమ్మన లేక పొగ పెడుతోందా? ఈ ప్రశ్నకు కొంతమంది విశ్లేషకులు అవును అని సమాధానం చెబుతున్నారు. అంతేకాదు తమదైన శైలిలో విశ్లేషణ కూడా చేస్తున్నారు. ఇటీవల టెస్ట్ ఫార్మాట్ నుంచి రోహిత్ శర్మను మేనేజ్మెంట్ తప్పించింది. దీంతో రోహిత్ శర్మ ఆ ఫార్మాట్ నుంచి పూర్తిగా తట్టుకున్నాడు. రోహిత్ వెలిపోయిన తర్వాత సారధి కావాలని భావించిన విరాట్ కోహ్లీ.. తన ఆసక్తిని మేనేజ్మెంట్ ఎదుట ప్రస్తావిస్తే.. దానికి మేనేజ్మెంట్ ఒప్పుకోలేదు. దీంతో అతడు కూడా టెస్ట్ ఫార్మేట్ నుంచి వెళ్లిపోయాడు. ఇలా ఇద్దరు గొప్ప ప్లేయర్లు రోజుల వ్యవధిలో వెళ్లిపోవడంతో పరిస్థితి మారిపోయింది.
విరాట్, రోహిత్ వెళ్లిపోయిన తర్వాత మేనేజ్మెంట్ వెంటనే గిల్ ను సారధిని చేసింది. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్లో అదరగొట్టాడు. టీం ఇండియా సిరీస్ సొంతం చేసుకోలేకపోయినప్పటికీ.. ఆతిథ్య జట్టుకు మాత్రం ట్రోఫీని ఏకపక్షంగా ఇవ్వలేదు. ఒక రకంగా ఆతిథ్య జట్టుకు అద్భుతమైన పోటీ ఇచ్చింది. తద్వారా సిరీస్ మొత్తాన్ని సమం చేసింది. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సిరీస్లో గిల్ సెంచరీల మోత మోగించాడు. అంతేకాదు నాయకుడిగా విలక్షణమైన నిర్ణయాలు తీసుకొని అదరగొట్టాడు. టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకున్న విరాట్, రోహిత్.. వన్డేలలో మాత్రం కొనసాగుతున్నారు.
ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడుతోంది.. ఇది ముగిసిన తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికా జట్టుతో రెండు టెస్టుల సిరీస్ ఆడుతుంది.. అది పూర్తయిన తర్వాత వన్డే సిరీస్ ఆడుతుంది.. ఈ సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికా ఏ జట్టుతో జరిగే అనధికారిక వన్డే సిరీస్ లో ఆడేందుకు టీమిండియా ఏ జట్టును మేనేజ్మెంట్ ప్రకటించింది.. ఈ జట్టులో సారధిగా తిలక్ వర్మ ఉన్నాడు. రుతు రాజ్ గైక్వాడ్ ఉపసారథిగా ఉంటాడు. ఈ జట్టులో రోహిత్, విరాట్ కు చోటు లభించలేదు. యంగ్ ప్లేయర్లు అభిషేక్ శర్మ, పరాగ్, ఇషాన్ కిషన్, హర్షిత్ రాణా, అర్ష్ దీప్ సింగ్, వంటి ప్లేయర్లకు అవకాశం లభించింది. అయితే విరాట్, రోహిత్ కు భారత ఏ జట్టులో అవకాశం లభించలేదు. అయితే దీనిపై వారిద్దరి అభిమానులు సోషల్ మీడియాలో రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.
లెజెండరీ ప్లేయర్లకు అవకాశం కల్పించకపోవడానికి తప్పుపడుతున్నారు.. మేనేజ్మెంట్ పొమ్మనలేక పొగ పెడుతూ ఉందని ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై కొంతమంది విశ్లేషకులు స్పందించారు. మేనేజ్మెంట్ దృష్టిలో విరాట్, రోహిత్ కు ఎప్పుడు గౌరవం ఉంటుందని.. వారికి జట్టులో చోటు ఉంటుందని.. ప్రస్తుతం రోహిత్ అభిషేక్ నాయర్ ఆధ్వర్యంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడని.. విరాట్ లండన్ లో ఉన్నాడని.. మేనేజ్మెంట్ అందువల్లే వారికి అవకాశం ఇవ్వలేదని తెలుస్తోంది.. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగే వన్డే సిరీస్ లో వారిద్దరు ఆడతారని మేనేజ్మెంట్ స్పష్టం చేసింది.