Devi Sri Prasad Comments About Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. దర్శకులు సైతం గొప్ప కథలను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు…ఇక ఇలాంటి క్రమంలోనే ఒక సినిమా సక్సెస్ లో ఆ మూవీ మ్యూజిక్ అనేది చాలా కీలకపాత్ర వహిస్తూ ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ సైతం తనదైన రీతిలో సత్తా చాటినప్పుడే సినిమా మ్యూజిక్ లో వైవిధ్యం కనిపిస్తోంది. దాని వల్ల ప్రేక్షకులందరు ఆ సినిమాని చూడడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే దేవిశ్రీప్రసాద్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి సినిమాలకు మ్యూజిక్ ని అందించి తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్ తను చేస్తున్న సినిమాలన్నింటి విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నప్పటికి తనదైన రీతిలో సత్తా చాటాల్సిన సమయమైతే ఆసన్నమైంది.
రీసెంట్ గా ఆయన జగపతి బాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షో కి గెస్ట్ గా వచ్చాడు. అక్కడ ఆయన మ్యూజిక్ కాంపోజిషన్ కి సంబంధించిన మధురమైన అనుభూతులను సైతం ఆయన పంచుకున్నాడు. ముఖ్యంగా అత్తారింటికి దారేది సినిమాలోని ‘నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే’ అనే సాంగ్ సిచువేషన్ ని వివరిస్తూ చాలా బాగా ఆ సాంగ్ ని కంపోజ్ చేసినట్టుగా తెలియజేశాడు…
ఇక అనుకోకుండా ఆ ట్యూన్ రావడం ఆ లిరిక్స్ ని కూడా దేవిశ్రీప్రసాద్ ఫిల్ చేయడంతో త్రివిక్రమ్ కి ఆ సాంగ్ ను వినిపించాడట. దానికి త్రివిక్రమ్ తగ్గట్టుగా సిచువేషన్ ని క్రియేట్ చేసుకొని మరి ఆ సాంగ్ ని సినిమాలో పెట్టుకున్నాడు. ఇక ఆ సాంగ్ రికార్డింగ్ లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కి వినిపించారట. పవన్ కళ్యాణ్ సైతం సాంగ్ ను విని తను వేసుకున్న కోట్ తీసేసి ఆ చైర్ మీద పెట్టి చిన్న పిల్లడిలా మారిపోయి ఎంజాయ్ చేస్తూ సాంగ్ అద్భుతంగా ఉంది దేవి అంటూ అతన్ని మెచ్చుకున్నాడట. మొత్తానికైతే అదొక ఫన్నీ ఇన్సిడెంట్ అంటూ దేవిశ్రీప్రసాద్ చెప్పిన ఈ విషయం ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమానిని ఆకట్టుకుంటుంది.
ప్రస్తుతం దేవిశ్రీప్రసాద్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే…ఈ మూవీ కూడా మ్యూజికల్ గా సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తుందని ఆయన చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నాడు…