Ind W Vs Pak W T20 World Cup: రికార్డుల పరంగా చూసుకుంటే పాకిస్తాన్ జట్టుపై భారత్ పై చేయి లాగా కనిపిస్తోంది. టి20 ఫార్మాట్ ఒకసారి పరిశీలిస్తే.. రెండు జట్లు 15 సార్లు పోటీపడ్డాయి. ఇందులో భారత్ 12 సార్లు గెలిచింది. మూడుసార్లు మాత్రమే ఓటమిపాలైంది. ఇక టీ -20 వరల్డ్ కప్ లో భారత్ – పాక్ ఆరుసార్లు పోటీపడ్డాయి. భారత్ అమ్మాయిలు నాలుగు సార్లు గెలిచారు. పాకిస్తాన్ అమ్మాయిలు రెండుసార్లు విజయం సాధించారు. హర్మన్ ప్రీత్ సేన తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది సెమీస్ వెళ్లాలంటే ఎలాగైనా గెలవాలి కాబట్టి.. భారత ప్లేయర్లు అద్భుతమైన ప్రదర్శన చేస్తానని అభిమానులు అంచనా వేస్తున్నారు. అయితే తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో దారుణమైన ఓటమిని అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. తీవ్రమైన ఒత్తిడి ఉండే ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ప్లేయర్లపై పై చేయి సాధిస్తారా? లేక ఒత్తిడిలో మునిగిపోతారా? అనే సందేహాలు అభిమానులను కలవరపెడుతున్నాయి. న్యూజిలాండ్ చేతిలో 58 పరుగుల తేడా తో ఓడిపోవడంతో గ్రూప్ – ఏ లో భారత్ -2.900 నెట్ రన్ రేట్ తో చివరి స్థానంలో పడిపోయింది. ఈ క్రమంలో భారత్ సెమీస్ వెళ్లాలంటే ప్రతి మ్యాచ్ కచ్చితంగా గెలవాలి. తదుపరి శ్రీలంక, ఆస్ట్రేలియా జట్ల పై గెలిచి.. మెరుగైన రన్ రేట్ దక్కించుకుంటే కచ్చితంగా సెమీస్ వెళుతుంది.
పాక్ చేతిలో ఓడిపోతే..
పాకిస్తాన్ జట్టు చేతిలో భారత్ ఓడిపోతే సెమిస్ అవకాశాలు సంక్లిష్టమవుతాయి. అలాంటప్పుడు ఇతర జట్ల ఫలితాలపై కచ్చితంగా ఆధారపడాల్సి ఉంటుంది. మిగిలిన రెండు మ్యాచ్ లలో భారత్ కచ్చితంగా గెలవాలి. పైగా ఆ గ్రూప్ – ఏ లో ఒక్క జట్టు మినహ మిగతా జట్లు.. ఎక్కువగా విజయాలు పొందకూడదు. ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చెరో విజయం దక్కించుకున్నాయి. ఇక ఈ రెండు జట్లు తలపడిన మ్యాచ్ లో విజేతగా నిలిచిన జట్టు.. లీగ్ మ్యాచ్ లలో అజేయంగా నిలవాలి. అప్పుడే భారత్ కు అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కాకుండా భారత్ నేరుగా సెమీఫైనల్ వెళ్లాలంటే.. పాకిస్తాన్, ఆస్ట్రేలియా, శ్రీలంకపై విజయాలు సాధించాలి. భారీ రన్ రేట్ కూడా పొందితే భారత్ కు ఎటువంటి ఇబ్బంది ఉండదు. పైగా నేరుగా సెమీ ఫైనల్ వెళ్తుంది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా మిగతా మ్యాచ్ లలో ఓడిపోతే భారత్ కు ఇక తిరుగుండదు. ఐతే ఇవన్నీ జరగాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. టీ -20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా కథ త్వరగా ముగిస్తే.. భారత్ టైటిల్ నెగ్గడానికి అంత అనువైన పరిస్థితులు ఏర్పడతాయని అభిమానులు పేర్కొంటున్నారు.