Mahesh Babu: మహేష్ బాబు చేసిన ఆ సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం ఇదేనా..?

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి సూపర్ స్టార్ కృష్ణ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ లను అందుకుంటున్న హీరో మహేష్ బాబు... ప్రస్తుతం ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైనప్పటికీ రాజమౌళితో చేయబోతున్న సినిమాతో వరల్డ్ ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు...

Written By: Gopi, Updated On : October 6, 2024 3:05 pm

Mahesh Babu

Follow us on

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి వచ్చినా కూడా మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో హీరోగా మారి తనదైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను చేస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. రాజమౌళితో చేయబోయే సినిమాతో పాన్ వరల్డ్ లో తనను తాను మరొకసారి స్టార్ హీరో గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు మొదటి నుంచి కూడా సినిమాలు సక్సెస్ అవుతాయా ఫెయిల్యూర్ అవుతాయా అనే అంచనా పెట్టుకొని సినిమాలు చేయడం లేదు. తనకు నచ్చిన సబ్జెక్టుని ప్రేక్షకులకు చెప్పాలని ఉద్దేశ్యంతోనే ఆయన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కాబట్టి ఆయనకు సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవి కామన్.. అందుకే ఆయన హిట్టు ప్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు… ఇక ఏది ఏమైనప్పటికీ ఆయన శ్రీనువైట్ల దర్శకత్వంలో చేసిన దూకుడు సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక దాంతో వీళ్ళ కాంబినేషన్ లో ఆగడు అనే సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే విధంగా ఉన్నప్పటికీ ఫైనల్ గా సినిమా మాత్రం ప్లాప్ తెచ్చుకుంది.

కారణం ఏంటి అనే విషయం పక్కన పెడితే ఈ సినిమాలో మహేష్ బాబు చాలా అద్భుతంగా కామెడీని పండించాడు. అలాగే శ్రీను వైట్ల ఈ సినిమాని తెరకెక్కించిన విధానం అక్కడక్కడ ప్రేక్షకుడికి బోర్ కొట్టించినప్పటికి ఓవరాల్ గా సినిమా మాత్రం ఓకే అనిపించేలా ఉంటుంది. కానీ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడానికి గల కారణం ఏంటి అంటే ఆ సినిమాలో కథ పెద్దగా ప్రేక్షకుడిని ఎగ్జైట్ చేయలేదు.

రొటీన్ రెగ్యులర్ సినిమాల మాదిరిగానే ఈ సినిమా ఉండడం. అదే టెంప్లేట్ లో సినిమా సాగడం ఇవన్నీ చూడడం వల్ల ప్రేక్షకుడికి బోర్ కొట్టింది. దానివల్ల ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ అయితే సాధించలేదు. నిజానికి ఆవరేజ్ గా నిలవాల్సిన సినిమా కూడా డిజాస్టర్ అయిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. దీనివల్లే మహేష్ బాబు కెరీర్ కి భారీగా డ్యామేజ్ అయితే ఏర్పడింది. అలాగే శ్రీను వైట్ల కి కూడా ఆగడు సినిమాతో కోలుకోలేని దెబ్బ తాకిందనే చెప్పాలి…

ఇక ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం శ్రీనువైట్ల గోపీచంద్ హీరోగా విశ్వం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. మరి ఈ సినిమాతో సక్సెస్ సాధించి మరోసారి మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…