Ind W Vs Aus W Semi Final 2025: సూపర్ సెంచరీ తో జెమీమా రోడ్రిగ్స్(127*) టీమ్ ఇండియాను గెలిపించింది.. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన మ్యాచ్లో ఇండియాను వన్డే వరల్డ్ కప్ ఫైనల్ దాకా చేర్చింది. వాస్తవానికి ఈ పోరులో జెమీమా పట్టు వదలకుండా పోరాడింది. చివరి వరకు నిలబడి జట్టు విజయాన్ని చూసి.. కన్నీటి పర్యంతమైంది. ఆస్ట్రేలియా బౌలర్లకు సింహ స్వప్నం లాగా నిలిచింది.
Also Read: సెంచరీ కొట్టినా నో సెలబ్రేషన్స్.. గెలిచేదాకా పోరాటం.. జెమీమా పట్టుదలకు సలాం
జెమీమా కు అద్భుతమైన ఫుట్ వర్క్ ఉంటుంది. బీభత్సంగా బ్యాటింగ్ చేస్తుంది. అయితే టీమిండియా ఇన్నింగ్స్ సమయంలో 32.3 ఓవర్ వద్ద అలానా కింగ్ బౌలింగ్ లో జెమీమా అంచనా తప్పింది.. బంతి గమనాన్ని వేరే విధంగా ఊహించి షాట్ కొట్టడానికి ప్రయత్నించింది. అయితే ఆ బంతి బ్యాట్ చివరి ఎడ్జ్ తగిలి పైకి లేచింది. దీంతో వికెట్ కీపర్ హీలి వేగంగా పరుగులు పెట్టుకుంటూ వచ్చింది. ఆ బంతిని అందుకునే క్రమంలో తడబాటుకు గురైంది. దీంతో క్యాచ్ జార విడిచింది.
ఆ క్యాచ్ డ్రాప్ కావడంతో జెమీమా ఊపిరి పీల్చుకుంది. అప్పటికి ఆమె స్కోరు 83 పరుగులు. ఒకవేళ జెమీమా ఇచ్చిన క్యాచ్ ను హీలి గనక పట్టి ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది. అప్పటికి హర్మన్ 78 పరుగులు చేసింది. అయితే వచ్చిన ఈ అవకాశాన్ని జెమీమా సద్వినియోగం చేసుకుంది. ఇదే క్రమంలో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పి జెమీమా టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించింది. సెంచరీ చేసిన తర్వాత 106 పరుగుల వద్ద జెమిమా ఉన్నప్పుడు సదర్ ల్యాండ్ బౌలింగ్లో భారీ షాట్ ఆడింది. ఆ బంతిని బౌండరీ లైన్ వద్ద అందుకునే క్రమంలో మెక్ గ్రాత్ వదిలిపెట్టింది. వాస్తవానికి సెంచరీ చేసినప్పటికీ కూడా జెమీమా పెద్దగా సంబరాలు జరుపుకోలేదు. ప్రేక్షకులకు అభివాదం కూడా చేయలేదు. ఎప్పుడైతే జట్టు గెలిచిందో.. అప్పుడే జెమీమా లో ఆనందం కట్టలు తెంచుకుంది. కన్నీటి పర్యంతమవుతూ తోటి ప్లేయర్లను దగ్గరికి తీసుకుంది. కోచ్ ఆశీస్సులు అందుకుంది.
వాస్తవానికి హీలి గనుక ఆ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ గమనం మరో విధంగా ఉండేది. మెక్ గ్రాత్ కూడా ఆ క్యాచ్ అందుకుంటే పరిస్థితి ఇంకో విధంగా ఉండేది. హీలి క్యాచ్ పడితే కచ్చితంగా జెమీమా అవుట్ అయ్యేది. ఆ తర్వాత కొద్ది పరుగుల తేడాతో కెప్టెన్ హార్మన్ అవుట్ అయింది. ఇదే కనుక జరిగితే టీం ఇండియా తీవ్రంగా ఇబ్బంది పడేది. హీలి క్యాచ్ జార విడవడం వల్ల టీమ్ ఇండియాకు మేలు జరిగింది. అద్భుతమైన విజయాన్ని జెమీమా ద్వారా జట్టుకు లభించింది.