Ravichandran Ashwin: వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఐదు వికెట్లు తీసుకోవడం ద్వారా టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అనేక రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు. గింగిరాలు తిరిగే బంతులతో వెస్టిండీస్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టిన అశ్విన్.. మొదటి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ జట్టు 150 పరుగులకు పరిమితం కావడంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ మ్యాచ్ లో భారత్ పట్టు బిగించే అవకాశాన్ని కల్పించడంతోపాటు అనేక రికార్డులను నమోదు చేసుకోవడం ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించాడు అశ్విన్.
వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో ఐదు వికెట్లు తీయడం ద్వారా రవిచంద్రన్ అశ్విన్ అనేక ఘనతలు తగ్గించుకున్నాడు. అత్యధిక క్లీన్ బౌల్డ్ చేసిన భారత బౌలర్లలో టాప్ లో నిలిచాడు అశ్విన్. 95 వికెట్లతో అశ్విన్ అగ్రస్థానంలో ఉండగా, 94 వికెట్లతో అనిల్ కుంబ్లే రెండో స్థానంలో, 88 వికెట్లతో కపిల్ దేవ్ మూడో స్థానంలో, 66 వికెట్లతో మహమ్మద్ సమీ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ ప్లేయర్ టగ్ నరైన్ చందర్ పాల్ వికెట్ తీయడం ద్వారా అరుదైన ఘనతను అశ్విన్ దక్కించుకున్నాడు. 2011లో వెస్టిండీస్ మాజీ దగ్గర ఆటగాడు శివ నారాయణ చంద్రపాల్ వికెట్ పడగొట్టిన అశ్విన్.. తాజా మ్యాచ్ లో అతని కుమారుడు వికెట్ తీయడం ద్వారా తండ్రీ కొడుకులు ఇద్దరినీ అవుట్ చేసిన ఘనతను దక్కించుకున్నాడు. ఓవరాల్ గా ఇటువంటి ఘనతను దక్కించు హలో కున్న ఐదో బౌలర్ గా చరిత్రలో నిలిచాడు.
700కుపైగా అంతర్జాతీయ వికెట్లు తీసిన బౌలర్ అశ్విన్..
రవిచంద్రన్ అశ్విన్ ఇదే మ్యాచ్లో మరో ఘనతను దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు 700కుపైగా అంతర్జాతీయ వికెట్లు తీసిన మూడో భారత బౌలర్ గా రికార్డు సృష్టించాడు. ఎప్పటి వరకు 92 టెస్ట్ మ్యాచ్లు ఆడిన అశ్విన్ 479 వికెట్లు పడగొట్టాడు. అలాగే 113 వన్డే మ్యాచ్ లు ఆడిన అశ్విన్ 151 మందిని అవుట్ చేశాడు. అలాగే, 65 టి20 మ్యాచులు ఆడిన అశ్విన్ 72 వికెట్లు పడగొట్టాడు. తద్వారా 700 పైగా అంతర్జాతీయ వికెట్లను పడగొట్టిన మూడో భారత బౌలర్ గా రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో 33 సార్లు ఐదు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఓవరాల్ గా ఆరో స్థానంలో నిలిచాడు అశ్విన్. అశ్విన్ టెస్టుల్లో ఇప్పటి వరకు ఏడుసార్లు 10 వికెట్ల తీసిన ఘనతను దక్కించుకున్నాడు. టెస్టుల్లో అద్వితీయమైన రికార్డును నమోదు చేసుకున్న అశ్విన్ ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలించే పిచ్ అన్న కారణంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆడించలేదు. ఈ మ్యాచ్ లో భారత జట్టు ఓడిపోవడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.