IND vs SL: మూడో వన్డేలో భారీ మార్పులు

రాహుల్ ద్రావిడ్ కోచ్ గా శిఖర్ ధావన్ కెప్టెన్ గా శ్రీలంకలో పర్యటిస్తున్న యువ భారత జట్టు సత్తా చాటుతోంది. యంగ్ ప్లేయర్లతో రెట్టించిన ఉత్సాహంతో లంకలో దున్నేస్తోంది. ఇప్పటికే మొదటి వన్డేలో ఈజీగా గెలిచిన టీమిండియా.. రెండో వన్డేలో ఓటమి అంచులో బౌలర్ దీపక్ చాహర్ అద్భుత పోరాటంతో ఈజీగా గెలిచింది. శ్రీలంక గడ్డపై అదరగొడుతోంది. ఇప్పటికే 2 మ్యాచ్ లు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. మూడో వన్డే కోసం ఈరోజు లంకతో తలపడుతోంది. […]

Written By: NARESH, Updated On : July 23, 2021 11:22 am
Follow us on

రాహుల్ ద్రావిడ్ కోచ్ గా శిఖర్ ధావన్ కెప్టెన్ గా శ్రీలంకలో పర్యటిస్తున్న యువ భారత జట్టు సత్తా చాటుతోంది. యంగ్ ప్లేయర్లతో రెట్టించిన ఉత్సాహంతో లంకలో దున్నేస్తోంది.

ఇప్పటికే మొదటి వన్డేలో ఈజీగా గెలిచిన టీమిండియా.. రెండో వన్డేలో ఓటమి అంచులో బౌలర్ దీపక్ చాహర్ అద్భుత పోరాటంతో ఈజీగా గెలిచింది. శ్రీలంక గడ్డపై అదరగొడుతోంది. ఇప్పటికే 2 మ్యాచ్ లు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. మూడో వన్డే కోసం ఈరోజు లంకతో తలపడుతోంది. మూడో వన్డే ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవడంతో ఇప్పుడు క్లీన్ స్వీప్ లక్ష్యంగా టీమిండియా బరిలో దిగుతోంది.

ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకోవడంతో టీమిండియా ప్రయోగాలు చేయబోతోంది. రిజర్వ్ బెంచ్ ను పరీక్షించబోతోంది. రిజర్వ్ ఆటగాళ్లతోనూ లంకను వైట్ వాష్ చేయాలని గబ్బర్ సేన చూస్తోంది. తొలి రెండు వన్డేల్లో టీమిండియా దుమ్ములేపింది. గెలవాలనే కసితో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకోవడంతో ఇప్పుడు రిజర్వ్ బెంచ్ ను ఆడించడానికి రెడీ అయ్యింది. ఇక గత మ్యాచ్ లో టీమిండియాను గెలిపించిన దీపక్ చాహర్ కు విశ్రాంతినిచ్చి నవదీప్ సైనీకి అవకాశం ఇవ్వొచ్చు.

గాయం నుంచి కోలుకున్న సంజూశాంసన్ కు చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇషాన్ కిషన్ స్థానంలో అతడికి చోటు దక్కవచ్చు. ఇక రెండో వన్డేలో విఫలమైన కుల్దీప్ స్థానంలో రాహుల్ చాహర్ లేదా వరుణ్ చక్రవర్తిల్లో ఒకరికి చాన్స్ దక్కే అవకాశం ఉంది.

అయితే రెండు వన్డేల్లో ఓడిపోయిన శ్రీలంక పరిస్థితి దారుణంగా ఉంది. రెండో వన్డేలో అద్భుతంగా రాణించినా విజయం ముంగిట ఆ జట్టు బోల్తా పడింది. టీమిండియాను మొత్తం ఆలౌట్ చేయలేకపోతోంది. మూడో వన్డేలోనైనా సత్తా చాటాలని భావిస్తోంది. రెండో వన్డేలో దాదాపు గెలుపు ఖాయమై.. అనుభవలేమితో చేజేతులా విజయాన్ని దూరం చేసుకుంది. గత మ్యాచ్ లో గాయపడ్డ భానుక రాజపక్స్ స్థానంలో పాతుమ్ నిస్సంకను తీసుకోవచ్చు. ఇక లక్షన్ సందకన్ స్థానంలో అకిలా ధనుంజయకు అవకాశం ఇవ్వచ్చు.