రఘురామతో చంద్రబాబు.. ఎప్పటికైనా డేంజరే?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తలపండిన నేతగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును చెప్పుకోవచ్చు. గతంలో ఆయన నిర్ణయాలతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఉన్నా రాను రాను రాజుగారి గుర్రం గాడిదయింది అన్న చందంగా మారాయి. ఆయన ఆలోచనల్లో కొత్త దనం లేకుండా పోతోంది. పైగా చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారనే మరో ఆరోపణ కూడా చోటుచేసుకుంటోంది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోయాలనే తపనతో ఓటుకునోటు కేసులో అడ్డంగా బుక్కయి అభాసు పాలయ్యారు. ఇప్పుడు తాజాగా రఘురామ కృష్ణంరాజు కేసులో […]

Written By: Srinivas, Updated On : July 23, 2021 10:14 am
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తలపండిన నేతగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును చెప్పుకోవచ్చు. గతంలో ఆయన నిర్ణయాలతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఉన్నా రాను రాను రాజుగారి గుర్రం గాడిదయింది అన్న చందంగా మారాయి. ఆయన ఆలోచనల్లో కొత్త దనం లేకుండా పోతోంది. పైగా చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారనే మరో ఆరోపణ కూడా చోటుచేసుకుంటోంది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోయాలనే తపనతో ఓటుకునోటు కేసులో అడ్డంగా బుక్కయి అభాసు పాలయ్యారు. ఇప్పుడు తాజాగా రఘురామ కృష్ణంరాజు కేసులో తలదూర్చి తలనొప్పులు తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది.

వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి రఘురామను వాడుకుంటున్నారనే అపవాదు మూటకట్టుకుంటున్నారు. చంద్రబాబు కుట్రలను వైసీపీ ఇన్నాళ్లు కనిపెట్టలేకపోయిందా అని ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై చంద్రబాబును బాధ్యుడిని చేస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని వైసీపీ భావిస్తున్నా అది నెరవేరేలా కనిపించడం లేదు. ఎంపీ రఘురామ విషయంలో టీడీపీ బహిరంగంగానే మద్దతునిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నేత జగన్ ప్రతిష్టను దిగజార్చడమే ఉద్దేశంగా టీడీపీ కుట్రలు చేస్తుందని బహిరంగంగా వైసీపీ ఆరోపిస్తోంది.

జగన్ బెయిల్ రద్దు విషయంలో న్యాయసలహాలను బాబు నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు చేసినట్లు వైసీపీ భావిస్తోంది. అయితే చంద్రబాబును దోషిగా నిలబెట్టి తమ ప్రయోజనాలు సాధించుకోవాలని వైసీపీ తలపిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇమేజ్ ను దెబ్బతీయాలనే ప్రయత్నాలు చేస్తోంది. గతంలో కూడా ఇదే తరహాలో నోటుకు ఓటు కేసులో చంద్రబాబు తలదూర్చి అపహాస్యం పాలైనట్లు తెలుస్తున్నా ఆయనలో మార్పు రాకపోవడం గమనార్హం.

ఈ వ్యవహారంపై పట్టించుకోవాల్సిన కేంద్రం చోద్యం చూస్తోంది. ఇందులో ఇద్దరికి నష్టం జరిగినా తమకే లాభం చేకూరుతుందని భావిస్తున్నట్లు సమాచారం. జగన్, చంద్రబాబు నాయుడు పరస్పర కలహాలతో నాశనమైతే తమ పార్టీ బీజేపీకి ఎంతో కొంత ప్రయోజనం కలుగుతుందని చూస్తోంది. అందుకే వీరిద్దరి వ్యవహారంలో తలదూర్చక రఘురామపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. మొత్తానికి ఈ వ్యవహారంలో బీజేపీ స్తబ్దుగా ఉండడంపై ఇరు పార్టీలు సైతం పట్టించుకోవడం లేదు. తమ అంతర్గత కలహాలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం.