IND VS SA: టీంఇండియా త్వరలోనే దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. భారత్ జట్టు దక్షిణాఫ్రికాతో ఆడే టెస్ట్ జట్టుకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీని ప్రకటించగా.. వన్డే సిరీసుకు కెప్టెన్ గా రోహిత్ శర్మను బీసీసీఐ ప్రకటించింది. అయితే తనను వన్డే కెప్టెన్ గా తొలగించడంపై కోహ్లీగా గుర్రుగా ఉన్నాడని తెలుస్తోంది. దీంతో అసలు బీసీసీఐ అధికారులకు ఆయన టచ్లోకి రావడం లేదనే టాక్ విన్పిస్తోంది.
దక్షిణాఫ్రికాతో 3టెస్టుల సిరీస్‌కు ఎంపికైన టీమిండియా జట్టు నిన్ననే ముంబైకి చేరుకుంది. ఈ సమావేశంలో కోహ్లీ మినహా మిగతా వారంతా పాల్గొన్నారు. వీరంతా కూడా ముంబైలోనే మూడు రోజులపాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. అయితే కోహ్లీ మాత్రం ఇంకా ముంబైకి చేరుకోకపోవడంతో అసలు అతడు దక్షిణాఫ్రికా పర్యటనకు వస్తాడా? రాడా? అన్న ఉత్కంఠత నెలకొంది.
దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికైన 18మంది ప్లేయర్స్ తోపాటు హెడ్ కోచ్, సహాయక సిబ్బంది, నెట్ బౌలర్లు అందరూ ఆదివారం మధ్యాహ్నంలోగా ముంబైలో రిపోర్టు చేయాలని బీసీసీఐ ఆదేశించింది. సోమవారం నుంచి మూడురోజులపాటు క్వారంటైన్లో తప్పకుండా గడపాలని పేర్కొంది. ఆ తర్వాత అందరూ ప్రత్యేక విమానంలో దక్షిణాఫ్రికాకు బయలుదేరాలని బీసీసీఐ నిర్ణయించింది.
ఈమేరకు నిన్ననే టీమ్ ఇండియా టెస్టు జట్టు మొత్తం ముంబై చేరుకున్నది. ఆదివారం సాయంత్రం ప్రాక్టీస్ కూడా చేశారు. కానీ టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం ఇప్పటివరకు జట్టుతో కలువలేదు. దీంతో అందరూ కోహ్లీ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. కాగా కోహ్లీ శిబిరానికి రాకపోవడంతో సెలెక్టర్లు, పలువురు బీసీసీఐ అధికారులు అతడికి కాల్ చేయడానికి ప్రయత్నించారని తెలుస్తోంది.
Also Read: ‘డేవిడ్’ కోసం భారీ స్కెచ్ వేసిన ఆర్సీబీ..!
అయితే కోహ్లీ మాత్రం అసలు ఫోన్ ఎత్తడం లేదట. ఆదివారం రాత్రి వరకు కూడా అతడి నుంచి రిటర్న్ కాల్ రాలేదని తెలుస్తోంది. దీంతో కోహ్లీ తనను వన్డే కెప్టెన్ తొలగించడంపై అవమానంగా ఫీలవుతున్నాడనే వార్తలు విన్పిస్తున్నారు. ఈ కారణంగానే అతడు జట్టు సభ్యులతో కలువలేకపోతున్నాడని తెలుస్తోంది. దీంతో అతడు దక్షిణాఫ్రికా పర్యటనకు వస్తాడా రాడా అనే చర్చ అభిమానుల మధ్య నడుస్తోంది.
ఇదిలా ఉంటే టీమ్ ఇండియా టెస్టు జట్టు సభ్యులు రోహిత్ శర్మ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శార్దుల్ ఠాకూర్ సహా ఇతర ఆటగాళ్లు జట్టుతో కలిశారు. పరాస్ ముంబ్రే ఆదివారం సాయంత్రం కాసేపు బౌలింగ్ శిక్షణను కూడా పర్యవేక్షించారు. మొత్తానికి దక్షిణాఫ్రికా పర్యటనకు ముందే టీంఇండియాలో లుకలుకలు బయట పడుతుండటంతో అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.
Also Read: దక్షిణాఫ్రికా పర్యటనకు రోహిత్ శర్మ దూరమేనా?