IND vs SA : కేఎల్ రాహుల్ అరుదైన రికార్డ్.. ఆ విషయంలో సౌతాఫ్రికాని ఓడించిన ఒకే ఒక ఇండియన్ కెప్టెన్

3 వన్డేల సిరీస్ లో ఇండియన్ టీమ్ మొదటి మ్యాచ్ గెలిచి తన ఆధిపత్యాన్ని చూపించు కుంది.ఇక ఇంకో రెండో మ్యాచ్ ల్లో ఒక మ్యాచ్ లో గెలిచిన ఈ సీరీస్ ఇండియా సొంతం అవుతుంది...

Written By: NARESH, Updated On : December 18, 2023 11:05 am
Follow us on

IND vs SA : సౌతాఫ్రికా ఇండియా మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా టీం 116 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ టీంలో ఎవరు కూడా అంత మంచి పర్ఫామెన్స్ ఇవ్వకపోవడంతో ప్లేయర్లందరు ఒక్కసారిగా చతికల పడిపోయారు. ముఖ్యంగా మన బౌలర్ల దాటిని తట్టుకోలేక ప్లేయర్లందరు చేతులెత్తేయడం నిజంగా ఒక వంతుకు ఆశ్చర్యానికి గుర్తు చేసింది.

సౌతాఫ్రికా బలమైన టీం 116 పరుగులకు ఆల్ అవుట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఇక అందులో మన బౌలర్లని మెచ్చుకోకుండా ఉండలేం ముఖ్యంగా హర్షదీప్ సింగ్ తన కెరీర్ లోనే అత్యుత్తమమైన బౌలింగ్ ప్రదర్శనని కడపచాడు సౌతాఫ్రికా టీమ్ మీద 5 వికెట్లు తీసి తనదైన రీతిలో సత్తా చాటుకున్నాడు. అలాగే ఆవేశ్ ఖాన్ కూడా ఇప్పటి వరకు టీమ్ లోకి వస్తూ వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ మ్యాచ్ లో 4 వికెట్లు తీసి తన సత్తా చాటుకున్నాడు. ప్రస్తుతం ఇండియా టీమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అని చెప్పడానికి ఈ ఒక్క మ్యాచ్ ని ఉదాహరణకు తీసుకోవచ్చు…

ఇక సౌతాఫ్రికా టీమ్ 116 పరుగులకు ఆల్ ఔట్ అయింది.ఇక 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియన్ టీం ఓపెనర్ ప్లేయర్ అయిన రుతురాజ్ గైక్వాడ్ పెద్దగా ఆకట్టుకొనప్పటికి మరొక ఓపెనర్ అయిన సాయి సుదర్శన్ అలాగే శ్రేయాస్ అయ్యర్ ఇద్దరు తమదైన రీతిలో హాఫ్ సెంచరీ చేసి టీం కి విజయాన్ని అందించారు…ఇక అతని కెరియర్ లోనే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనను కనబరిచిన అర్షదీప్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిర్ణయించారు… ఇక ఇదిలా ఉంటే నిన్న సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడడానికి బరిలోకి దిగింది. అయితే ఫస్ట్ టైం పింకు జెర్సీలో బరీ లోకి దిగిన సౌతాఫ్రికా టీం ని ఇండియన్ టీమ్ దారుణంగా ఓడించింది. ఇక పింక్ జర్సీ లో బరిలోకి దిగిన సౌతాఫ్రికా టీం ను ఓడించిన ఇండియన్ టీం కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ఒక అరుదైన రికార్డుని క్రియేట్ చేశాడు…

ఇంతకుముందు పింక్ జెర్సీలో ఆడినప్పుడు ప్రతిసారి ప్లేయర్లు చెలరేగి ఆడేవారు. కానీ ఈసారి మాత్రం మన బౌలర్ల దాటికి చతికల బడ్డారు…ఇక 3 వన్డేల సిరీస్ లో ఇండియన్ టీమ్ మొదటి మ్యాచ్ గెలిచి తన ఆధిపత్యాన్ని చూపించు కుంది.ఇక ఇంకో రెండో మ్యాచ్ ల్లో ఒక మ్యాచ్ లో గెలిచిన ఈ సీరీస్ ఇండియా సొంతం అవుతుంది…