IND Vs SA World Cup Final: మహిళల వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్ దాకా వెళ్లడం ఇదే తొలిసారి కాదు. కాకపోతే ఈసారి జట్టు గతంలో ఎన్నడు లేనంతగా బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టును ఓడించి ఫైనల్ దాకా వెళ్ళింది. 300కు పైగా పరుగుల లక్ష్యాన్ని ఫినిష్ చేసి అదరగొట్టింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టుపై కూడా ఇదే స్థాయిలో ఆడాలని.. తొలిసారి ట్రోఫీ అని సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. పైగా ఆదివారం సెలవు రోజు కావడం.. ఆరోజు ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో అందరు కూడా టీవీలు, ఫోన్ లకు అతుక్కుపోవడం ఖాయమని తెలుస్తోంది.
2005 లో మిథాలీ రాజు నేతృత్వంలో టీమిండియా వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ దాకా వెళ్ళింది. అయితే ఆస్ట్రేలియా జట్టు దూకుడు ముందు టీమ్ ఇండియా నిలబడలేకపోయింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆ టార్గెట్ ఫినిష్ చేయడంలో టీమ్ ఇండియా విఫలమైంది. భారత జట్టు తరుపున అంజూ జైన్ చేసిన 29 పరుగులు టాప్ స్కోర్ అంటే భారత బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కెప్టెట్ మిథాలీ రాజ్ 6 పరుగులకే అవుట్ అయింది. ఈ నేపథ్యంలో నాటి మ్యాచ్లో భారత జట్టు 46 ఓవర్ల పాటు ఆడినప్పటికీ 117 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.
2017లో భారత మహిళల జట్టు అద్భుతంగా ఆడింది.. సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా జట్టును ఓడించి ఫైనల్ దాకా వెళ్ళింది. వెంట్రుక వాసి తేడాలో ట్రోఫీని కోల్పోయింది. ఇంగ్లాండ్ జట్టుపై పోరాడి ఓడిపోయింది. నాటి మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. సివర్ 51, సారా 45 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. భారత జట్టులో గోస్వామి మూడు, పూనం యాదవ్ రెండు వికెట్లతో అదరగొట్టారు. 229 రన్స్ టార్గెట్ ఫినిష్ చేయడంలో టీమిండియా ప్రారంభం నుంచి దూకుడు కొనసాగించింది. ఈ నేపథ్యంలో 219 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఓపెనర్ పూనమ్ యాదవ్ 86, హర్మన్ ప్రీత్ కౌర్ 51, వేద కృష్ణమూర్తి 35 పరుగులు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. స్మృతి సున్నా పరుగులకు అవుట్ కావడం.. మిథాలీ 17 పరుగులు మాత్రమే చేయడంతో భారత్ చివరి దశలో తలవంచాల్సి వచ్చింది. నాకు ఇంగ్లాండ్ బోర్డర్ అన్య ష్రబ్సోల్ 6/46 అద్భుతంగా ప్రదర్శన చేయడంతో భారత జట్టు ఓడిపోవలసి వచ్చింది.
గత రెండుసార్లతో పోల్చి చూస్తే ఈసారి టీం మీడియా బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యువ ప్లేయర్లు అదరగొడుతున్నారు. స్పిన్ బౌలర్లు సత్తా చూపిస్తున్నారు. బ్యాటింగ్ కూడా బలంగా ఉంది. ఫీల్డింగ్ లో మెరుపులు మెరిపిస్తే టీమ్ ఇండియాకు అడ్డనేది ఉండదు..