https://oktelugu.com/

Ind vs SA: సౌతాఫ్రికాతో టీమిండియా ఫైట్.. గెలుపు డిసైడ్ అయ్యేది నేడే.. ఏం జరుగనుంది?

Ind vs SA: భారత్-దక్షిణాఫ్రికా రెండో టెస్ట్ పై ఇరు జట్లు ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూస్తున్నాయి. రెండో రోజు జరిగిన ఆటలో రెండు టీములు బలాన్ని చూపెట్టాయి. దక్షిణాఫ్రికా స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించినా ఇండియా కూడా సమ ఉజ్జీగా నిలిచి విజయంపై ఆశలను సజీవంగా ఉంచుకుంది. దీంతో రెండో టెస్ట్ రసకందాయంలో పడింది. మ్యాచ్ లో ఆధిపత్యం కోసం పోరాడుతున్నాయి. రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్లిద్దరిని కోల్పోయినా భారత్ 58 పరుగుల ఆధిక్యంలో ఉంది. విజయం కోసం […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 5, 2022 / 10:45 AM IST
    Follow us on

    Ind vs SA: భారత్-దక్షిణాఫ్రికా రెండో టెస్ట్ పై ఇరు జట్లు ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూస్తున్నాయి. రెండో రోజు జరిగిన ఆటలో రెండు టీములు బలాన్ని చూపెట్టాయి. దక్షిణాఫ్రికా స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించినా ఇండియా కూడా సమ ఉజ్జీగా నిలిచి విజయంపై ఆశలను సజీవంగా ఉంచుకుంది. దీంతో రెండో టెస్ట్ రసకందాయంలో పడింది. మ్యాచ్ లో ఆధిపత్యం కోసం పోరాడుతున్నాయి. రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్లిద్దరిని కోల్పోయినా భారత్ 58 పరుగుల ఆధిక్యంలో ఉంది.

    Ind vs SA

    విజయం కోసం రెండు జట్లు శ్రమిస్తున్నాయి. చారిత్రక విజయం కోసం ఇండియా పోరాడుతుంటే పరువు నిలబెట్టుకోవాలని ఆతిథ్య జట్టు ఆరాటపడుతోంది. శార్దూల్ విజయవంతమైన ప్రదర్శనతో ఇండియా పోటీలో నిలబడింది. 61 పరుగులిచ్చి ఏడు వికెట్లు తీసిన శార్దూల్ ఇండియాకు బాసటగా నిలిచాడు. దీంతో దక్షిణాఫ్రికా ఆధిపత్యాన్ని అడ్డుకున్నాడు. భారత్ రెండో ఇన్నింగ్స్ లో 44 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో పుజారాతో పటిష్ట స్థితికి చేరుకుంది.

    Also Read: శార్దూల్ విజృంభణతో టీమిండియాకు విజయం దక్కేనా?

    అయితే మూడో రోజు ఆటలో మన ఆటగాళ్ల ప్రతిభ మీద మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. దీంతో దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని పరుగులు రాబడితే విజయం మనదే. కానీ వారి ధాటికి కుప్పకూలితే మాత్రం కష్టమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో మన జట్టు ఏమేరకు పరుగులు రాబడుతుందో వేచి చూడాల్సిందే. దక్షిణాఫ్రికా దూకుడుకు అడ్డు కట్ట వేసే క్రమంలో బౌలర్లు, బ్యాట్స్ మెన్ సమష్టిగా రాణించాల్సిందే.

    శార్దూల్, ఠాకూర్ దక్షిణాఫ్రికా పరుగుల వరదకు అడ్డుకట్ట వేశారు. భారత్ కు విజయం పై ఆశలను సజీవం చేశారు. పోటీలో ఉండేలా తమ అద్భుతమైన ఆట తీరును కొనసాగించారు. ఆతిథ్య జట్టును దెబ్బ తీయడంలో కీలకపాత్ర పోషించారు. మొత్తానికి టీమిండియా మరో విజయం సాధిస్తే చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

    Also Read: టీమిండియాకు కోహ్లి గుడ్ బై చెప్పనున్నాడా?

    Tags